Tuesday, November 1, 2016

[తెలుగుబ్లాగు:22408] లేఖినిలో వ్రాసినది వర్డ్ లో పేస్ట్ చేస్తే..

[తెలుగుబ్లాగు:22408] లేఖిని నించీ వర్డ్ లోకి కాపీ చేసిన తెలుగు పదాల మధ్య స్పేస్  సరిగ్గా రావటం లేదు ఏమి చేయాలి? తెలియ చేయ ప్రార్ధన !! ( మొదటి స్క్రీన్ షాట్ ని చూడండి )

 సరిగ్గా రావటం లేదు ఏమి చేయాలి? తెలియ చేయ ప్రార్ధన !!


లేఖిని లో వ్రాసిన విషయాన్ని, కాపీ చేసుకొని, వర్డ్ లో పేస్ట్ చేసుకుంటే - పదాల మధ్యన ఎక్కువ స్పేస్ రావటం లేదన్నది మీ అనుభవం. ఇలా పదాల మధ్యన ఉండే స్పేస్ మరింత ఎక్కువ స్పేస్ రావటం ఎలాగో క్రిందన స్క్రీన్ షాట్స్ లలో చూడండి. నిజానికి ఇది చా...లా  చిన్న విషయం.  ఎంతగా అంటే ఓస్.. ఇంతేనా అన్నట్లుగా.. 

ముందుగా మీరు లేఖినిని ( http://lekhini.org )  తెరచి, మీరు పైగదిలో ఇంగ్లీష్ లో టైపింగ్ చేస్తుంటే క్రిందన ఉన్న గడిలో వెనువెంటనే తెలుగులోకి మారుతుంది. ఈ విషయం అందరికీ తెలిసినదే.. ఈ వచ్చిన తెలుగును మార్కింగ్ చేసి, కాపీ చేసుకొని వర్డ్ లోకి పేస్ట్ చేసుకోవాలి. అలా వర్డ్ లో పేస్ట్ చేసుకున్నప్పుడు - పదాల మధ్యన ఉండే స్పేస్ తగ్గిపోయి, పదాలు కాస్త దగ్గర దగ్గరగా ఉన్నట్లు అగుపిస్తాయి. దీన్ని రెండురకాలుగా ప్రయత్నించి, విజయం సాధించవచ్చు. 

మొదటి పద్ధతి :  
లేఖినిలో టైపింగ్ చేస్తున్నప్పుడు పదాల మధ్యన మీరు వాడే ఒకసారి వాడే స్పేస్ ట్యాబ్ ని రెండుసార్లు నొక్కండి. దీనివల్ల పదాల మధ్య మరింత జాగా Gap వస్తుంది. అంటే మీరు పదాల మధ్యన పెట్టే స్పేస్ సింగిల్ స్ట్రోక్ కాకుండా - డబల్ స్ట్రోక్ వాడి, టైపు చెయ్యండి. మీ టైపింగ్ పూర్తయ్యాక దాన్ని కాపీ చేసి, ఎమ్మెస్ వర్డ్ MS Word లో పేస్ట్ చేస్తే మీరనుకున్నట్లు పదాల మధ్య వచ్చే స్పేస్ మీరు అనుకున్నట్లుగా ఎక్కువ నిడివితో వస్తుంది. అది ఎలానో ఈ క్రింది స్క్రీన్ షాట్ ని గమనించండి. 


పైనున్న స్క్రీన్ షాట్ ని చూశారు కదూ.. పదాల మధ్యన చాలా ఎడం గా స్పేస్ వచ్చింది. ఇలా కాకుండా నేరుగా మీరు ఎమ్మెస్ వర్డ్ లో నేరుగా టైపింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ డబల్ స్పేస్ నొక్కడం కొన్నిసార్లు మరచిపోవచ్చు లేదా ఇంకా ఎక్కువ సార్లు స్పేస్ నొక్కడం వల్ల మరింత జాగాలు ఏర్పడవచ్చు. ఇలా డబల్ స్పేస్ నొక్కడం అలవాటయ్యాక మామూలుగా ఏది టైపు చేసినా అలాగే డబల్ స్పేస్ నొక్కడం అలవాటయ్యి, ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేరుగా ఎమ్మెస్ వర్డ్ లో టైపింగ్ చెయ్యడం నేర్చుకోండి. అలా చేస్తే చాలా సులభముగా ఉంటుంది. నామటుకు మాత్రం నేను - ఈ బ్లాగ్ లో పోస్ట్ పెట్టినప్పుడు నేరుగా బ్లాగర్ ని తెరచి, అందులోనే తెలుగుని టైపు చేస్తుంటాను. 

ఇక రెండో పద్ధతీ ఉంటుంది. ఆ పద్ధతి కూడా సులభమైనదే.. 
రెండవ పద్ధతి : 
వీవెన్ గారి కోరిక మేరకు మీరు జత చేసిన స్క్రీన్ షాట్ ని గమనిస్తే - అది క్రాప్ / కత్తిరించబడినది కాకుండా మొత్తం తెరపట్టు అయి ఉంటే నేను చెప్పే సమాధానం తేలికగా ఉండేది.. మీరు చాలా పాత వర్షన్ MS Office word వాడుతున్నారులా ఉంది. ( క్రొత్త వెర్షన్ లలో మరిన్ని సౌకర్యాలు అందుకోగలరు. అయితే మీ సమస్యకు ఈ వెర్షన్ అప్డేట్ ఏమాత్రం అడ్డంకి కాదు.. ) పూర్తిగా ఉండే స్క్రీన్ షాట్ వల్ల - మీరు లేఖినిలో వ్రాసుకున్న దానిని ఈ MS Word లో ఏ ఫాంట్ డిఫాల్ట్ గా ఉన్నప్పుడు పేస్ట్ చేసుకున్నారో తెలిసేది. అందువల్ల మీకు అలా పదాలు దగ్గరగా వచ్చాయని అనుకుంటున్నాను. అయినా సరే!.. చిన్న మార్పు వల్ల తేలికగా ఎక్కువ స్పేస్ వచ్చేలా చేసుకోవచ్చు. 

లేఖినిలో Single spaceతో  మీరు టైపు చేసుకున్న విషయాన్ని వర్డ్ లోకి ఇంతకు ముందు ఎలా కాపీ, పేస్ట్ చేసుకున్నారో అలాగే చేసుకోండి. అలా పేస్ట్ అయిన విషయాన్ని సేవ్ చేసుకొనే ముందు - ఆ విషయాన్ని అంతా మార్క్ చెయ్యండి. అలా చేశాక ఒక్కో ఫాంట్ ని మారుస్తూ వెళ్ళండి. తెలుగు ఫాంట్స్ మీదుగా కాకుండా, ఇంగ్లీష్ ఫాంట్స్ ఎన్నుకుంటూ - స్పేస్ ని గమనిస్తూ వెళ్ళండి. కొన్ని ఫాంట్స్ / ఖతుల వల్ల మీకు అనుకున్న స్పేస్ ఖచ్చితముగా వస్తుంది. ఇదే నేను చెప్పాలనుకున్న రెండో పరిష్కారం. 

ఇందులో కూడా మీరు లేఖినిలో మొదట్లో ఎలా టైపింగ్ చేసుకున్నారో, ( అంటే డబల్ స్పేస్ Double space కాకుండా సింగిల్ స్పేస్ Single space వాడి ) అలాగే టైప్ చేసుకోండి. ఆతర్వాత కీ బోర్డ్ సహాయముతో గానీ, మౌస్ కర్సర్ తో గానీ మీరు వ్రాసిన దాన్ని మార్కింగ్ చెయ్యండి. మార్కింగ్ అంటే మీకందరికీ తెలుసే అనుకుంటాను. మార్కింగ్ చేస్తే మీరు టైపింగ్ చేసినదంతా నీలిరంగు పట్టీలలో కనిపిస్తుంది. అదెలాగో ఈ క్రింది స్క్రీన్ షాట్ ని గమనించండి. 


ఇలా  మార్కింగ్ చేసిన తరవాత - మీరు ఎమ్మెస్ వర్డ్ ని తెరచి, అందులో పేస్ట్ చేసుకోండి. అలా చేసుకున్నాక - ఆ వర్డ్ లో పేస్ట్ చేసుకున్న దాన్ని మళ్ళీ మార్క్ చెయ్యండి. అలా చేశాక - పైన టూల్ బాక్స్ Tool box లోని ఫాంట్ సెక్షన్ Font section లో ఫాంట్ ఏమున్నదో గమనించండి. అందులోని డిఫాల్ట్ ఫాంట్ ని మార్చండి. ఇక్కడే మీరు కాస్త గమనించాలి. తెలుగు ఫాంట్స్ కన్నా ఇంగ్లీష్ ఫాంట్స్ ని అక్కడ ఎన్నుకుంటూ / మారుస్తూ వెళ్ళాలి. అప్పుడే పదాల మధ్యన మరింత ఎడం ని సాధించగలం.  

అది ఎలాగో ఈ క్రింది స్క్రీన్ షాట్స్ లలో మీరు చూడవచ్చును. ఇందులో ఎర్రని వృత్తాలలో చూపెట్టినది ఫాంట్స్ పేర్లు. ఆయా ఫాంట్ లలో క్రిందన ఉన్న విషయం మధ్య స్పేస్ ఎలా ఉందో - మొదటి స్క్రీన్ షాట్ కీ, రెండో స్క్రీన్ షాట్ విషయం మధ్యన స్పేస్ ఎంతగా పెరిగిందో మీరే గమనిస్తారు. కేవలం ఫాంట్ మార్చిన మాత్రానే ఇలా సాధ్యం అవుతుంది. ఇలా రకరకాల ఫాంట్స్ ని ఎన్నుకుంటూ చూస్తే - లేఖిని నుండి వర్డ్ లో పేస్ట్ చేసుకునేటప్పుడు పదాల మధ్యన తగినంత దూరంని పొందవచ్చును. 


పైన పేస్ట్ చేసినది - గౌతమి Gauthami ఫాంట్ లో. అందులో పదాల మధ్యన వచ్చిన స్పేస్ ని గమనించండి.


పైన పేస్ట్ నే మార్క్ చేసి, ఆంగ్ల ఫాంట్ అయిన కొరియర్ న్యూ Courier New  లోకి మారిస్తే పదాల మధ్యన వచ్చిన దూరం తేడాని మీరే స్పష్టముగా గమనించవచ్చు. 

ఇలా ఎలా వస్తుంది అంటే - ఇది కూడా చాలా చిన్న విషయమే. ఖతులు / ఫాంట్స్ తయారు చేసేటప్పుడు స్పేస్ ని కూడా ఇన్ని పిక్సెల్స్ Pixels / సైజు Size అంటూ నిర్ణయిస్తారు.  కొన్ని ఫాంట్స్ ఎక్కువ సైజు స్పేస్ ని రూపొందిస్తే - వాటిని వాడినప్పుడు ఇలా దూరముగా స్పేస్ వస్తుంది. 


3 comments:

Raj said...

మీరన్నది రా అనే తెలుగు అక్షరానికి శ వత్తు టైపింగ్ లో ఎలా ఇవ్వగలుతాం అని ఆడిగారు అనుకుంటాను. గూగుల్ ట్రాన్స్లిటరేషన్ లో అయితే rshaa అని టైపు చేస్తే సరి.
ర్శ = rsha
ర్శా = rshaa
ర్స = rsa
ర్సా = rsaa
ర్ష = rshh

విన్నకోట నరసింహా రావు said...

లేఖిని లో rkshaa అని పైపెట్టెలో ఆంగ్లంలో టైప్ చేసి చూడండి. మీరనుకున్న ర్క్షా వస్తుంది.
కుతూహలం కొద్దీ అడుగుతున్నాను - ర్క్షా అనే అక్షరం ఉండే పదం ఏవిటి శివరామ ప్రసాద్ గారు (సాహిత్యాభిమాని)?

Raj said...

విన్నకోట నరసింహారావు గారు అన్నట్లు - అసలు ఆ ర్క్ష అక్షరంతో మొదలయ్యే పదం ఏముంది చెప్పగలరా సాహిత్యాభిమాని గారూ.. పైన నేను సమాధానం ఇచ్చేటప్పుడే అడగాలనుకున్నా.. మరిచాను.

Related Posts with Thumbnails