Tuesday, November 29, 2016

CMOS Battery life

నేను 2005 ఏప్రిల్ లో క్రొత్త డెస్క్ టాప్ తీసుకున్నాను. అప్పటినుండీ నేటివరకూ ఆ సిస్టం భేషుగ్గా పనిచేస్తున్నది. ఒక్క మెమొరీ స్టోరేజీ స్పేస్ తప్ప నాకున్న అవసరాలకు ఆ సిస్టం సరిపోతున్నది.. ఇప్పటికీ సిస్టం మదర్ బోర్డ్ 99.8% గుడ్ కండీషన్ లో ఉందని మదర్ బోర్డ్ కంపనీ ఇంటెల్ వారి ఒక ప్రోగ్రాం వల్ల తెలుసుకున్నాను. ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం ఏమిటంటే - ఆ సిస్టం లోని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అయిన CPU కి ఉన్న బ్యాటరీ జీవితకాలం గురించి. 

మామూలుగా CPU కి తేదీ, సంవత్సరం మరియు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఒక గడియారం అవసరం. సిస్టం ఆఫ్ లో ఉన్నప్పుడు ఆ గడియారం అలాగే కొనసాగటానికి తగినంత శక్తిని ఇవ్వటానికి బ్యాటరీ అవసరం. అందుకే ప్రతి మదర్ బోర్డ్ లో ఒక బ్యాటరీ సెల్ తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారు. ఈ సెల్ ని అమర్చటం / మార్పు చెయ్యడం కూడా చాలా సులభమే. 

సిస్టం కొన్నాక మొదలెట్టిన ఆ బ్యాటరీ సెల్ జీవనం మొన్న మొన్నటివరకూ సాగింది. దాదాపు 11 సంవత్సరాల 7 నెలల కాలం ఆ బ్యాటరీ సెల్ తన శక్తిని నిరంతరముగా అందించింది. నేను అనుకోలేదు ఒక చిన్న సైజు / పాత పాతిక పైసల నాణెం సైజులో ఉండే CR 2032 3V బ్యాటరీ సెల్ ఇంతకాలం మన్నిక వస్తుందనీ, ఎటువంటి అంతరాయాన్ని కలుగచేయకుండా తన శక్తిని ఇస్తుందనీ.. ఒక మదర్ బోర్డ్ బ్యాటరీ జీవితకాలం ఎంత ఉంటుంది అన్న ఆసక్తికి సమాధానంగా ఈ పోస్ట్. 
గూగుల్ ఇమేజెస్ నుండి తీసుకోబడినది. చిత్రములో ఉన్న మదర్ బోర్డ్ నాది కాదు. బ్యాటరీ మాత్రం అదే నంబర్  ( CR2032 3V )

ఇది ఒకే.. బ్యాటరీ లోని శక్తి అయిపోయాక సిస్టం లో ఏమేమి మార్పులు వస్తాయి అనే మరో సందేహానికి ఈ వివరణ. ఈ మార్పులు గమనించాను కాబట్టి అవి మీకు తెలియచేస్తున్నాను. 

1. సిస్టం ని ఆన్ చేస్తే - అది మామూలుగా ఓపెన్ కాదు. మానిటర్ మీద రెండు లైన్ల మెసేజ్ వస్తుంది. మీ సిస్టం లోని CMOS (Complementary Metal-Oxide Semiconductor ) బ్యాటరీ ఫెయిల్యూర్ వల్ల మామూలుగా ఓపెన్ కాదు.. ఏదైనా కీ బోర్డ్ కీ నొక్కండి అనే మెస్సేజ్ కనిపిస్తుంది. 

2. పై మెసేజ్ కనిపించాక ఎంటర్ కీ ని నొక్కాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ మెసేజ్ వస్తుంది.. మళ్ళీ ఎంటర్ కీ నొక్కాలి. ఇలా మూడుసార్లు చేశాక మామూలుగా OS పనిచేస్తుంది. 

3. అలా తెరచుకున్నాక సిస్టం ని మామూలుగా తెరవలేం. సిస్టం ట్రేలో ఉన్న గడియారం - ఆ సిస్టం తయారీ తేదీని చూపిస్తుంది. ఆ సమయం మీద క్లిక్ చేసి, ఆ సమయాన్ని మార్చుకోవాలి. 

4. మీ సిస్టం లోని అప్డేట్ అంటి వైరస్ ప్రోగ్రాం మీరు అంతర్జాలం లోకి వెళ్ళటాన్ని నిరోధిస్తుంది. అంటే అంతర్జాలం తెరచుకోదు. అప్పుడు ఖచ్చితముగా ఆ సమయాన్ని అప్డేట్ చెయ్యాల్సిందే. ( నాకు మాత్రం అలాగే జరిగింది). 

5. ఇలా చెయ్యటం అన్నది - ఆ సిస్టం ని తెరచినప్పుడల్లా ఇలా తప్పనిసరిగా చెయ్యాల్సిరావటం విసుగ్గా ఉంటుంది. 

6. ప్రతిసారి ఇలా ఇబ్బంది పడే బదులు 30 రూపాయలు పెట్టి ఆ బ్యాటరీ సెల్ మార్చుకుంటే సరి. 


Thursday, November 24, 2016

Good Morning - 621


భగ్న ప్రేమ గురించి వ్రాసే వారంతా భగ్న ప్రేమికులు కారు.. 

అవును.. భగ్న ప్రేమ గురించి సామాజిక సైట్లలో పోస్ట్స్ పెట్టేవారిని, రచనలు చేసేవారినీ.. వీక్షకులు తరచూ అడిగే ప్రశ్న - మీరు లవ్ ఫెయిల్యూరా? అనీ.  అలాంటి పోస్ట్స్ పెట్టేవారిని వారు అలాని అనుకుంటే, హత్యల గురించి పోస్ట్స్ పెట్టేవారిని - మీరు హత్యలు చేస్తారా ? అని అడగాల్సిందే.. అప్పుడు ఆయా పోస్ట్స్ పెట్టేవారికి "కాలితే " ఇక మరొక హత్య జరుగుతుందేమో... హ హ్హ హ్హా  

ఈ లవ్ ఫెయిల్యూర్ పోస్ట్స్ పెట్టాలంటే - ప్రేమలో ఓడిపోయి, గడ్డాలు పెంచేసుకొని, ఏదో లోకములో విహరిస్తున్నట్లు ఉంటూ, కాసింత భావుకత రంగరించి, ఒకింత పాలు తనకు తెలిసిన ప్రేమ వియోగపు / విరహ వేదనను అక్షరాలల్లోకి మార్చి పోస్ట్ పెడితే - అందులోని భావనని అభినందించాల్సింది పోయి, మీరు ఇదా? అంటూ కామెంట్ చెయ్యడం ఏమైనా బాగుందా ? నాకైతే అలా అడగటం నచ్చదు. 

నా చిన్నతనంలో - ఒక ప్రఖ్యాత వారపత్రికలో ఒక రచయిత్రి సీరియల్ వచ్చేడిది. అందులో ఈ ప్రేమ తాలూకు భావనలు అందముగా వర్ణించి వ్రాసేడివారు. రవి గాంచని చోట కవి గాంచున్... అన్న చందాన ప్రేమ తాలూకు ఆకర్షణ, వియోగం, చిలిపి ముచ్చట్లు, ఒకింత పాలు శృంగారంగా, అద్భుతముగా వ్రాసేడివారు. తన పర్సనల్ లైఫ్ గురించి బయటకు ఏమీ తెలీని కారణాన అందరూ ఆవిడ చాలా పెద్దావిడ గాబోలు అనుకున్నారు. నేనూ అలాగే అనుకున్నా. కానీ ఆవిడ చాలా చిన్న వయసు అమ్మాయని ఆ పత్రికలోనే ఒక ఇంటర్వ్యూ వల్ల బయట ప్రపంచానికి తెలిసింది. తను శ్రీమతి కాదు - కుమారి అని తెలిసింది అందరికీ. ఇక ఆ అమ్మాయికి ఎన్నో ప్రశ్నలు... మీకు ప్రేమ "ఇంతగా " ఎలా తెలుసు, ఎవరినైనా ప్రేమించారా ? భగ్న హృదయులా? అవి సరే.. ఆలుమగల శృంగారం, చిలిపి ఘటనలు బాగా వ్రాస్తున్నారు.. పెళ్లయిన మాకే తెలీని ఈ విషయాలు మీకెలా తెలుసు? ఏమైనా అనుభవాలా?.. అంటూ. ఆ సీరియల్లోనే ఒక సగం పేజీలో ఆయా రచయిత(త్రు)లతో - పాఠకులతో ముఖాముఖి ఉండేడిది. అలా ఆ ప్రశ్నలూ అచ్చయ్యాయి. ఇలాంటి ప్రశ్నలు ఎక్కవ కావడంతో ఇక ఆ రచయిత్రికి ప్రశ్నల ముఖాముఖి శీర్షికని నిలిపివేశారు. ( ఆ సీరియల్ తరవాత ఆ రచయిత్రికి పెళ్లి జరిగిపోయింది ) ఇలాంటి బాధలు ఉంటాయి.

అదేమిటో కానీ, వాళ్ళ విషయాల గురించి పట్టింపులు ఉండవు కానీ ఎదుటివారిని ఇలాంటి ప్రశ్నలతో వేధించేవారిని చూస్తే అసహ్యం వేస్తుంది. అందమైన కాల్పానిక, ఊహాజనితమైన భావనని తమ ప్రజ్ఞతో అద్భుతముగా వర్ణించి, రచింప చేసే వారిని, తమ పిచ్చి కామెంట్లతో వారిని ఇబ్బందుల్లోకి నెట్టడం ఎంతవరకు సబబు? ఆ రచనని రచనలాగా తీసుకోవాలి గానీ అవి వారి వారి "అనుభవాలుగా " పరిగణిస్తే ఎంతవరకు న్యాయం? 

Monday, November 21, 2016

Quiz


.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 60 




Saturday, November 19, 2016

Friday, November 18, 2016

పొడుపు కథలు - 35


వంకాయలో ఉంటా కానీ టెంకాయలో ఉండను. 
గదలో ఉంటా గానీ గనిలో ఉండను. 
నందనలో ఉంటా గానీ చందనలో ఉండను. 
మరి నేనెవరినో చెప్పుకోండి చూద్దాం.. ? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
విడుపు : 


Sunday, November 13, 2016

Quiz


మెదడుకు మేత :
ఒక చొక్కా ఎండలో ఆరటానికి 5 నిమిషాలు పడితే, 13 చొక్కాలు ఆరడానికి ఎన్ని నిమిషాలు పట్టును..? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 
ఒక చొక్కా ఆరటానికి ఐదు నిమిషాలు పడుతుంది. అలాగే ఒకేసారి ఆ పదమూడు చొక్కాలు ఆరటానికి ఎండలో వేసినప్పుడు - అంటే సమయం - అంటే ఐదు నిమిషాలే పడుతుంది. 



Thursday, November 10, 2016

Quiz


If  4+4=20 
5+5=30
6+6=42
7+7=56
9+9=? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 90


Monday, November 7, 2016

Good Morning - 620


ఒక పాత స్నేహితుడు ఎదుగుదలకు సుదీర్ఘ సమయం పడుతుంది. 


Friday, November 4, 2016

Good Morning - 619


నిన్ను నిన్నుగా ఇష్టపడేవాళ్లకు నీవంటే ఏమిటో చెప్పనవసరం లేదు.. 
నిన్ను ఇష్టపడని వాళ్ళకు నీవంటే ఏమిటో చెప్పినా అర్థం కాదు.. 
మనం మంచివాళ్ళుగా జీవిస్తే చాలు.. 
దానిని నిరూపించుకోవాలని ప్రయత్నించనవసరం లేదు.. 

అవును.. నీవంటే ఎవరో, నీ గురించి బాగా తెలిసిన వారికి నీవంటే ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకూ అంటే వారికి నీగురించి బాగానే తెలిసే ఉంటుంది. నిన్ను ఇష్టపడని వారికి నీవంటే ఏమిటో చెప్పినా అర్థం కాదు.. ఎందుకూ అంటే నీవంటే ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం, ఆసక్తి గానీ వారికి లేదు. అలా లేనప్పుడు ఎంత చెప్పినా వృధానే. చెప్పేది విన్నాక తరవాత ఆలోచిద్దాం అన్న కనీస జ్ఞానం లేనివారితో మనమేమాత్రం ఇమడలేం. మనం మంచివాళ్ళుగా జీవిస్తే చాలు. మన వారితో, ఎదుటివారితో సరియైన తీరుగా ఉంటే చాలు. మనం అంటే ఏమిటో - మన మంచితనం అంటే ఏమిటో అందరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు... నిరూపించుకోవాలని చూస్తే దానంత కాలం వృధా మరొకటి లేదు..  


Tuesday, November 1, 2016

[తెలుగుబ్లాగు:22408] లేఖినిలో వ్రాసినది వర్డ్ లో పేస్ట్ చేస్తే..

[తెలుగుబ్లాగు:22408] లేఖిని నించీ వర్డ్ లోకి కాపీ చేసిన తెలుగు పదాల మధ్య స్పేస్  సరిగ్గా రావటం లేదు ఏమి చేయాలి? తెలియ చేయ ప్రార్ధన !! ( మొదటి స్క్రీన్ షాట్ ని చూడండి )

 సరిగ్గా రావటం లేదు ఏమి చేయాలి? తెలియ చేయ ప్రార్ధన !!


లేఖిని లో వ్రాసిన విషయాన్ని, కాపీ చేసుకొని, వర్డ్ లో పేస్ట్ చేసుకుంటే - పదాల మధ్యన ఎక్కువ స్పేస్ రావటం లేదన్నది మీ అనుభవం. ఇలా పదాల మధ్యన ఉండే స్పేస్ మరింత ఎక్కువ స్పేస్ రావటం ఎలాగో క్రిందన స్క్రీన్ షాట్స్ లలో చూడండి. నిజానికి ఇది చా...లా  చిన్న విషయం.  ఎంతగా అంటే ఓస్.. ఇంతేనా అన్నట్లుగా.. 

ముందుగా మీరు లేఖినిని ( http://lekhini.org )  తెరచి, మీరు పైగదిలో ఇంగ్లీష్ లో టైపింగ్ చేస్తుంటే క్రిందన ఉన్న గడిలో వెనువెంటనే తెలుగులోకి మారుతుంది. ఈ విషయం అందరికీ తెలిసినదే.. ఈ వచ్చిన తెలుగును మార్కింగ్ చేసి, కాపీ చేసుకొని వర్డ్ లోకి పేస్ట్ చేసుకోవాలి. అలా వర్డ్ లో పేస్ట్ చేసుకున్నప్పుడు - పదాల మధ్యన ఉండే స్పేస్ తగ్గిపోయి, పదాలు కాస్త దగ్గర దగ్గరగా ఉన్నట్లు అగుపిస్తాయి. దీన్ని రెండురకాలుగా ప్రయత్నించి, విజయం సాధించవచ్చు. 

మొదటి పద్ధతి :  
లేఖినిలో టైపింగ్ చేస్తున్నప్పుడు పదాల మధ్యన మీరు వాడే ఒకసారి వాడే స్పేస్ ట్యాబ్ ని రెండుసార్లు నొక్కండి. దీనివల్ల పదాల మధ్య మరింత జాగా Gap వస్తుంది. అంటే మీరు పదాల మధ్యన పెట్టే స్పేస్ సింగిల్ స్ట్రోక్ కాకుండా - డబల్ స్ట్రోక్ వాడి, టైపు చెయ్యండి. మీ టైపింగ్ పూర్తయ్యాక దాన్ని కాపీ చేసి, ఎమ్మెస్ వర్డ్ MS Word లో పేస్ట్ చేస్తే మీరనుకున్నట్లు పదాల మధ్య వచ్చే స్పేస్ మీరు అనుకున్నట్లుగా ఎక్కువ నిడివితో వస్తుంది. అది ఎలానో ఈ క్రింది స్క్రీన్ షాట్ ని గమనించండి. 


పైనున్న స్క్రీన్ షాట్ ని చూశారు కదూ.. పదాల మధ్యన చాలా ఎడం గా స్పేస్ వచ్చింది. ఇలా కాకుండా నేరుగా మీరు ఎమ్మెస్ వర్డ్ లో నేరుగా టైపింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ డబల్ స్పేస్ నొక్కడం కొన్నిసార్లు మరచిపోవచ్చు లేదా ఇంకా ఎక్కువ సార్లు స్పేస్ నొక్కడం వల్ల మరింత జాగాలు ఏర్పడవచ్చు. ఇలా డబల్ స్పేస్ నొక్కడం అలవాటయ్యాక మామూలుగా ఏది టైపు చేసినా అలాగే డబల్ స్పేస్ నొక్కడం అలవాటయ్యి, ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేరుగా ఎమ్మెస్ వర్డ్ లో టైపింగ్ చెయ్యడం నేర్చుకోండి. అలా చేస్తే చాలా సులభముగా ఉంటుంది. నామటుకు మాత్రం నేను - ఈ బ్లాగ్ లో పోస్ట్ పెట్టినప్పుడు నేరుగా బ్లాగర్ ని తెరచి, అందులోనే తెలుగుని టైపు చేస్తుంటాను. 

ఇక రెండో పద్ధతీ ఉంటుంది. ఆ పద్ధతి కూడా సులభమైనదే.. 
రెండవ పద్ధతి : 
వీవెన్ గారి కోరిక మేరకు మీరు జత చేసిన స్క్రీన్ షాట్ ని గమనిస్తే - అది క్రాప్ / కత్తిరించబడినది కాకుండా మొత్తం తెరపట్టు అయి ఉంటే నేను చెప్పే సమాధానం తేలికగా ఉండేది.. మీరు చాలా పాత వర్షన్ MS Office word వాడుతున్నారులా ఉంది. ( క్రొత్త వెర్షన్ లలో మరిన్ని సౌకర్యాలు అందుకోగలరు. అయితే మీ సమస్యకు ఈ వెర్షన్ అప్డేట్ ఏమాత్రం అడ్డంకి కాదు.. ) పూర్తిగా ఉండే స్క్రీన్ షాట్ వల్ల - మీరు లేఖినిలో వ్రాసుకున్న దానిని ఈ MS Word లో ఏ ఫాంట్ డిఫాల్ట్ గా ఉన్నప్పుడు పేస్ట్ చేసుకున్నారో తెలిసేది. అందువల్ల మీకు అలా పదాలు దగ్గరగా వచ్చాయని అనుకుంటున్నాను. అయినా సరే!.. చిన్న మార్పు వల్ల తేలికగా ఎక్కువ స్పేస్ వచ్చేలా చేసుకోవచ్చు. 

లేఖినిలో Single spaceతో  మీరు టైపు చేసుకున్న విషయాన్ని వర్డ్ లోకి ఇంతకు ముందు ఎలా కాపీ, పేస్ట్ చేసుకున్నారో అలాగే చేసుకోండి. అలా పేస్ట్ అయిన విషయాన్ని సేవ్ చేసుకొనే ముందు - ఆ విషయాన్ని అంతా మార్క్ చెయ్యండి. అలా చేశాక ఒక్కో ఫాంట్ ని మారుస్తూ వెళ్ళండి. తెలుగు ఫాంట్స్ మీదుగా కాకుండా, ఇంగ్లీష్ ఫాంట్స్ ఎన్నుకుంటూ - స్పేస్ ని గమనిస్తూ వెళ్ళండి. కొన్ని ఫాంట్స్ / ఖతుల వల్ల మీకు అనుకున్న స్పేస్ ఖచ్చితముగా వస్తుంది. ఇదే నేను చెప్పాలనుకున్న రెండో పరిష్కారం. 

ఇందులో కూడా మీరు లేఖినిలో మొదట్లో ఎలా టైపింగ్ చేసుకున్నారో, ( అంటే డబల్ స్పేస్ Double space కాకుండా సింగిల్ స్పేస్ Single space వాడి ) అలాగే టైప్ చేసుకోండి. ఆతర్వాత కీ బోర్డ్ సహాయముతో గానీ, మౌస్ కర్సర్ తో గానీ మీరు వ్రాసిన దాన్ని మార్కింగ్ చెయ్యండి. మార్కింగ్ అంటే మీకందరికీ తెలుసే అనుకుంటాను. మార్కింగ్ చేస్తే మీరు టైపింగ్ చేసినదంతా నీలిరంగు పట్టీలలో కనిపిస్తుంది. అదెలాగో ఈ క్రింది స్క్రీన్ షాట్ ని గమనించండి. 


ఇలా  మార్కింగ్ చేసిన తరవాత - మీరు ఎమ్మెస్ వర్డ్ ని తెరచి, అందులో పేస్ట్ చేసుకోండి. అలా చేసుకున్నాక - ఆ వర్డ్ లో పేస్ట్ చేసుకున్న దాన్ని మళ్ళీ మార్క్ చెయ్యండి. అలా చేశాక - పైన టూల్ బాక్స్ Tool box లోని ఫాంట్ సెక్షన్ Font section లో ఫాంట్ ఏమున్నదో గమనించండి. అందులోని డిఫాల్ట్ ఫాంట్ ని మార్చండి. ఇక్కడే మీరు కాస్త గమనించాలి. తెలుగు ఫాంట్స్ కన్నా ఇంగ్లీష్ ఫాంట్స్ ని అక్కడ ఎన్నుకుంటూ / మారుస్తూ వెళ్ళాలి. అప్పుడే పదాల మధ్యన మరింత ఎడం ని సాధించగలం.  

అది ఎలాగో ఈ క్రింది స్క్రీన్ షాట్స్ లలో మీరు చూడవచ్చును. ఇందులో ఎర్రని వృత్తాలలో చూపెట్టినది ఫాంట్స్ పేర్లు. ఆయా ఫాంట్ లలో క్రిందన ఉన్న విషయం మధ్య స్పేస్ ఎలా ఉందో - మొదటి స్క్రీన్ షాట్ కీ, రెండో స్క్రీన్ షాట్ విషయం మధ్యన స్పేస్ ఎంతగా పెరిగిందో మీరే గమనిస్తారు. కేవలం ఫాంట్ మార్చిన మాత్రానే ఇలా సాధ్యం అవుతుంది. ఇలా రకరకాల ఫాంట్స్ ని ఎన్నుకుంటూ చూస్తే - లేఖిని నుండి వర్డ్ లో పేస్ట్ చేసుకునేటప్పుడు పదాల మధ్యన తగినంత దూరంని పొందవచ్చును. 


పైన పేస్ట్ చేసినది - గౌతమి Gauthami ఫాంట్ లో. అందులో పదాల మధ్యన వచ్చిన స్పేస్ ని గమనించండి.


పైన పేస్ట్ నే మార్క్ చేసి, ఆంగ్ల ఫాంట్ అయిన కొరియర్ న్యూ Courier New  లోకి మారిస్తే పదాల మధ్యన వచ్చిన దూరం తేడాని మీరే స్పష్టముగా గమనించవచ్చు. 

ఇలా ఎలా వస్తుంది అంటే - ఇది కూడా చాలా చిన్న విషయమే. ఖతులు / ఫాంట్స్ తయారు చేసేటప్పుడు స్పేస్ ని కూడా ఇన్ని పిక్సెల్స్ Pixels / సైజు Size అంటూ నిర్ణయిస్తారు.  కొన్ని ఫాంట్స్ ఎక్కువ సైజు స్పేస్ ని రూపొందిస్తే - వాటిని వాడినప్పుడు ఇలా దూరముగా స్పేస్ వస్తుంది. 


Related Posts with Thumbnails