Tuesday, February 23, 2016

Good Morning - 602


" మనంతట మనం పని చెయ్యం, 
పనిచేసేవారిని పని చెయ్యనివ్వం, 
వారిని విమర్శించి, తప్పులెంచి అవహేళన చేస్తాం.. 
మానవ జాతి పతనానికి ముఖ్యమైనది ఈ లక్షణమే.." 
- స్వామి వివేకానంద 

మానవ జాతి పతనానికి, మనం వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే లక్షణాల్లో చెప్పుకోదగినది - మనకు రానిది, వేరేవారు చేస్తుంటే - దాన్ని మనం ఇతరులతో కలసి, చేస్తున్న పనిలో తప్పులెంచి, విమర్శిస్తాం. మానక ఆ పని రాదు.. వచ్చినవారు చేస్తుంటే - అసూయతో, ఈగో దెబ్బతిని ఎక్కడ ఆ గొప్పదనం వారికి చెందుతుందో అని, ఆ పనిలో తప్పులు వెదుకుతూ ఉంటాం. ఇది ఇలా కాదు.. ఇలా వచ్చేస్తే బాగుండును.. ఇది అలా చెయ్యకూడదు.. అంటూ ఎన్నెన్నో వంకలు పెడుతుంటాం. ఇదే మన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తుంది. నిజానికి - ఆ పని చేస్తున్న వారు ఈ విమర్శలు విని - ఒకే ఒక్క మాట - వారికి అంతా తెలుసు కదా.. వారిని చెయ్యమనండి చూద్దాం అంటే - మనం ఆ ఛాలెంజ్ ని  స్వీకరించే స్థితిలో మనం ఉండం. అలా మన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసుకొని, మన డొల్లతనాన్ని మనమే బయట పెట్టుకున్నవారిమి అవుతాం. 

ఒక చక్కని ఉదాహరణ చెబుతాను. ఒకసారి టీవీలో ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు కృష్ణవంశీ ఇంటర్వ్యూ చూశాను. అందులో యాంకర్ - మీ సినిమాల మీద విమర్శకులు ఎన్నెన్నో చెబుతూ విమర్శిస్తారు కదా.. దానికి మీరేమంటారు? అని అడిగితే - అందులకు ఆయన చక్కని సమాధానం చెప్పారు. "ఏది ఎలా తీయాలో, సరియైన పద్ధతి ఏమిటో వాళ్లకు ( విమర్శకులకు )బాగా తెలుసుకదా.. అంతగా తెలిసినవాళ్ళు వారే సినిమాలు తీస్తే బాగుంటుంది. సరియైన చిత్రాలు తీశారంటూ గొప్ప పేరూ, తెలుగు చిత్ర రంగాన మంచి మంచి చిత్రాలు గలవు అంటూ మన సినిమా ఇండస్ట్రీకి చక్కని పేరూ వస్తుంది.." అంటూ చిరునవ్వుతో చెప్పారు. ఇదీ నిజమే కదా.. ప్రతిదాన్ని శవ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లుగా విమర్శలు చేస్తూ అవహేళన చేస్తే - ఇలాంటి సమాధానాలే ఎదురుకోవాల్సి వస్తుంది. 


No comments:

Related Posts with Thumbnails