Saturday, February 20, 2016

Good Morning - 601


మీ కలను నిజం చేసుకోవడానికి నువ్వే ఒక ఆయుధంగా మారతావా, లేదా మరొకరి కల నిజం చెయ్యడానికి మెట్టులా మిగిలిపోతావా? అనే నిర్ణయమే నువ్వు ఉద్యోగివా, యజమానివా అన్నది నిర్ణయిస్తుంది. 

జీవితంలో ఒక స్థాయికి చేరుకోవటానికి మనం ఎన్నెన్నో ఆలోచనలు, ప్రణాళికలూ చేస్తుంటాం.. కానీ అవన్నీ వృధాయే అన్నది తరవాత సంగతి. మనం కనే కలలు అన్నీ నిజం చేసుకోవాలి. అలా అవాలంటే ఆ కలలని నిజం చేసుకోవాలనే ప్రయత్నంలో - మనంతట మనం ఒక సాధనంగా  మారి, ఆ కలని నిజం చేసుకోవటానికి హరిశ్నలూ కష్టపడి, విజయం సాధిస్తాం. అంటే మనం కలగన్న లక్ష్యాన్ని చేరుకోవటానికి మనమే ఒక సాధనంగా మారి దాన్ని సాధించామని అర్థం. 

అలా కాకుండా - వేరొకరు సాధించాలనుకున్న లక్ష్యానికి మనకు ఏమీ సంబంధం లేకున్నా - వారి వారి కలలని నెరవేర్చే ప్రయత్నంలో  మనం ఇతోధికముగా సహాయం చేసి, వారు తమ తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఒక మెట్టులా మారతాం. ఇందులో మనకి వచ్చే / దక్కే విజయం పాలు చాలా చాలా తక్కువ. 

ఒక ఉదాహరణగా చెప్పాలీ అంటే - స్వంత వ్యాపారం కీ, ఒక వ్యాపారస్థుడి  క్రింద ఉద్యోగిగా ఉండటానికి గల తేడా.. 

No comments:

Related Posts with Thumbnails