మనిషిని తక్కువ అంచనా వేసినా - ఒక్కోసారి మన్నింపు ఉంటుందేమో గానీ, మనసుని తక్కువ అంచనా వేసి, చులకన చేస్తే ఆ కసి రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది.
ఎదుటి మనిషిని ఒక్కోసారి, కొన్ని పరిస్థితుల్లో తక్కువ అంచనా వేస్తుంటాం.. లేదా ఎదుటివారు మనల్ని ఏదో అపోహతో చాలా తక్కువ వారిలా అంచనా వేసి, అలా ప్రవర్తిస్తే - ఒక్కోసారి వారి వారి వివరణలతో మన్నిస్తామేమో గాని.. మన మనసులని తక్కువగా అంచనా వేసి, చులకన చేసి, అవమానిస్తే - అప్పుడు ఆ మనసు పొందే బాధ, కసి - ఎప్పుడూ ఆ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా రావణ కాష్టంలా ఆరని బాధగా రగిలిపోతునే ఉంటుంది.
(రావణ కాష్టం అంటే రామాయణ గాథలో - చివరిలో రావణుడు రాముడి చేతిలో చనిపోతే - రావణుడి భార్య అయిన మండోదరికి ఒక వరం ఉంటుంది. తాను పుణ్యస్త్రీ గా చనిపోవాలని. ఈ రావణ కాష్టం గనుక జరిగితే - ఆమె విధవ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే - ఆ రావణుడి కాష్టం ముగియకూడదు. అది ముగిసేంతవరకూ ఆమె పుణ్యస్త్రీగానే ఉంటుంది. అలా రావణాసురుడి కాష్టం అలాగే కొనసాగుతూనే ఉండిపోయింది.)
No comments:
Post a Comment