Sunday, February 28, 2016
Friday, February 26, 2016
Tuesday, February 23, 2016
Good Morning - 602
" మనంతట మనం పని చెయ్యం,
పనిచేసేవారిని పని చెయ్యనివ్వం,
వారిని విమర్శించి, తప్పులెంచి అవహేళన చేస్తాం..
మానవ జాతి పతనానికి ముఖ్యమైనది ఈ లక్షణమే.."
- స్వామి వివేకానంద
మానవ జాతి పతనానికి, మనం వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే లక్షణాల్లో చెప్పుకోదగినది - మనకు రానిది, వేరేవారు చేస్తుంటే - దాన్ని మనం ఇతరులతో కలసి, చేస్తున్న పనిలో తప్పులెంచి, విమర్శిస్తాం. మానక ఆ పని రాదు.. వచ్చినవారు చేస్తుంటే - అసూయతో, ఈగో దెబ్బతిని ఎక్కడ ఆ గొప్పదనం వారికి చెందుతుందో అని, ఆ పనిలో తప్పులు వెదుకుతూ ఉంటాం. ఇది ఇలా కాదు.. ఇలా వచ్చేస్తే బాగుండును.. ఇది అలా చెయ్యకూడదు.. అంటూ ఎన్నెన్నో వంకలు పెడుతుంటాం. ఇదే మన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తుంది. నిజానికి - ఆ పని చేస్తున్న వారు ఈ విమర్శలు విని - ఒకే ఒక్క మాట - వారికి అంతా తెలుసు కదా.. వారిని చెయ్యమనండి చూద్దాం అంటే - మనం ఆ ఛాలెంజ్ ని స్వీకరించే స్థితిలో మనం ఉండం. అలా మన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసుకొని, మన డొల్లతనాన్ని మనమే బయట పెట్టుకున్నవారిమి అవుతాం.
ఒక చక్కని ఉదాహరణ చెబుతాను. ఒకసారి టీవీలో ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు కృష్ణవంశీ ఇంటర్వ్యూ చూశాను. అందులో యాంకర్ - మీ సినిమాల మీద విమర్శకులు ఎన్నెన్నో చెబుతూ విమర్శిస్తారు కదా.. దానికి మీరేమంటారు? అని అడిగితే - అందులకు ఆయన చక్కని సమాధానం చెప్పారు. "ఏది ఎలా తీయాలో, సరియైన పద్ధతి ఏమిటో వాళ్లకు ( విమర్శకులకు )బాగా తెలుసుకదా.. అంతగా తెలిసినవాళ్ళు వారే సినిమాలు తీస్తే బాగుంటుంది. సరియైన చిత్రాలు తీశారంటూ గొప్ప పేరూ, తెలుగు చిత్ర రంగాన మంచి మంచి చిత్రాలు గలవు అంటూ మన సినిమా ఇండస్ట్రీకి చక్కని పేరూ వస్తుంది.." అంటూ చిరునవ్వుతో చెప్పారు. ఇదీ నిజమే కదా.. ప్రతిదాన్ని శవ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లుగా విమర్శలు చేస్తూ అవహేళన చేస్తే - ఇలాంటి సమాధానాలే ఎదురుకోవాల్సి వస్తుంది.
Saturday, February 20, 2016
Good Morning - 601
మీ కలను నిజం చేసుకోవడానికి నువ్వే ఒక ఆయుధంగా మారతావా, లేదా మరొకరి కల నిజం చెయ్యడానికి మెట్టులా మిగిలిపోతావా? అనే నిర్ణయమే నువ్వు ఉద్యోగివా, యజమానివా అన్నది నిర్ణయిస్తుంది.
జీవితంలో ఒక స్థాయికి చేరుకోవటానికి మనం ఎన్నెన్నో ఆలోచనలు, ప్రణాళికలూ చేస్తుంటాం.. కానీ అవన్నీ వృధాయే అన్నది తరవాత సంగతి. మనం కనే కలలు అన్నీ నిజం చేసుకోవాలి. అలా అవాలంటే ఆ కలలని నిజం చేసుకోవాలనే ప్రయత్నంలో - మనంతట మనం ఒక సాధనంగా మారి, ఆ కలని నిజం చేసుకోవటానికి హరిశ్నలూ కష్టపడి, విజయం సాధిస్తాం. అంటే మనం కలగన్న లక్ష్యాన్ని చేరుకోవటానికి మనమే ఒక సాధనంగా మారి దాన్ని సాధించామని అర్థం.
అలా కాకుండా - వేరొకరు సాధించాలనుకున్న లక్ష్యానికి మనకు ఏమీ సంబంధం లేకున్నా - వారి వారి కలలని నెరవేర్చే ప్రయత్నంలో మనం ఇతోధికముగా సహాయం చేసి, వారు తమ తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఒక మెట్టులా మారతాం. ఇందులో మనకి వచ్చే / దక్కే విజయం పాలు చాలా చాలా తక్కువ.
ఒక ఉదాహరణగా చెప్పాలీ అంటే - స్వంత వ్యాపారం కీ, ఒక వ్యాపారస్థుడి క్రింద ఉద్యోగిగా ఉండటానికి గల తేడా..
Tuesday, February 16, 2016
Sunday, February 14, 2016
Good Morning - 600
మనిషిని తక్కువ అంచనా వేసినా - ఒక్కోసారి మన్నింపు ఉంటుందేమో గానీ, మనసుని తక్కువ అంచనా వేసి, చులకన చేస్తే ఆ కసి రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది.
ఎదుటి మనిషిని ఒక్కోసారి, కొన్ని పరిస్థితుల్లో తక్కువ అంచనా వేస్తుంటాం.. లేదా ఎదుటివారు మనల్ని ఏదో అపోహతో చాలా తక్కువ వారిలా అంచనా వేసి, అలా ప్రవర్తిస్తే - ఒక్కోసారి వారి వారి వివరణలతో మన్నిస్తామేమో గాని.. మన మనసులని తక్కువగా అంచనా వేసి, చులకన చేసి, అవమానిస్తే - అప్పుడు ఆ మనసు పొందే బాధ, కసి - ఎప్పుడూ ఆ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా రావణ కాష్టంలా ఆరని బాధగా రగిలిపోతునే ఉంటుంది.
(రావణ కాష్టం అంటే రామాయణ గాథలో - చివరిలో రావణుడు రాముడి చేతిలో చనిపోతే - రావణుడి భార్య అయిన మండోదరికి ఒక వరం ఉంటుంది. తాను పుణ్యస్త్రీ గా చనిపోవాలని. ఈ రావణ కాష్టం గనుక జరిగితే - ఆమె విధవ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే - ఆ రావణుడి కాష్టం ముగియకూడదు. అది ముగిసేంతవరకూ ఆమె పుణ్యస్త్రీగానే ఉంటుంది. అలా రావణాసురుడి కాష్టం అలాగే కొనసాగుతూనే ఉండిపోయింది.)
Friday, February 12, 2016
[తెలుగుబ్లాగు:22336] కి నేనిచ్చిన సమాధానం.
Vruthavam yelaga pettali.
udaharanaku :- Naa Maatrubhasha telugu. indulo Maatrubhasha ra ki vruthvam raavali antye yela type cheyyali.
teliyacheppagalaru.
పై ప్రశ్నకి నేనిచ్చిన సమాధానం :
వృత్వం ఎలా పెట్టాలో అడిగారు కదూ..
మీరు అడిగినది ఇన్ స్క్రిప్ట్ లోనా లేక గూగుల్ ట్రాన్స్లిటరేషన్ లోనా తెలియచెయ్యలేదు. ఇన్ స్క్రిప్ట్ అయితే నాకు తెలీదు.. గూగుల్ ట్రాన్స్లిటరేషన్ లో అయితే నేరుగా టైపింగ్ లో రాదు. పదాన్ని పూర్తిగా టైప్ చేస్తూ ఉండగా వచ్చే పదకోశంలో సరియైన పదాన్ని ఎంపిక చేసుకోవాలి.
ఉదాహరణకు : maatrutvam మాతృత్వం
maatrubhaasha మాతృభాష
kru కృ
vru వృ
truna తృణ
Subscribe to:
Posts (Atom)