Monday, August 19, 2013

Good Morning - 426


నిన్ను ఎవరు ఏమన్నారన్నది ముఖ్యం కాదు. వారన్నదానికి నువ్వెలా స్పందించావన్నడి ముఖ్యం. కొన్నిసార్లు తప్పుకొని, వెళ్ళిపోవడం కంటే, నిలబడి నవ్వడం మంచి ఫలితాన్నిస్తుంది. ! 

అవును.. ఎవరో ఏదో హేళన చేశారు అంటే - అదేదో తప్పు చేసినట్లు ఫీల్ అవకూడదు. నిజమెంతో గ్రహించాలి. ఒక్కోసారి వారి హేళన మనల్ని బాధపెడితే, మొహం చాటు చెయ్యకుండా ఎదురుగా నిలబడి నవ్వడం గానీ / సమాధానం ఇవ్వటం గానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. 

ఒకసారి ఒక పేజీలో నా ఈకార్డ్ ని పోస్ట్ చేశాను. దానికి ఒకతను - ఇలా అసహ్యముగా చేస్తారా ? అని వెధవ కామెంట్ పెట్టాడు. నిజానికి నేను చేసేవన్నీ M S Paint లోనే. కాబట్టి ఎక్కువ ఆర్టిస్టిక్ గా చెయ్యటం కుదరదు. ఫోటోషాప్ లో అయితే ఇక అత్యద్భుతమే. కానీ అంత సమయం ఎందుకులే అని ఎమ్మెస్ పెయింట్ లోనే చేస్తున్నాను. అలా కామెంట్ వచ్చాక, గడవ కాకుండా ఏమీ మాట్లాడకుండా వెళ్ళి పోవాలనుకున్నాను. కానీ తన ప్రతిభ ఏమిటో తెలుసుకుందామని, " మీరు ఒకటి చేసి చూపిస్తే సంతోషించి, ఎలా చెయ్యాలో నేర్చుకుంటాను.. " అని జవాబు ఇచ్చాను. తను మరుసటి రోజున ఒక ఈ కార్డ్ పోస్ట్ చేశాడు. అన్నీ అక్షరాల తప్పులే. ఫాంట్ సెలెక్షన్ కూడా డిఫాల్ట్ ఫాంట్ యే వాడారు. అలాగే ఫాంట్ కలర్, సైజూ మారాలి. చూసి, ఇంతేనా అనుకున్నాను కానీ నేనేమీ కామెంట్ చెయ్యలేదు. అంతలోగా వేరేవారెవరో కామెంట్ పెట్టారు.. " ఏమి నాయనా ? చేయ్యకరాకపోతే చెయ్యకు.. ఇలా మమ్మల్ని హింసించకు.. " అనీ.. 

ఇంకో నా ఆన్లైన్ మిత్రుడు తో : నేను ఒక కామెడీ గ్రూప్ లో పెట్టిన ఫొటోస్ కి తమాషా కామెంట్స్ పెట్టడం చేసేవాడిని. నా కామెంట్స్ నచ్చక పోతే ఊరుకుంటే ( అప్పటికే మెచ్చుకోలుగా ఎన్నో లైక్స్ వచ్చాయి వాటికి ) సరిపోయేది.. కానీ ఊరుకోక, ఇలా కామెంట్స్ పెడితే నవ్వు రాదుకదా అపహాస్యం పాలవుతారు అని అందరి ముందూ పబ్లిక్ గా కామెంట్ పెట్టేశాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. ఊరుకుందాం అంటే అందరి ముందూ విలువ తక్కువ. ఏమి చెయ్యాలో తెలీక - " ఎలా పెట్టాలో మీరు గనుక చూపిస్తే, అలాగే ఫాలో అవుతాను .." అని అన్నాను. దానికి అతను రెచ్చిపోయి, చాలా వాటికి కామెంట్స్ పెట్టాడు. అవన్నింటినీ చూశాను. ఒకరోజు తరవాత కూడా చూస్తే అతను పెట్టిన కామెంట్స్ కి ఒక్క లైక్ కూడా రాలేదు. ఇలా ఒక్కోసారి ఎదిరిస్తే - వారికీ పరిస్థితులు అనుభవం లోకి వస్తాయి. 

No comments:

Related Posts with Thumbnails