Saturday, August 10, 2013

ఏదీ శాశ్వతం కాదు.


మొన్న అలా బయటకి వెళ్ళి వస్తున్నప్పుడు - రోడ్డు వారగా అడ్డముగా కొట్టేసిన రావి చెట్టు మొదలు కనిపించింది. ఈ ఫోటోలోని ఆ చెట్టు మొదలు వేసవి కాలములో దారికి అడ్డముగా వస్తున్నదని కొట్టేశారు. ఆ రావి చెట్టు మొదలు చూశారు కదూ. ఎంత లావుగా, పెద్దగా ఉందో.. 

అలాంటి ఆ చెట్టు మొదలుకి ఒక నన్ను ఆశ్చర్య పరిచిన విషయం ఒకటి జరిగింది. మొన్న కురిసిన భారీ వర్షాలకి ఆ ఎండిపోయిన చెట్టు మొదలు లోంచి, ఒక చిన్న మొలక రావటం ఆశ్చర్య పరిచింది. అంతగా ఎండిపోయిన చెట్టు లోంచి ఎలా ఆ మొలక మొదలయ్యిందా అనుకున్నాను బహుశా ప్రక్కన పడ్డ విత్తనం నుండి ఆ మొలక ఏమో అనుకున్నాను. కానీ కాదు.. 

ఆ చెట్టు మొదలు నుండి ప్రక్కగా మొలిచింది. కొద్దిగా సంభ్రమం. కాసేపటి తరవాత ఒక జీవిత సత్యం కనిపించింది. 

ఇక రాదు, ఇక అంతా అయిపోయినట్లే అనుకున్న సమయాన కూడా క్రొత్త ఆశలు వచ్చి, మళ్ళీ సజీవం గా చేస్తాయి. 




No comments:

Related Posts with Thumbnails