మన జీవితాల్లో చాలా చాలా విషయాలలో ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతాయి. కొన్ని అభిప్రాయాలు ఏర్పరుచుకుంటే అవి తప్పని తరవాత తెలుస్తాయి. అప్పుడు మనసంతా వికలమవుతుంది.
నేను చిన్నప్పుడు ఒక టీచర్ ఉండేవారు. తను అప్పట్లో ఎమ్మెస్సీ ఏమ్మీడీ చేసి, ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తూ, సాయంకాలాల్లో ప్రైవేటుగా ట్యూషన్స్ చెప్పేవారు. అలాగే పీహెచ్డీ కూడా చేస్తున్నారు. తన క్లాసులంటే స్కూల్ పిల్లలకి చాలా ఇష్టం. తను వాడే భాష సరళముగా, తేలికగా ఉండి, చాలా హుందాగా ఉంటాడు. అలాగే చాలా అందముగా (ఇప్పటికీ) కూడా ఉంటాడు.
అతని పాపులారిటీ మీద, మా స్నేహితుడు ఒకరు కాస్త అనుమాన వాఖ్యలు చేశాడు.. ఆ సార్ అమ్మాయిలతో బాగా చనువుగా ఉంటారనీ.. అందుకే అమ్మాయిలతో బాగా చనువుగా ఉంటారనీ.. పైగా వారికి ప్రేమలేఖలు వ్రాశారనీ.. ఇలా చాలానే చెప్పాడు. నేను నమ్మలేదు. చెప్పగా, చెప్పగా, నేనూ నమ్మాల్సి వచ్చింది. కానీ ఎక్కడో ఒక మూల కాసింత అనుమానమే! అవన్నీ నిజాలు కావనీ!. నా స్నేహితుడు నాటిన మాటల వల్ల, ఆ సార్ తో నాకున్న చాలా దగ్గరి ఆత్మీయ బంధం కూడా దూరం చేసుకున్నాను.
నేను అప్పట్లో చాల చిన్నవాడిని. హైస్కూల్ చదువు చదువుతున్నాను. ఊహ మొదలవుతున్నది అప్పుడప్పుడే. ఏది మంచో, ఏది చెడో నేర్చుకుంటున్న సమయం అది. నేనూ ఈ విషయం నా మిగతా మితృలకి చెప్పాను.
నాకు బాగా తెలిసిన అమ్మాయికి ఇదంతా చెప్పేసి, ఆ సార్ తో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అలాగే మీ స్నేహితురాళ్ళనీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అందులకు ఆ అమ్మాయి నాకు క్లాస్ పీకింది. " అలాంటివారు ఏమీ కాదు ఆసార్ అనీ.. నీకు ఎవడు చెప్పాడో కానీ వాడే అనుమాన పక్షి గాడు.." నన్నే క్లాస్ పీకింది. " నీ ఇష్టం.." అని ఆ టాపిక్ అక్కడితో ముగించేశాను.
కాలచక్రం గిర్రున తిరిగింది. జీవితములో చాలా ముందుకి వచ్చేశాం. మొన్న ఆ సార్ కలసి, తనే ముందుగా నన్నే పలకరించారు.. ఏమిటీ రాజ్!.. బాగున్నారా?.. అంటూ. నేను గుర్తుపట్టాను. బాగున్నారా.. అని కాసిన్ని కుశల ప్రశ్నలు అయ్యాక తను వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయారు. తానిప్పుడు జిల్లా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. (D.E.O) అయినా ఏమాత్రం దర్పం చూపక, మామూలుగా ఆత్మీయముగా మాట్లాడారు. చిన్నప్పుడు నాతో ఎలా మాట్లాడేవారో, అచ్చు అలాగే అదే టెంపోలో. మాటల్లో ఆ తీయదనం ఏమీ మారలేదు - ఎన్నో సంవత్సరాలు గడిచినా.!
నాకు అప్పుడు చిన్నప్పుడు తనమీద అన్నమాటలు గుర్తుకువచ్చాయి. నామీద నాకే సిగ్గుగా, అసహ్యముగా అనిపించింది. అప్పట్లో తనమీద చెప్పిన మాటలు అన్నీ తప్పే!. ఊహ మొదలవుతున్న తరుణాన జరిగే తప్పులు అవి. మెచ్యూరిటీ ఏమాత్రం లేని సమయం అది. అయినా నేను చేసింది తప్పే!. నేను విన్నది అంతా అబద్ధం అని కొద్ది సంవత్సరాలలోనే తెలుసుకున్నాను.
అప్పటినుండీ యే విషయానైన్నా స్వంతముగా నిర్ధారించుకున్నాకే ఇతరులకి చెప్పటం మొదలెట్టాను. ఇన్ని సంవత్సరాల్లో ఆయన నష్టపోయింది ఏమీ లేదు. జీవితాన చిన్న వయస్సులోనే ఉన్నతమైన హోదాని సంపాదించాడు. నష్టపోయింది మాత్రం నేనే!.. తన పరిచయం, మితృత్వం, సాంగత్యం.. ఇవన్నీ ఇన్ని సంవత్సరాలుగా నష్టపోయాను. చెప్పుడు మాటలు వింటే - ఏదేదో ఊహించుకోవటానికి, చెప్పటానికి బాగానే ఉంటుంది. కానీ చివరకి మనమే నష్టపోతాం అని నాకు కాలమే చక్కగా తెలియచేసింది.

3 comments:
ఒకోసారి అంతే! వేరొకరి మాట వలన మన చిన్న మెదడు.. చితికి పోయి ఆలోచన చచ్చి పోతుంది.
మంచి పోస్ట్..రాజ్ గారు.
valuable post. Thank you.
కృతజ్ఞతలు.. అవునండీ.. వనజ గారూ!. ఎర్రని కళ్ళద్దాల గుండా లోకాన్ని చూస్తే, లోకమంతా ఎర్రగా కనిపిస్తుంది. ఆ కల్లద్దాలని తీసేస్తే గానీ అసలు లోకం ఏమిటో గానీ చూడలేం..
Good
Nice Realization
thanks for sharing
:)
?!
Post a Comment