ఈ మధ్య మార్కెట్లలో ఇచ్చే నల్లని, తెల్లని, నీలి రంగుల్లో ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని చూశారా.. కూరగాయల కొట్లల్లో, హోటల్స్ లలో, కిరాణా దుకాణాలలోనే కాక ఎన్నో చోట్ల ఉచితముగా ఇచ్చే ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని ఒకసారి పరిశీలించండి.. మన ఆరోగ్యాలతో ఎంత దారుణముగా అడుకుంటున్నారో మీకే అర్థమవుతుంది.
ఇరవై మైక్రాన్ల మందం లోపు ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని ప్రభుత్వ నిషేధం తరవాత, నిషేధం మాటేమితో గానీ, ఎక్కడ చూసినా ఈ ఇరవై మైక్రాన్ల మందము లోపే క్యారీ బ్యాగులు కనిపిస్తున్నాయి, వాడకములోకి వచ్చేస్తున్నాయి కూడా. నిషేధము ముందే కాసింత నయం. జెన్యూన్ ప్లాస్టిక్ తో చేసిన తెల్లని ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని ఇచ్చేవారు. ఇప్పుడు అవి పూర్తిగా మార్కెట్ నుండి మాయం అయ్యి, ఈ బ్యాగులు బయలుదేరాయి. ఎక్కడ చూసినా ఇవే.
ఇప్పుడు మార్కెట్లలో ఇస్తున్న ఈ క్యారీ బ్యాగులని ఒకసారి పరిశీలిద్దాం. మొదట్లో తెల్లని రంగులో / పారదర్శకమైన క్యారీ బ్యాగులు మార్కెట్లో లభ్యం అవుతుండేటివి. నల్ల రంగు క్యారీ బ్యాగులు చాలా తక్కువగా వాడేవారు. నిషేధం తరవాత తెల్లని రంగులోనివి, మార్కెట్ నుండి పూర్తిగా మాయం అయ్యాయి. నల్లని కవర్లలో కూడా జెన్యూన్ ప్లాస్టిక్ నుండి తయారయిన బ్యాగుల స్థానాన, రిసైకిల్డ్ ప్లాస్టిక్ నుండి చేసిన ప్లాస్టిక్ బ్యాగులు రావటం మొదలయ్యాయి. ఇవి బాగుండటం లేదని అంటున్నారని, కాసింత సాంకేతికత పొంది, అదే రిసైకిల్డ్ ప్లాస్టిక్ తో తయారయిన అసంపూర్ణ పారదర్శకత ఉన్న తెలుపు, నీలిరంగు కవర్లు తయారుచేసి, ఇస్తున్నారు. ఈ రంగు కవర్లని చూసి ఒరిజినల్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులనే అనుకుంటాము. కాని తరవాత కాదని తెలుసుకొని, మోసపోతాం.
ఈ ప్లాస్టిక్ కవర్లని ఒకసారి ఓపెన్ చేసి, వాసన చూడండి. మీకు డోకు రావటం ఖాయం. అందులోని ఆహార పదార్థాలని ఇక ఎలా తినగలం? ఆహారపదార్థాలు అయిన పళ్ళు, టిఫినీలు, కేకులు, బిస్కట్స్ ని రెండు భాగాలు చేసి, వీటిల్లో ఒక భాగం పెట్టి కాసేపటి తరవాత తిని చూడండి. అలాగే అందులో పెట్టకుండా బయట పెట్టిన భాగాన్ని కూడా రుచి చూడండి. ఎంత తేడా కనిపిస్తుందో చూడండి. అంతా ఏదో మురికి వాసన వస్తున్నట్లుగా ఉంటుంది చూడండి.
అలా వాసన వస్తున్న కవర్లని మార్కెట్లో ఎలా అమ్మనిస్తున్నారో, ఎలా వారు మనకి ఇస్తున్నారో, మనం కూడా అసలు వాటి గురించి ఏమీ తెలుసుకోకుండా వాటిని వాడటం ఏమిటో.. ఏమిటో అస్సలు అర్థం కాదు. ఇందులో ఎవరిదీ తప్పు అని మీన మేషాలు లెక్కపెట్టక, దయచేసి ఆ క్యారీ బ్యాగుల్ని వాడకండి. మీ ఆరోగ్యాలని పాడు చేసుకోకండి.

4 comments:
రాజ్ గారు మీరు చెప్పినది నిజం. ఇప్పుడు ఎక్కడ చూసినా నలుపు రంగు కవరులని వాడుతున్నారు.క్యారి బాగ్ ల నిషేధం అధికారికం ఏమో కాని ప్రజలలో అవగాహన పెరిగి మనమే వాటిని నిషేదించడం చేయాలి. లేకపోతె.. అనారోగ్యాల పాలబాడటం తధ్యం. అవగాహన కల్గించే పోస్ట్. థాంక్ యు.
అవునండీ.. సరిగ్గా చెప్పారు వనజగారూ.. మనమే వాటిని వాడటం నిషేధించాలి. అదొక్కటే ప్రస్తుత పరిష్కారం.
నిజమే రాజ్ గారూ,
హైదరాబాదు లో ప్రగతి నగర్ అనే ఒక కాలనీ లో ప్రజలే వాటిని నిషేధించారు.అక్కడ దుకాణాల వాళ్ళూ, హోటళ్ళ వాళ్ళూ కూడా కాగితపు సంచులే ఇస్తారు. జనం కూడా వాళ్ళ గుడ్డ సంచులు వాళ్ళే దుకాణాల కి పట్టుకుని వెళ్తారు. ఇది నేను స్వయం గా చూసాను. ఇలాంటి కాలనీలని అదర్శం గా తీసుకోవాలి మనం.
చాలా చక్కని, ఆదర్శపు విషయం చెప్పారు. మీకు కృతజ్ఞతలు.
Post a Comment