ఫేస్ బుక్ లో ఒక కామెంట్ వ్రాసి పోస్ట్ చేశాక, వెంటనే ఆ కామెంట్ లో ఏదైనా మార్పు చెయ్యాలనిపించిందా?.. లేదా ఆ కామెంట్ అలా వ్రాయక వేరేలాగా వ్రాయాలని ఉందా..? లేదా అర్రెర్రె.. ఇలా వ్రాశానేమిటీ?.. అని సరిదిద్దాలని అనుకుంటున్నారా?.. ఫరవాలేదు. మీరు వెంటనే ఆ పోస్ట్ చేసిన కామెంట్ బాక్స్ కుడి వైపు మూలన ఉన్న రిమూవ్ బటన్ ని నొక్కండి. ఇది X గుర్తుతో ఉంటుంది. ఆ మూలన మౌస్ తో కర్సర్ ని అక్కడ పెడితే గానీ కనిపించదు. అలా కర్సర్ ని పెట్టగానే ఇలా ఈ క్రింది ఉదాహరణ లోలా కనిపిస్తుంది.
అలా కనిపించాక దాన్ని వెంటనే నొక్కండి. అప్పుడు ఈ క్రింది దానిలా మళ్ళీ ఎడిట్ చేసేలా వీలుగా కనిపిస్తుంది.
అప్పుడు మీరు మళ్ళీ ఎడిట్ చేసి, మార్పులు ఏమైనా ఉంటే చేసి, మళ్ళీ పోస్ట్ చేసెయ్యండి అంటే ఎంటర్ బటన్ ని నొక్కటమే. చాలా సింపుల్ గా ఉంది కదూ..
ఇక్కడ ముఖ్యమైన విషయం : అలా ఆ కామెంట్ ని ఎడిటింగ్ కోసం మళ్ళీ తెరవటానికి రెండు మూడు సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. కాసింత ఆలస్యం చేస్తే తెరుచుకోదు. అప్పుడు డిలీట్ చేసి, మళ్ళీ వ్రాయటం తప్పదు.
4 comments:
మంచి ఉపయోగకరమైన చిట్కానే. తెలిపినందుకు కృతజ్ఞతలు.పొరపాటులేమైనా చేస్తే దిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది కదా? ఇది మనం మనబ్లాగులో పెట్టిన కామెంట్లకి కూడా వర్తిస్తుందా తెలుపగలరు.
మన బ్లాగుల్లో మాత్రం అలా అవకాశం లేదండీ.. ఒకసారి పోస్ట్ చేశాక, ఇక మన చేతుల్లో మార్పు చెయ్యటానికి ఏమీ ఉండదు. బ్లాగ్ లో పబ్లిష్ అయితే, ఇక ఆ కామెంట్ డిలీట్ చెయ్యటమే మనం చేసే మార్పు. ఒకవేళ కామెంట్స్ మాడరేషన్ పద్ధతిలో ఉంటే ఆ బ్లాగ్ ఓనర్ అయినా మార్పు చెయ్యలేరు.
Very nice
Thanks..
Post a Comment