మీరు క్రొత్తగా కొన్న జీన్ ప్యాంట్ పొడవు బాగా ఎక్కువైనదని క్రింద పొడవు కత్తిరించి, కుట్టిస్తాము కదా.. చాలామంది అలాగే ఎక్కువైనది మడిచేసి, వేసుకుంటారు. కొద్దిమంది మాత్రం ఆ ఎక్కువైనా పొడవు కత్తిరించేసి, కుట్టిస్తారు. లేదా ఇంట్లోన ఉన్న కుట్టుమెషీన్ మీద కుట్టేస్తారు. బయట టైలర్స్ వద్ద ఉన్న, లేదా ఇంట్లోన ఉన్న మెషీన్స్ మీద కానీ ఆ కత్తిరించిన బట్టని మడిచి కుట్టడం వీలు కాదు.
ప్యాంట్ లోపలి భాగాన ఉన్న నాలుగుపొరల జాయింట్ - ఇది తొడల జాయింట్ వద్ద నుండి పాదాల వరకూ ఉంటుంది. ఈ కుట్టు మీదుగా మెషీన్ ని నడిపించటం వీలు కాదు. ఒకవేళ కుట్టడానికి ప్రయత్నించినా - సూది దిగక, విరిగిపోవటం మామూలే.. అందుకే జీన్ ప్యాంట్ ని మడిచి కుట్టేవారు చాలా తక్కువగా ఉంటారు. జీన్ ప్యాంట్ ని కుట్టేవారి కోసం వెదికినా, వారు ఎక్కడో ఉంటారు. సమయానికి దొరకరు. పోనీ అలాగే వాడుకుందాం అనుకుంటే - వాడుకలో ఆ అంచుల వద్ద చినిగి అసహ్యముగా కనిపిస్తుంది. అక్కడికి మడిచి కుట్టుకోవాలన్నా - అప్పుడు ఆ పొడవు సరిపోక అలాగే వాడాల్సివస్తుంది.
ఇప్పుడు ఆ ఇబ్బందిని ఎలా తొలగించుకొని, అంచులని లోపలి మడిచి, సాధారణ కుట్టు మెషీన్ మీద ఎలా కుట్టాలో ఇప్పుడు మీకు తెలియచేస్తాను.
1. ముందుగా మీ జీన్ ప్యాంట్ వేసుకొని చూసి, ఎంత పొడవు మీకు అవసరమో చూసుకొని, అక్కడ మార్క్ చెయ్యండి.
2. ఆ మార్క్ చేసిన దగ్గర నుండి రెండు అంగుళాలు లోపలి మడవటానికి వీలుగా ఉంచేసి, మిగతా ఎక్కువైన బట్టని అడ్డముగా కత్తిరించండి.
3. ఇప్పుడు మీరు ఆ కాలి భాగం ని తీసుకొని, లోపలి భాగములో ఉండే లావాటి మడత కుట్టు వద్ద ఇలా కత్తెర తో కత్తిరించండి.

4. ఇప్పుడు ఆ కత్తిరించిన వరకూ లోపలికి మడిచి, మళ్ళీ ఇంకో మడత పెట్టి, మామూలు మెషీన్ మీద ఆ అంచుని కుట్టేయవచ్చును. ఇప్పుడు మీరే అనుకుంటారు.. ఇంత ఈజీగా, సూది విరగకుండా అంచు కుట్టొచ్చును అనీ.
2 comments:
ammoo..enni ideas oo meeku..aggi pulla..sabbu billa...kaadedi kavitakanarham annattu...jeans pants..nundi...greeting cards varaku anni vunnaayi mee blog lo.
Inkaa chaalaane unnaayi ideas.. Post cheyyataaniki Samayam dorakatam ledu..
Post a Comment