నా కాలేజీ రోజుల్లో - మా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన చిత్రమైన సంఘటన ఇది. వాళ్ళింట్లో వండిన వంటపాత్రలని వంటగదిలోని వాష్ బేసిన్ లో కాకుండా ఆరుబయట కడిగేసేవాళ్ళు. అలా ఆ పాత్రలని బయట వెయ్యగానే ఒక కాకి వచ్చి వాలి, మిగిలిన ఆహార పదార్థాలని తినేసేది. దానికి బాగా రుచిగా అనిపించిందేమో గానీ, రోజూ క్రమం తప్పకుండా వచ్చేది.
ఇక్కడ హాస్చర్యకర విషయం ఏమిటంటే - సాధారణంగా కాకులు మనుష్యుల అలికిడి కాగానే, తుర్రుమని ఎగిరివెళ్ళిపోతాయి. కానీ ఈ కాకి మాత్రం అలాగే ఉండిపోయేది. దాని ప్రక్కగా నడిచినా, దాన్ని అదిలించినా ఎగిరి వెళ్ళిపోయేది కాదు.. రెండు గంతులు వేసి, చేతికి అందనంత దూరములో ఉండేది అంతే!
ఇది మా బంధువుల ఇంటావిడకి ఇదంతా ఎందుకోగానీ చాలా ఇబ్బందిగా ఉండేది. దాన్ని ఎంత అదిలించినా చివరికి పిట్టగోడ మీద వాలేది కానీ, అక్కడినుండి పోయేది మాత్రం కాదు. నన్ను పిలిచి దీన్ని ఇక్కడినుండి వెళ్ళగొట్టమని అడిగితే, నేనూ ప్రయత్నించాను.
మొదట్లో మామూలుగానే వెళ్ళగొట్టాలని చూశాను. కానీ వెళ్ళేది కాదు. అలా వెళ్ళి పిట్టగోడ మీద ఉండి చూసేది. నేను వెనక్కి తిరగాగానే మళ్ళీ క్రిందకి వచ్చి వాలేది. ఇలా చాలాసార్లు జరిగింది. ఇక లాభం లేదు. ఏదో ఒక మార్గం ఆలోచించాలి అనుకున్నాను.
అది పిట్టగోడ మీద వాలగానే, మళ్ళీ అదిలించేవాడిని. అలా అది లేచి, ఎగిరినంత సేపు ఎగిరి, మళ్ళీ ఆ గోడ మీద ఇంకో క్షణంలో వ్రాలబోతుంది అన్నప్పుడు మళ్ళీ అదిలించటం మొదలెట్టాను. అది మళ్ళీ ఎగిరేది. మళ్ళీ ఆ గోడమీద వ్రాలబోతుంటే - అదిలించటం.. ఇలా జరిగేది. ఒకమాటలో చెప్పాలంటే - ఒకరిని కూర్చోమని చెప్పి, కూర్చోబోతుంటే నిలబడమని ఆర్డర్ వేస్తే వారికి ఎలా ఉంటుందో అలా అన్నమాట.
ఈ పథకం బాగా వర్క్ అయ్యింది. నేను అక్కడ ఉన్నన్నిరోజులూ - నేను రావటంతోనే ఆ కాకి ఎగిరిపోయేది. అలా నన్ను చూస్తేనే ఆ కాకి భయపడి ఎగిరిపోయేలా చేశాను. చాలా సిల్లీగా, వింతగా ఉంది కదూ.. అప్పటి పరిస్థితులు అలాంటివి.
ఇప్పుడు మాత్రం అలా ఎదురవుతే - ఆ మిగిలిన ఆహార పదార్థాలు అన్నీ ఒక గిన్నెలో వేసి, ఆ పిట్టగోడమీద పెట్టి, ఆరగింపు చేసేవాడిని. ఇంకా జ్యోతిష్య పద్ధతిలో చెప్పాలంటే - అలా ఆ కాకికి అలా వారానికి ఒకసారి (శనివారం రోజున) దానికి ఇంత ప్రసాదం లా పెట్టేసి, ఏలినాటి శని పీడ ఏమైనా ఉంటే - కాసింత దోషాన్ని పోగొట్టుకోనేవాడిని. ప్చ్! కొన్ని తెలీక చేస్తాం. తెలిసినప్పుడు ..అనుకూలించక చెయ్యలేకపోతాం.
1 comment:
కాకి తో మీ ఆటలు బాగున్నై
Post a Comment