Saturday, February 4, 2012

నా బ్లాగ్ అడ్రెస్ మారిందోచ్చ్..!

ప్రభుత్వాల కొన్ని సూచనల మేరకి, గూగుల్ మరియు తదితర సంస్థలు తమ తమ సైట్స్ లలో మార్పులు చేశాయి. అలా చేశాక నిన్నటి నుండీ నా బ్లాగ్ అడ్రెస్ మారిపోయింది.. అంతకు ముందు నుండీ www.achampetraj.blogspot.com అని ఉన్న నా బ్లాగ్ అడ్రెస్ ఇప్పుడు www.achampetraj.blogspot.in గా మారింది. నా బ్లాగ్ వీక్షకులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇలా కలిగిన అసౌకర్యానికి మనసారా మన్నించండి.

చివరగా ఉన్న .com కాకుండా .in మార్పు వచ్చింది. ఇలా ఎందుకూ అంటే - ఆ చివరలో ఉన్న .in వల్ల ఆ బ్లాగ్ ఇండియా నుండి పబ్లిష్ అవుతున్నది అని తెలుసుకోవటానికి అన్నమాట. భారతదేశములో ఉన్న ప్రతి రాష్ట్రానికి ఒక్కో మోటార్ వాహన నంబర్ (ఉదాహరణ : AP, HP, RJ, TN..) ఎలాగో, అలాగే ఈ బ్లాగ్స్ ని కూడా అలా సార్టింగ్ చేస్తున్నారు.

ఈ బ్లాగుల్లో - స్వేచ్చ ఉంది కదా అని సెలెబ్రిటీ, రాజకీయనాయకుల మీద ఏవేవో కేలికేసి, పోస్ట్ చేశారు అనుకోండి. అది వారికి తెలిసి కంప్లైంట్స్ ఇస్తే - ఆ పోస్ట్ చేసినవారి తాలూకు ISP (Internet Service Provider) నంబర్ ఆధారముగా వారిని పట్టుకొని, అరెస్ట్ చేస్తారు. కావున కాసింత జాగ్రత్తగా ఉండండి. 

1 comment:

Unknown said...

సమాచారానికి కృతఙ్ఞతలు.

Related Posts with Thumbnails