Wednesday, February 8, 2012

Block option in Facebook

ఈ మధ్య సోషల్ సైట్లోకి వెళ్ళాక - ఒక పోస్ట్ కనిపించింది. అది ఒకరు ఒక గుడ్ మార్నింగ్ విషెస్ చెబితే - దానికి ప్రతిగా కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ ని చూశాక అదిరిపోయాను. అసలు ఆ పోస్ట్ కీ, ఈ కామెంట్ కీ సంబంధమే లేదు. అయినా ఏదో ఒకటి మనసుకి బాధపెట్టేలా అనేయడం.. జరిగిపోయింది. ఇలా రెండు, మూడు పోస్ట్స్ కనిపించాయి. అందులో ఒక పోస్ట్ ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇందులో వారి వివరాలు కనిపించకుండా చేశాను. అక్కడ వ్రాసిన పోస్ట్ కీ, క్రింద ఉన్న కామెంట్ కీ ఏమైనా లింక్ ఏమైనా ఉందేమో చూడండి.


ఇలా ఉంటాయి కామెంట్స్. ఎదుటివారెవరో వారికే సరిగ్గా తెలీదు.. ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా ఏమీ ఉండవు. ఇంతకు ముందు ఎలాంటి ద్వేషాలు ఇద్దరి మధ్య లేకున్నా - ఉరుములు లేని పిడుగుల్లా, కచ్చగా మీద పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటివి ఎదురుకాకుండా తప్పవు. ఆ మాటకి వస్తే - నాకు తెలిసినంతవరకూ ప్రతి సోషల్ సైట్ మెంబరూ ఏదో ఒకరోజు ఇలాంటి ఊహించని ప్రమాదాల్ని ఎదురుక్కునే ఉంటారు.. ఎదురుపడనివారికి ఎదురుకావొద్దని కోరుకుంటాను. ఇలాంటివి ఎలా ఎదురుకోవాలో ఒక చిన్ని టిప్ ని ఇప్పుడు చెబుతాను. 

ఒక్కో సోషల్ సైట్ కీ ఒక్కో పద్ధతి ఉంటుంది.. ఇప్పుడు నేను ఫేస్ బుక్ సోషల్ సైట్ లో ఎలాగో ఇప్పుడు చెబుతాను.. 

ఫేస్ బుక్ లో నాకు నచ్చిన విషయం ఏమిటంటే - ఎవరితోనైనా మనకి ఇష్టం లేకుండా ఉన్నప్పుడు, వారిని మనం బ్లాక్ చేస్తే, మనం చేసే పోస్ట్స్, కామెంట్స్.. అందులో మనం చేసే చర్యలన్నీ - వారికి యే మాత్రం కనిపించకుండా ఉంటుంది. వారు ఎంత వెదికినా కనిపించము.. కనిపించవు. ఒక్కమాటలో చెప్పాలీ అంటే - అదృశ్యరూపములో ఆ సైట్ లో వారికి కనిపించకుండా మనకి నచ్చినట్లుగా ఉంటాము అన్నమాట. నాకు ఈ పద్ధతి చాలా బాగా నచ్చేసింది. ఆ పద్ధతి ఏమిటో మీలో చాలామందికి తెలిసి ఉండోచ్చును. కానీ తెలీనివారికి, తెలియక అలాంటి ఒక్కరి ప్రవర్తన వల్ల ఇబ్బందులు పడుతూ తమ ఆనందాలని, మిత్రులనీ దూరం చేసుకుంటున్నవారు ఈ పద్ధతిని పాటించండి. 

మీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి, మీకు ఎవరినైనా బ్లాక్ చెయ్యాలీ అనుకుంటే వారి లింక్ ద్వారా వారి అకౌంట్ కి వెళ్ళండి. వారి ప్రొఫైల్ పేజీలో పైన కుడివైపు మూలన ఇలా మీకు కనిపిస్తుంది. చివర్లో కనిపించే సెట్టింగ్స్ గుర్తు 1 వద్ద త్రికోణాన్ని నొక్కితే, ఒక చిన్న మెనూ వస్తుంది. అందులో Report/Block 2 ని నొక్కాలి. 


అలా ఆ రెండో దాన్నీ నొక్కాక, ఇప్పుడు మీకు ఒక పాపప్ విండో కనిపిస్తుంది. అక్కడ 3 Block వద్ద చిన్న గదిలో టిక్ చెయ్యాలి. మీకు ఇంకా అదనముగా ఆ వ్యక్తి మీద కంప్లైంట్స్ ఏమైనా ఇవ్వాలీ అనుకుంటే - ఆ క్రిందన ఉన్న ఆప్షన్స్ లలో సరియైనది ఎంచుకొని, 4 వద్ద Continue ని నొక్కితే సరి. 


ఇక ఆ వ్యక్తి యొక్క పోస్ట్స్, కామెంట్స్, ఫొటోస్, లైక్స్ మొదలైన అన్ని అప్డేట్స్ మీకు అస్సలు కనిపించవు. ఒక్కమాటలో చెప్పాలీ అంటే మీకు ఎక్కడా కనిపించక, అదృశ్యం అవుతాయి. మళ్ళీ వారిని మీరు Unblock చేసేదాకా అంతేమరి. ఈ పద్ధతి చాలా బాగుంది కదూ. ఇంకేం. మీకు నచ్చనివారినీ, మీ మీద కామెంట్స్ చేస్తూ, మీకు చీకాకు తెప్పిస్తున్నవారినీ ఇలా చేసి, బాగా ప్రశాంతముగా ఉండండి. 



2 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

నమస్తే.మీబ్లాగు అత్యంత ప్రయోజనకరమైనది ఈ ఆధునికులకు.
మీకు నా అభినందనలు.
ఈ క్రింది లింక్ తెరచి చదవి తెలుగు భాషాభిమానులకు పదిమందికీ తెలిఅయడం కోసం మీ బ్లాగులో వ్రాయ వలసినదిగా మనవి.
http://andhraamrutham.blogspot.in/2012/02/blog-post_06.html

nagaraju said...

సార్ మీరు చెప్పింది నాకు చాలా ఉపయోగపడుతుంది,మీరు చాలా బాగా చెప్పారు
freelatest-mp3songs.blogspot.com

Related Posts with Thumbnails