మొన్న మా ఫ్యామిలీ మిత్రుని ఇంటికి వెళ్ళాను.. కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక, టీ తీసుకోచ్చేశాడు. అలా టీ త్రాగుదామని అనుకొని అందుకునే లోపుగా " వాటర్ ఏమైనా కావాలా..?" అని నా సమాధానం కోసం ఏమీ చూడకుండా లేచి, ఫ్రిడ్జ్ డోర్ తీసి, ఒక వాటర్ బాటిల్ అందుకున్నాడు. దాని తలుపు మూసి, వచ్చేసి, ఆ బాటిల్ మూత సగం విప్పుతూ, నాకు అందించాడు.
ఎలాగూ విప్పాక త్రాగాకపోతే బాగోదని, అందునా పదిహేను రూపాయలు పెట్టి కొన్న బ్రాండెడ్ వాటర్ బాటిల్ ని వద్దని చెప్పలేక అలాని అందుకొని, నీరు త్రాగేసి, అక్కడ పెట్టాను. మిగతా వాటర్ ని అలాగే ఎత్తిపట్టేసుకొని, త్రాగేసి ఖాళీ బాటిల్ ని అలా మూలగా వదిలేశాడు. వీడు మరీ "పోష్ స్టైల్స్.." చూపిస్తున్నాడు అని అనుకున్నాను.. అ తరవాత టీ త్రాగేశాను.
ఆ తరవాత మాటల్లో ఖర్చు తక్కువ - లుక్కు ఎక్కువ అనే కాన్సెప్ట్ మీద చర్చ జరిగింది. అలా జరిగినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు.. ఇందాక నేను త్రాగిన వాటర్ బాటిల్ బ్రాండెడ్ ఏమీ కాదు - ట.
"అదెలా..? ఆ బాటిల్ మీద అక్వాఫినా అంటూ బ్రాండ్ (పెప్సీ వారిది.) పేరు ఉంది కదా.." అన్నాను. ఒకింత హాస్చర్యపోతూ.. నా కన్నులు పనిచెయ్యటం లేదా? అని నా మీద నాకే డౌట్..
మాయాబజార్ సినిమాలోని ఘటోద్ఘజుడిలా ఒకసారి వికట్టాసం చేశాడు. ఆ తరవాత అసలు విషయం చెప్పాడు. అదీ ఎవరికీ చెప్పొద్దని అన్నాడు. (నిజానికి ఇలా చెప్పొద్దూ అని చెప్పినవే చెప్పాలని అనిపిస్తుంది కదూ)
వాడు కారులో ఎటైనా వేరే చోట్లకి వెళ్ళినప్పుడు - దారిలో వాటర్ బాటిల్ కొన్నాక, ఆ నీళ్ళు త్రాగాక ఆ బాటిల్ ని పారెయ్యడు. భద్రముగా ఎవరూ చూడకుండా - వెనక సీట్లోనో, డిక్కీలోనో వేసుకొని ఇంటికి భద్రముగా తీసుకొచ్చేస్తాడు. అలా వచ్చాక అతను వాటిలో వాటర్ బబుల్ లోని నీటిని నింపి, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాడు. చల్లగా, వాటి మీద కాసింత తేమ ఏర్పడేదాకా బయటకి తీయడు. ఆ తరవాత ఎవరైనా వస్తే అప్పుడే మూత (సీల్) విప్పినట్లుగా చేసి, త్రాగటానికి బాటిల్ ఇస్తాడు. ఇవన్నీ తెలీనివారు అదొక మహాభాగ్యముగా - మాకోసం క్రొత్త వాటర్ బాటిల్ సీల్ తీసి ఇస్తున్నాడు అనే భ్రమలో అతని సేవలకి పొంగిపోతారు.. ఆ బాటిల్ పాతది అయ్యిందా ఇక అది తీసేస్తాడు. ఇప్పుడే షాప్ లో అమ్మినట్లుగా లుక్ ఉంటేనే వాడుతాడు.
వాడి ఫ్రిడ్జ్ నిండా అలాంటి వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇంటి లోపల బ్యాగుల్లో అలాంటి బాటిల్స్ మరెన్నో స్టాకు లో ఉన్నాయట. అలా మళ్ళీ మళ్ళీ వాడి పర్యావరణాన్ని తొందరగా పాడుకాకుండా (ఖాళీ బాటిల్స్ పారవేయకుండా మళ్ళీ వాడి) తనవంతు పాత్ర పోషిస్తున్నాను అని గొప్పగా చెప్పాడు. హ హ్హా హా.. పబ్లిక్ ఎంత తెలివి మీరిపోయారు..

Aquafina |

1 comment:
In a way he is right.
Post a Comment