Tuesday, May 31, 2011

Jeevitha chakram - Kanti chupu chebuthundi

చిత్రం : జీవితచక్రం (1971)
రచన : ఆరుద్ర
సంగీతం : శంకర్-జైకిషన్
గానం : ఘంటసాల
**************
పల్లవి :

కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
ఆశలు దాచకు.. ఆశలు దాచకు // కంటిచూపు //

చరణం 1 :

ఆడపిల్ల పూలతీగె - ఒక్కలాగే చక్కనైనవి
ఆడపిల్ల పూలతీగె - ఒక్కలాగే చక్కనైనవి
ఆడపిల్ల పూలతీగె ఒక్కలాగే - అండ కోరుకుంటాయి ఆ... హా..
అందమైన మగవాడు - పొందుకోరి వచ్చాడు
ఎందుకలా చూస్తావు - ఓ పిల్లా
స్నేహము చేయవా - స్నేహము చేయవా // కంటిచూపు //

చరణం 2 :

కొమ్మమీద గోరువంక - రామచిలక జోడు గూడె
కొమ్మమీద గోరువంక - రామచిలక జోడు గూడె
కొమ్మమీద గోరువంకా - రామచిలకా
ముద్దుపెట్టుకున్నాయి ఆ.. హా..
మెత్తనైన మనసు నీది - కొత్త చిగురు వేసింది
మత్తులోన మునిగింది - ఓ పిల్లా
మైకము పెంచుకో - మైకము పెంచుకో // కంటిచూపు //

చరణం 3 :

చెప్పలేని వింత వింత అనుభవాలు - విరగబూచె
చెప్పలేని వింత వింత అనుభవాలు విరగబూచె
చెప్పలేని వింత వింత అనుభవాలూ
ఎదురుచూస్తున్నాయి ఆ.. హాహ్హ హ్హా..
నువ్వు నన్ను చేరాలి - నేను మనసు ఇవ్వాలి
ఎడము లేక ఉండాలి - ఓ పిల్లా
వస్తావా? మురిపిస్తావా? - వస్తావా? మురిపిస్తావా?  // కంటిచూపు //

Monday, May 30, 2011

Rangam - Ee Manchullo


చిత్రం : రంగం (2011)
గానం : శ్రీరాం పార్థ సారథి, బాంబే జయశ్రీ
రచన : వనమాలి 
సంగీతం : హరీస్ జైరాజ్
**************

ఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌ - ఆల్ ఈజ్ గానా బి ఆల్రైట్
ఓహ్ ఐ విల్ బి దేర్ - ఐ విల్ బి దేర్ ఫర్ యు 
ఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌ 
ఫ్రోజెన్ ఇన్ లవ్ - లెట్స్ వార్మ్ అండ్ క్లోజ్ 
అరౌండ్ నౌ 

పల్లవి :

ఈ  మంచుల్లో, ప్రేమంచుల్లో - ఎన్నెన్నో సంగతులూ
నీరెండల్లో ఈ గుండెల్లో - ఎన్నెన్నో సందడులూ
కవ్వించే చీకటి - కన్నుల్లో ఈ తడి 
ఇవ్వాలే వీడేనులే - ఉండుండి ఊహలు
ఈ పిల్ల గాలులు - నిన్నే పిలిచేనులే // ఈ  మంచుల్లో ప్రేమంచుల్లో //

చరణం 1:

కనులకు జతగా - వలపుల కథనే
కలలుగా కొసరనా
గల గల పలికే - పెదవుల కోసమే
కబురునై నిలవనా
నేడిలా మది విరిసేను ప్రేమలో
తేనెలే పెదవోలికేను జంటలో
కలయికలో // ఈ  మంచుల్లో ప్రేమంచుల్లో //

ఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌ - ఆల్ ఈజ్ గోన్నా బి ఆల్రైట్
ఓహ్! ఐ విల్ బి దేర్ - ఓహ్ ఐ విల్ బె దేర్
ఐ విల్ బి దేర్ ఫర్ యు
ఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌ - ఫ్రోజన్ ఇన్ లవ్
లెట్స్ వార్మ్ అండ్ క్లోజ్ - అరౌండ్ నౌ

చరణం 2:

మనసుని దాటి - మనసుని మీటి
నిలిచేనే మమతలు
ఒకపరి జననం - ఒకపరి మరణం
నిలువునా తోలిచేలే
యవ్వనం మనసుకి - తొలి మోహనం
చుంబనం వయసుకి - ఒక వాయనం
అనుదినమూ // ఈ  మంచుల్లో ప్రేమంచుల్లో //

Sunday, May 29, 2011

Social NW Sites - 31 - ఫేక్ ప్రోఫైల్స్

సోషల్ సైట్లలో ఫేక్ ప్రోఫైల్స్ అంటే - ఈ క్రింది ఫోటోలోలా ఉంటాయి. మొన్న నాకు ఒక మెయిల్ వచ్చింది. ఎవరో ఫేస్ బుక్ అక్కౌంట్ ఉన్నవారు బాగా తెలివిగా ఇదంతా ప్లాన్ చేసి, తయారుచేసినట్లుగా ఉన్నారు. నేను చూడగానే అనుకున్నాను.. - ఇది ఖచ్చితముగా ఫేక్ అనీ. స్పష్టముగా చూడటానికి ఫోటో మీద డబల్ క్లిక్ చెయ్యండి.


చూశారు కదూ.. క్షణం తీరిక లేనివారు (ఆఫ్కోర్స్ - ఇప్పుడు కాస్త వీలు ఉందనుకోండి.) అలా ఫేస్ బుక్ అక్కౌంట్స్ పెట్టుకొని అలా పబ్లిక్ గా మాట్లాడుకుంటారా! ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేశారు. నిజానికి ఇలా చెయ్యటం ఈజీనే అనుకోండి. ఐదారు వ్యక్తులు కలసి డీపీలూ, ప్రోఫైల్స్ మార్చుకొని, ముందే అనుకున్న ప్రకారం పోస్టింగ్స్ చేస్తే చాలు.. లేదా ఒక వ్యక్తి ఫేక్ ఐడి లతో కావలసినన్ని అక్కౌంట్స్ ఓపెన్ చేసి, ఇలా రూపొందించొచ్చు.

ఈ ఉదంతం చెప్పాలని అనుకోలేదు. కాని ఫేక్ ప్రొఫైల్ అంటూ ఈ సోషల్ సైట్స్ సీరీస్ లో భాగముగా తెలియచేయ్యాలని - అనుకోకుండా అలా నాకు మెయిల్ వచ్చేసరికి, మీకు తెలియచేస్తున్నాను. దీనివలన మీరు నిజానిజాలేమిటో ఆ ఫోటో చూసి, కాస్త CID లెవల్లో కాకున్నా, చూస్తుంటేనే మీకు బోలెడన్ని విషయాలు అర్థం అవుతాయి. ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని, ఎలా అక్కౌంట్స్ ఉంటాయో చెప్పటానికి ఈ టపా మీకు అందిస్తున్నాను


అందుకే - ఈ సోషల్ సైట్లలో కాస్త తెలివిగా వ్యవహరించండి.. అనేది. అన్నీ వివరాలు తెలుసుకొని స్నేహం చేయ్యమనేది. డీపీ మార్చి ఇలా మాట్లాడారు అంటే - ఇక అమ్మాయిల ఫొటోస్, సినీ తారల ఫొటోస్ పెట్టి ఇంకెంతగా మాట్లాడవచ్చో ఆలోచించండి. మోసం చేసేవారు చేస్తూనే ఉంటారు. కాని మోసపోవటమే మీ ధ్యేయం కాదుగా. అందుకే కాస్త జాగ్రత్తగా ఉంటే  - కాస్త ప్రశాంతముగా ఉంటారు.

Saturday, May 28, 2011

Mr Perfect - Chali chaliga allindi


చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)
గానం : శ్రేయా ఘోషాల్
రచన : అనంత శ్రీరాం.
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
**************** 

పల్లవి :

ఓ చలి చలిగ అల్లింది - గిలి గిలిగ గిల్లింది
నీ వైపే మళ్ళింది - మనసు 
చిటపట చిందేస్తుంది - అటు ఇటు దూకేస్తుంది
సతమతమైపోతుంది - వయసు
చిన్ని చిన్ని చిన్ని చిన్ని - ఆశలు ఏవేవో
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి - పోతున్నాయీ
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు - ఇంకేవో
గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయీ
నువ్వు నాతోనే ఉన్నట్టు - నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు - నువ్వు నా ఊపిరైనట్టు
నా లోపలున్నట్టు - ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు // చలి చలిగా //

చరణం 1:

గొడవలతో మొదలై - తగువులతో బిగువై
పెరిగిన పరిచయమే - నీది నాది
తలపులు వేరైనా - కలవని తీరైనా
బలపడి పోతుందే - ఉండేకొద్దీ
లోయలోకి - పడిపోతున్నట్టు
ఆకాశం పైకీ - వెళుతున్నట్టు
తారలన్ని - తారసపడినట్టు
అనిపిస్తుందే నాకు - ఏమైనట్టు
నువ్వు నాతోనే ఉన్నట్టు - నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు - ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు - నా లోపలున్నట్టు
ఏదో చెబుతున్నట్టు - ఏవో కలలు

చరణం 2:

నీపై కోపాన్నీ అందరి ముందైనా
బెదురే లేకుండా - తెలిపే నేను
నీపై ఇష్టాన్నీ నేరుగ - నీకైనా
తెలపాలనుకుంటే - తడబడుతున్నాను
నాకు నేనే దూరం అవుతున్నా
నీ అల్లరులన్నీ - గుర్తొస్తుంటే
నన్ను నేనే - చేరాలనుకున్నా
నా చెంతకి నీ అడుగులు - పడుతూ ఉంటే
నువ్వు నాతోనే ఉన్నట్టు - నానీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు - నువ్వు నా ఊపిరైనట్టు
నా లోపలున్నట్టు - ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు .

Friday, May 27, 2011

Rangam - Enduko emo thulli


చిత్రం : రంగం (2011)
రచన : వనమాలి
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : ఆలాప్ రాజు 
అడిషనల్ వాయిస్ : ప్రశాంతిని, బృందం 
రాప్ - రచన : శ్రీ చరణ్, ఎంసీ జేస్జ్
****************

పల్లవి :

ఎందుకో ఏమో - తుళ్లి తిరిగెను మనసే 
పిచ్చి పరుగులు తీసే - వెల్లి విరిసెను వయసే
ఎందుకో ఏమో - గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే - పొంగి పొరలెను ఆశే
ఏదో గజిబిజిగా గజిబిజిగా - కనిపించే రూపం
రేపో దరి కనని దరి - కనని తీరం
ఏదో గజిబిజిగా గజిబిజిగా - కనిపించే రూపం
రోజూ తడబడుతూ వెలిగే - ఈ ఉదయం

ఎందుకో ఏమో కంట మెరుపులు - మెరిసే
చేరి దూరమయ్యే వరసే - రేయి కలలుగ విరిసే
ఎందుకో ఏమో - రెక్కలెదలకు మొలిచే
చిన్ని గుండెనేదో తొలిచే - ఒంటరిగా నను విడిచే
ఏదో గజిబిజిగా గజిబిజిగా - కనిపించే రూపం
రేపో దరి కానని తీరం - దరి కానని తీరం
ఏదో గజిబిజిగా గజిబిజిగా - కనిపించే రూపం
రోజూ తడబడుతూ వెలిగే - ఈ ఉదయం
నువ్వునేను ఒక యంత్రమా - కాలం నడిపే ఓ మహిమ ప్రేమ
ఊ హు ఊహు..

చరణం 1: 

ముద్దులిడిన ఊపిరి సెగలు
తగిలి రగిలి చెడిపోతున్నా
చెంత నువ్వు నిలబడగానే
నిన్ను విడిచి పరుగెడుతున్నా
సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే
అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే
నవ్వుల్తో చంపే మాయే చాల్లే

ఏమో తుళ్ళి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే వెళ్లి విరిసేను వయసే..
ఎందుకో ఏమో గుండె దరువులు వేసే
కొంటె తలపులు కోర్చే పొంగి పొరలేను ఆశే..
నువ్వు నేను ఒక యంత్రమా
కాలం నడిపే ఓ మహిమ ప్రేమా
లెట్స్ గో.. వావ్ వావ్
నీ గల్లె తెలుగమ్మాయి ఎందుకో ఏమో
దే లుక్ సో ఫ్లై
మరువనన్నది నా మది మరి మరి
నీ మనసే లవ్లీ చెప్పకనే చెప్పా
ప్రేమకు ఇద్దరి చూపులే వంతెన

ప్లేయ్డ్ లుక్ లైక్ ఎ సింగలా సింగలా
నాటీ లుక్కులిచ్చే ఈవేళ
లేడీ లుక్ లైక్ ఎ సింగలా సింగలా
నన్ను చుట్టుముట్టే వెన్నెల 
 
ప్లేయ్డ్ లుక్ లైక్ ఎ సింగలా సింగలా
నాటీ లుక్కులిచ్చే ఈవేళ
లేడీ లుక్ లైక్ ఎ సింగలా సింగలా
నన్ను చుట్టుముట్టే వెన్నెల

చరణం 2:

నిలవనీక నిను తెగ వెతికే
కనులకిన్ని తపనలు ఏంటో
ఎన్ని సడులు వినబడుతున్నా
వీడిపోదు నీ పలుకేంటో
కలల్లోన నిన్నే కనగా
కన్నులనే పొందానో
కలే కల్లలయ్యే వేళ కన్నీరైపోతానో
నీడనే దోచే పాపే నేనో

ఏమో (ఆల్‌రైట్) తుళ్లి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే వెళ్లి విరిసెను వయసే
ఓహో ఏమో గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే పొంగి పొరలెను ఆశే
ఏదో గజిబిజిగా గజిబిజిగా - కనిపించే రూపం

రోజూ తడబడుతూ వెలిగే - ఈ ఉదయం
రేపో దరి కానని తీరం - దరి కానని తీరం
రోజూ తడబడుతూ వెలిగే - ఈ ఉదయం
ఏదో గజిబిజిగా గజిబిజిగా - కనిపించే రూపం
 
రోజూ తడబడుతూ వెలిగే - ఈ ఉదయం
రేపో దరి కానని తీరం - దరి కానని తీరం
రోజూ తడబడుతూ వెలిగే - ఈ ఉదయం
ఏదో గజిబిజిగా గజిబిజిగా - కనిపించే రూపం
 
రోజూ తడబడుతూ వెలిగే - ఈ ఉదయం
రేపో దరి కానని తీరం - దరి కానని తీరం
రోజూ తడబడుతూ వెలిగే - ఈ ఉదయం
ఏమో.. ఏమో.. ఏమో..

Tuesday, May 24, 2011

Rajanikanth is Safe.

Rajani with his daughter Ishwarya - Photo courtesy by : (son-in-law) Dhanush
రజనీకాంత్ అనారోగ్యం అనగానే - చిత్రపరిశ్రమ యావత్తూ ఆందోళనకి గురి అయ్యింది. హాస్పిటల్ లో జాయిన్ చేశారు - డిశ్చార్జ్ చేశారూ - ఆరోగ్యం నిలకడగా ఉంది - అమెరికా వెళ్ళారు - వచ్చారు - మళ్ళీ ICU లో జాయిన్ చేశారు - అంతా బాగానే ఉంది అని ప్రకటనలూ - అమెరికా నుండి డాక్టర్స్ వచ్చి పరిశీలించారు.. అనేక వార్తలు వినవచ్చాయి. అలా కాస్త ఆందోళన కి గురి అయిన వారిలో నేనూ ఉన్నాను. చివరికి ఆయన అల్లుడు, సినీ నటుడు ధనుష్ - రజనీకాంత్ గారు క్షేమమే అని ట్విట్టర్ లో ఉంచిన ఈ పై ఫోటో చూసి కాస్త ఊరట చెందాను.

Monday, May 23, 2011

Social NW Sites - 30 - వైరస్ లు ఎలా వస్తాయి?

ఈ సోషల్ సైట్లలో వైరస్ లు ఎలా వస్తాయీ - అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది వైరస్ అంటూ ఈజీగా గుర్తుపట్టేలా ఇక్కడ ఏమీ ప్రత్యేకముగా ఉండవు. వాటి విషయము మీద కాస్త అవగాహన కలిగి ఉన్నవారు కాస్త చూచాయగా చెప్పగలరేమో!. కాని వైరస్ బారిన పడ్డాకే - అది వైరస్ ఫైల్ అని అప్పటిదాకా ఏమీ తెలీక పోవచ్చును. కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండండి.

ఈ వైరస్ లు పెట్టడం కొన్ని పద్దతుల్లో చేస్తారు. వీటిని ఇలా పెట్టడములో ముఖ్యోద్దేశ్యం ఏమిటీ అంటే - వారి అకౌంట్ లో వైరస్ ని, మాల్వేర్ ని గానీ పెడితే వారి మెయిల్ ID, పాస్ వర్డ్ లని, తెలుసుకొని ఆయా సైట్లలోనికి వెళ్ళటానికి ఎలా తెలుసుకోవాలని. ఇవి మీరు వాటిని టైపు చేసినప్పుడు కీ లాగర్ లాగా పని చేసి ఎవరికీ అందించాలో వారికి నమ్మకముగా తెలియచేసే మాలిషియస్ కోడ్ గలవి. కీ లాగర్ అంటే - మీరు పాస్ వర్డ్ టైప్ చేస్తున్నప్పుడు, మీరు ఏ ఏ కీలని నొక్కారో అవతలివారికి తెలిపే ఒక ప్రోగ్రాం. అలా మీ పాస్ వర్డ్, మెయిల్ ID తెలుసుకొని, మీ ప్రొఫైల్ ని ఓపెన్ చేసి, మీ ప్రొఫైల్ లోని మీ సమాచారం, మీ ప్రొఫైల్ ద్వారా - మీ మిత్రుల ప్రొఫైల్ లోని సమాచారం, ఫొటోస్.. ఇవన్నీ దొంగిలిస్తారు. వామ్మో అని అనుకుంటున్నారా.. నిజం ఇది. వారేం చేసుకుంటారు వాటినీ అనుకుంటే - చేసుకోదగినట్లుగా ఏదైనా ఉంటే - బాగా ఉపయోగిస్తారు వాటిని..

ఈ మాలిషియస్ కోడ్ లని ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి అని ఏదైనా లింక్ ద్వారా కానీ, ఏదైనా ఫోటోలో గానీ, యానిమేటెడ్ GIF స్క్రాప్ లలో గానీ వీటిని పెట్టడం చాలా ఈజీ. ఎక్కువగా ఇలాగే వస్తుంటాయి. కొన్ని గ్రీటింగ్స్ సైట్లు కూడా ఇలాంటి పనులు చేస్తుంటాయి. ఇలాంటివి ఎక్కువగా బాగా పేరున్న, ఎక్కువమంది సభ్యత్వం గల సోషల్ సైట్లలో చాలా ఎక్కువ. పేరు తక్కువ ఉన్న సైట్లో తక్కువ అని కాదు. వాటిల్లో కూడా ఎక్కువే! వైరస్ కి గురి అయ్యామన్నది అప్పుడే తెలీదు. ఆ తరవాతనే తెలుస్తుంది.

ఇలాంటివాటి బారిన పడొద్దు అనుకుంటే - ముందుగా కాస్త జాగ్రత్తగా ఉండటం మీరు చెయ్యాల్సింది. మీ అక్కౌంట్లలో అనుమానిత లింక్స్ కానీ, అభినందన కార్డ్స్ కానీ ఎక్కువగా ఉంచుకోకండీ. ముఖ్యముగా పోర్నో కి సంబందించిన ఇమేజెస్ - వీటిల్లో చాలా వైరస్ ఎక్కువ. నేను అయితే ఎక్కువగా - ఫోటో గ్రీటింగ్ కార్డ్స్ అసలు ఉంచను.. అన్నీ తీసేస్తుంటాను.

ఇప్పుడు మీకు అలాంటి వైరస్ ప్రోగ్రాం స్క్రాప్ చూపిస్తాను. ఇది నిజమే కావచ్చును.. కాకపోవచ్చును. మీకు చూపించాలని సగం వరకూ వెళ్లాను. కాని ఎందుకో ముందుకు వెళ్లాలని అనిపించలేదు. ఒకవేళ వైరస్ వస్తే నేను ఎందుకు ఇబ్బంది పడాలీ అని - అక్కడితో ఆగిపోయాను.

ఒక పోర్నో స్క్రాప్ ఎన్నుకొని, దాన్ని ఓపెన్ చేశాను.. (ఆ స్క్రాప్ ని పూర్తిగా బ్లర్ గా చేశాను. కాని అర్థం అవుతుంది. అది వీడియో అన్నట్లుగా భ్రమ వచ్చేలా స్క్రీన్ షాట్ చేసి, JPEG ఫోటో పెట్టారు.)


దాని క్రిందుగా - నేను ఇందులో ఉన్నాను. నన్ను చూడాలీ అనుకుంటే అది ఓపెన్ చేసి చూడండి అని టెక్స్ట్ వ్రాస్తారు. అది నమ్మి ఓపెన్ చేస్తే -



ఇలా వస్తుంది. ఇందులో వచ్చిన ఆ నీలి రంగులో ఉన్న లింక్ ని ఓపెన్ చేస్తే, మిగతాది చూడొచ్చు, కాని అంతటితో ఆపేశాను. అలా చేస్తే వైరస్ ఆక్టివేట్ అయితే? ఒకవేళ వైరస్ వస్తే నా ప్రొఫైల్ దెబ్బతింటుంది. అందుకే అక్కడితో ఆపేశాను. అందులో వైరస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చునూ - కాని రిస్క్ తీసుకోదలచుకోలేదు. (అలా వైరస్ కావాలని ఆహ్వానించటం బాగోదుగా) ఒకసారి వైరస్ బారిన పడి చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు అంత సీన్ మళ్ళీ అవసరం లేదు. మీరూ ఇలాంటి వాటి బారిన పడి, ఇబ్బందులు తెచ్చుకోకండీ! ఇక్కడ మీకు కొన్ని టిప్స్ చెబుతాను.

1. పోర్నో సంబంధిత, అనుమానిత స్క్రాప్స్ మీ ప్రొఫైల్ లో ఉంచుకోకండి.

2. పోర్నో స్క్రాప్స్ ఎవరి స్క్రాప్ బుక్ లో ఉన్నా వాటిని క్లిక్ చేసి ఓపెన్ చెయ్యాలని చూడకండి.

3. మీ స్క్రాప్ బుక్ లో ఎక్కువగా JPEG ఫొటోస్, గ్రీటింగ్ కార్డులని పెట్టుకోకండీ.

4. ఎవరైనా ఏదైనా లింక్ పంపిస్తే, అక్కడే నొక్కి ఓపెన్ చెయ్యాలని చూడకండి. అంతగా చూడాలీ అని అనుకుంటే ఆ లింక్ ని కాపీ చేసి, ఇంకో టాబ్ లో పేస్ట్ చేసి, ఓపెన్ చెయ్యండి. కాస్త మాత్రమైనా సెక్యూర్ గా ఉంటారు. 

Saturday, May 21, 2011

Aakasham braddalina - Mr. Perfect.



చిత్రం : Mr. పర్ పెక్ట్ (2011) 
గాయకులు : సాగర్, మేఘ 
రచన : అనంత శ్రీరాం
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
******************
పల్లవి :

ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన - మోగుతోంది నిన్ను కలిసాక
మేఘాలే గుద్దుకున్న - లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక
రై రై రై రైడ్ చేసెయ్ - రాకెట్ లా మనసునీ
సై సై సై సైడ్ చేసెయ్ - సిగ్నల్స్ తో ఏం పని
ఇక హైవేలైన వన్‌వేలైనా - కదలదే బండి తేరేబినా - // ఆకాశం బద్దలైన //

చరణం 1:

పార్టీలా ఉంది నీతోటి ప్రతి క్షణం - ఎందుకంటే చెప్పలేను కారణం
టేస్టీగా ఉంది నువ్ చెప్పే ప్రతి పదం - బాగుందబ్బ మాటల్లోన ముంచడం
రోల్ ఎన్ కోస్టర్ ఎంతున్నా - ఈ థ్రిల్ ఇస్తుందా జానా,
నీతో పాటు తిరిగేస్తుంటే  - జోరే తగ్గేనా
కార్టూన్ ఛానెల్ లోనైనా - ఈ ఫన్ ఉందా బోలోనా
నీతోపాటూ గడిపేస్తుంటే టైమే - తెలిసేనా
ఇక సల్సాలైన సాంబాలైనా - కదలదే ఒళ్ళు తేరేబినా // ఆకాశం బద్దలైన // 

చరణం 2:

ఆన్‌లైన్‌లో నువ్ హై అంటే నా మది - క్లౌడ్ నైన్ లోకి నను తోస్తది
ఆఫ్‌లైన్‌లో నువ్వు ఉన్నావంటే మది - కోల్‌మైన్‌లోకి దూరేస్తది
ఏప్లేస్ఐనా గ్రీటింగ్‌కార్డ్‌లా కనిపిస్తుందే జానా - నాతో పాటు ఈ ఫీలింగు నీకూ కొత్తేనా
ఏరోజైనా వాలెంటైన్స్‌డే అనిపిస్తుందేమైనా - నాతో పాటూ అడుగేస్తుంటే నీకూ అంతేనా
ఇక డేటింగ్ అయిన ఫైటింగ్ అయినా - గడవదే రోజు తేరేబినా // ఆకాశం బద్దలైన // 

Aggipulla laanti - Mr. Perfect.


చిత్రం : Mr. పర్ఫెక్ట్. (2011)
గాయకులు : గోపికా పూర్ణిమ.
రచన : రామజోగయ్య శాస్త్రి
సంగీతం  : దేవిశ్రీ ప్రసాద్.
***************** 
అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల - నేను
నన్ను చిన్న చూపు చూస్తే - ఊరుకోనూ
ఎందులోనూ నీకు నేను - తీసిపోనూ
నా సంగతేంటో తెలుసుకోవా - పోను పోనూ
అచ్చమయిన పల్లె రాణిపిల్ల - నేనూ
పచ్చి పైర గాలి పీల్చి - పెరిగినానూ
ఏరికోరి గిల్లికజ్జా - పెట్టుకోనూ
నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేనూ.. హొయ్ హొయ్ హొయ్

హే సూటు బూటు స్టైలు - సుందరా
లేనిపోని డాబు - మానరా
ఈఊరిలో పైచేయి - నాదిరా
నా గొప్ప నువ్ ఒప్పుకో  - తప్పులేదురా
రేవులోని తాడిచెట్టులా నీ - ఎక్కువేమిటో
ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేలదించుకో.. ఓయ్..

Friday, May 20, 2011

Merise tharala - Sirivennela


చిత్రం : సిరివెన్నెల (1987)
రచన : చేంబోలు సీతారామశాస్త్రి (సిరివెన్నెల)
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
********************

పల్లవి :

మెరిసే తారలదేరూపం - విరిసే పూవులదేరూపం
అది నా కంటికి శూన్యం..
మనసున కొలువై మమతల నెలవై - వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం.. - గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం - అపురూపం // మనసున కొలువై //

చరణం 1 :

ఎవరి రాకతో గళమున పాటల - ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగోత్రాలను - ఎలకోయిల అడిగేనా
ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి - తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై - నెమలి వెదుకులాడేనా
నా కన్నులు చూడని రూపం - గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం - అపురూపం // మనసున కొలువై //

చరణం 2 :

ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా - గానం పుట్టుక గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచి - ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవననాదం పలికిన నీవే.. - నా ప్రాణ స్పందన
నీకే నా - హృదయ నివేదన // మనసున కొలువై // 

Wednesday, May 18, 2011

Social NW Sites - 29 - సోషల్ సైట్లలో నిజమైన మిత్రుడు ఎవరు అంటే!

సోషల్ సైట్లలో నిజమైన స్నేహితుడు కావాలీ అనుకుంటే దొరకడం కష్టమే!. చాలా తక్కువ రేషియో లో మీకు దొరకవచ్చును. పరిచయస్థులు మాత్రం మీకు బాగా ఉంటారు. కొద్దిగా ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ ఉంటుంటే - మీకు నిజమైన స్నేహితులు దొరుకుతారు. ఇలా విశ్లేషించుకోవటం కాస్త కష్టమైనా పనే!. కాస్త మనుష్యుల నైజాలు, ప్రవర్తనలూ, మూడ్స్, మాటల వెనుక ఉన్న అసలు విషయాలూ.. లాంటివి గమనించటం మీకు తెలిసి ఉంటే కాస్త ఈజీగా మీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకోవచ్చును. స్నేహానికి బాగా విలువ ఇచ్చేవారనీ కూడా తెలుసుకోవచ్చును. ఇక్కడ నేను చెప్పే విషయాలు అందరికీ వర్తించకున్నా, ఎవరి ఆలోచనా ధోరణికి అవతలివారు తగినవారా? కాదా? అని ఎవరికీ వారు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

ఎవరికీ ఈ క్రింద చెప్పిన పాయింట్స్ అన్నీ ఉండకపోవచ్చును. కాని ఎక్కువలో ఎక్కువగా వచ్చినవారు / కనీసం సగమైనా వచ్చినవారు మీ నిజమైన స్నేహితులు అని అనుకోవచ్చును. అలా లేనప్పుడు వారు మీకు పరిచయస్థులే కాని స్నేహితులు కాలేరు - అని నా అభిప్రాయం. ఇందులో చెప్పే విషయాలు ఈ సీరీస్ లో అక్కడక్కడా చెప్పిన విషయాలు పునరుశ్చరణ చేయబడినవి. నిజానికి ఈ పోస్ట్ వ్రాయటం అన్నింటికన్నా కష్టమైనది. అయినా వ్రాస్తున్నాను మీకోసం.


1. కొందరి ప్రోఫైల్స్ చూడగానే వెంటనే ఆడ్ చేసుకోవాలీ అనిపిస్తుంది. అలా ఎందుకో బాగా గమనించండి. విశ్లేషించండి. అది ఆ ప్రొఫైల్ లో ఆర్భాటమా? అందమైన గ్రాఫిక్ డిజైనులా? అందమైన రూపమా?.. నిజానికి ఇవేవీ స్నేహానికి పరిచయం కోసమే - ఆ తరవాత స్నేహం నిలపటానికి పనికిరావు. ఈ ఆకర్షణలు తట్టుకొని మీ నూతన స్నేహితుడిని అంచనా వెయ్యటం నేర్చుకోండి. తమ అబౌట్ మీ లో తమ గురించి చెప్పేవారు మీ నిజమైన మిత్రులకుండే లక్షణాలలో ఒకటి.

2. మీ అబౌట్ మీ, మీ ప్రొఫైల్ అంతా చదివాక - అక్కడ మిమ్మల్ని అర్థం చేసుకొని, మీకు ఆడ్ రిక్వెస్ట్ పెట్టేవారు. అంతేకాని అక్కడ ఏదీ చదవకుండా, గుడ్డిగా ఆడ్ రిక్వెస్ట్ పెట్టేవారు కాదు.

3. మీ అభిప్రాయాలనీ, పద్ధతులనీ గౌరవించేవారు.

4. మిమ్మల్ని రోజూ కాకున్నా, నెలకి ఒకసారి అయినా పలకరించేవారు. అప్పటికీ మిమ్మల్ని పలకరించకుంటే మీకోసం కాసింత సమయం కేటాయించని వారై ఉంటారు. ఇలాంటివారిని వదులుకోవటం మంచిది.

5. వారు అసలుకే ఆన్ లైన్ లోకి రాకున్నంతగా బీజీ గా ఉంటే ఆ విషయం స్టేటస్ మెస్సేజ్ లో పెట్టేవారు.

6. మీ పుట్టినరోజులు మరచిపోకుండా, ఆరోజున మిమ్మల్ని తప్పకుండా పలకరించేవారు. ఆరోజు మీ స్క్రాప్ బుక్ లో ఏదో చిన్నగా కాకుండా పెద్దగా అభినందనలు చేసేవారు. ఉదాహరణకి : Hpy B'day అని కాకుండా Wish you MANY MANY HAPPY RETURNS of the DAY అని చెప్పేవారు.

7. మీ పుట్టినరోజున మిమ్మల్ని సంతోషపెట్టేవారు. అంటే ఆరోజు మిమ్మల్ని పనికిరాని స్క్రాపులతో చీకాకు పరచని వారు.

8. మీరు చెప్పిన పుట్టినరోజు అభినందనలకి - బదులుగా ధన్యవాదములు చెప్పేవారు.

9. ఒక్క పుట్టినరోజే అని కాకుండా మీరు ఏదైనా సాధించారని - మీ ప్రొఫైల్ లో చెబితే - మనసారా అభినందనలు చెప్పేవారు.

10. మీకు ఏదైనా బాధ / ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది తొలగించే ప్రయత్నం చేసేవారు.

11. మీకు ఏది ఇష్టమో తెలుసుకొని, అది మీకు ఎప్పుడు అది అవసరమో తెలుసుకొని, అప్పుడు మీకు సమయానుసారముగా అందించేవారు.

12. మీలోని లోపాలని ఎక్కడా ఓపెన్ గా చెప్పనివారు. ఇతరులతో వాటిని అస్సలు పంచుకొననివారు.

13. మీ గురించి / మీ లోపాలని ఎవరితో చెప్పక, మీతో మాత్రమే చెప్పటానికి ఆసక్తి చూపేవారు.

14. మీమీద ఎవరైనా చెడుగా వారి స్క్రాప్ బుక్ లో వ్రాస్తే - అందరికీ పబ్లిసిటీ చెయ్యటానికి అన్నట్లు - అలాగే ఉంచక, వెంటనే వాటిని తీసేసేవారు.

15. తగిన ఆధారాలు వారి వద్దలేకున్నా, ఉన్నా ఇతరుల మీద మాట్లాడటానికి అంతగా ఇష్టపడనివారు.

16. మీకూ, మీ స్నేహితునికి గొడవ జరిగితే - మధ్యవర్తిత్వం చేసి - సమస్య తొలగించి, మళ్ళీ ఒక్కటిగా కలిపేవారు.

17. మీరు చేసే / మీలో ఉన్న గొప్ప టాలెంట్ ని నలుగురి ముందూ ప్రశంసగా చెప్పేవారు.

18. తాను ఎంత బీజీగా ఉన్ననూ, మీరు మధ్యలో చాట్ కి పోయినా, ఏదైనా డౌట్ గురించి స్క్రాప్ పెట్టినా - ఆవెంటనే - స్క్రాప్ గానీ, చాట్ గానీ చేసి మీ డౌట్ తీర్చేసేవారు. (వైజాగ్ లో ఉండే నా మిత్రుడు ముగ్గురు అమ్మాయిలతో, చాటింగ్ లో బీజీగా ఉన్నా, తన పాస్ వర్డ్ ఇచ్చి మరీ తన అక్కౌంట్ చూపించి నా చిన్ని సందేహం తీర్చాడు. అతనికి కృతజ్ఞతలు)

19. తన ఫోన్ నెంబర్ అడిగితే వెంటనే ఇచ్చేవారు. (మీరు బాగా పరిచయం అయ్యాకనే!)

20. తన డిటైల్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేవారు. తన గురించి తన ప్రొఫైల్ లో దాపరికం లేకుండా చెప్పేవారు.

21. బాగా పరిచయం అయ్యాక ఏదైనా వారి గురించి అడిగితే - తడుముకోకుండా సమాధానం ఇచ్చేవారు. (ఒక మిత్రుడు నాకు బాగా పరిచయం. రెండుసార్లు మా దగ్గరికి వచ్చి కలిశాడు కూడా. తనకి పాటల సీడీ కావాలంటే - కొరియర్ చెయ్యటానికి అడ్రెస్ అడిగితే - రెండు రోజుల సమయం తీసుకొని చెప్పాడు. తను ఉంటున్న అడ్రెస్ ఆ ఇంటి ఓనర్ ని అడిగి చెబుతాను అన్నాడు. తన అడ్రెస్ అంతగా తెలీకుండా ఉంటున్నాడా?)

22. "తన వివరాలు తన ప్రొఫైల్ లో పెట్టేవారు." ఉండేది ఒకదగ్గర, ఊరిపేరు మరో ఊరు పెట్టుకోకుండా ఉండేవారు.

23. తమ మారీడ్ / వైవాహిక స్థితిని ఏమీ దాచుకోనివారు.

24. ప్రొఫైల్ డీపీ గా వారి ఫోటో ఉండి, వారి ఆల్బం లోన వారి ఫొటోస్ ఉంచేవారు.

25. వారి పేరు మీదే ఈమెయిల్ ID ఉన్నవారు.

26. మీరు ఏదైనా అనారోగ్యకారణాల వల్ల హాస్పిటల్ లో ఉంటే, ఆ విషయాన్ని ఎవరికీ షేర్ చెయ్యక తమలోనే దాచుకొని, ప్రైవేట్ గా మిమ్మల్ని మాత్రమే అడిగి, యోగక్షేమాలు తెలుసుకునేవారు.

27. మీరేదైనా మీ పర్సనల్స్ చెప్పుకుంటే, అది ఎక్కడా, ఎవ్వరితో షేర్ చెయ్యకుండా, వారిలోనే ఇంకిపోయేలా చేసుకునేవారు.

28. మీ బలహీనతల మీద ఏనాడూ అవకాశం తీసుకోకుండా ఉండేవారు.

29. మీలోని లోపాలని - అందరికీ తెలియచేయక, మీకు మాత్రమే చెప్పెడివారు.

30. మీలోని లోపాలని ప్రవైట్ గా మీకు తెలియచేసి, వాటిని ఎలా అధిగమించాలో, ఆ పద్ధతిని మీకు తెలియచేసేవారు.

31. మీరు మీ సైట్లో అందరి ముందూ చులకన అవుతున్నప్పుడు - ఎందుకు అలా అవుతున్నారో, ఎవరివల్ల అవుతున్నారో, ఎవరు ఎలా అనుకుంటున్నారో, అలా అవకుండా ఎలా ఉండాలో మీకు పర్సనల్ గా తెలియచేసేవారు.

32. మీరిద్దరి మ్యూచువల్ మీకు ఆడ్ రిక్వెస్ట్ పెడితే - వారి గురించి ఒపినీయన్ వారిని అడిగితే - క్లుప్తముగా వారి గురించి ఇంట్రో చెప్పేవారు.

33. ఎవరైనా మీమీద ఇమేజ్ డామేజి చేస్తుంటే, ముందే హెచ్చరించేవారు.

34. మీరు మీరుగా ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నారో - మీరు అడిగినప్పుడు మీ మీద సద్విమర్శలు, సూచనలూ చేసేవారు.

35. ఎవరో మీమీద కనీస ఆధారాలు లేకుండా ఏదో చెప్పారని నమ్మక, మీ పట్ల విశ్వాసం చూపి మీ నుండి దూరం కాకుండా ఉండేవారు.

36. మీ మిత్రుల - మీ మీద చాటుగా చేసే చర్యలు గమనించి, ముందుగా హెచ్చరించేవారు.

37. మీరేదైనా నలుగురి ముందూ, తప్పు చేస్తే - నలుగురిలో మాట్లాడక మీరోక్కరితో పర్సనల్ గా మాత్రమే మాట్లాడేవారు.

38. మీరు ఫొటోస్ పెడితే వాటికి బాగుంటే - ప్రోత్సాహకర కామెంట్స్ పెట్టేవారు.

39. మీరు వ్రాసే స్క్రాప్స్ కి - తాను ఆన్లైన్ కి వచ్చినప్పుడు - మరచిపోకుండా వాటన్నింటికీ రిప్లై ఇచ్చేవారు.

40. తమ స్క్రాపుల్లో, ప్రొఫైల్ లో, చేతల్లో నిజమైన స్నేహాన్ని చూపించే మిత్రులు.

41. ఉద్యోగం చేస్తూ, చేబదులు కోసం మిమ్మల్ని డబ్బులు అడిగేవారు కాకుండా ఉండేవారు. (ఒకరు ప్రభుత్యోగం చేస్తూ, ఒక మిత్రుని వద్ద తీసుకున్న నాలుగువేల రూపాయలని తీర్చటానికి, ఆన్ లైన్ లో - నన్ను చేబదులు అడిగారు. వారినే బాకీ తీర్చటానికి, బాగా తిప్పిన వారు - ఇక నాకు సరిగ్గా తిరిగి ఇస్తారని గ్యారంటీ ఏమిటీ?)

42. మీతో మాట్లాడినప్పుడు మీకు మర్యాద ఇస్తూ, మీతో సంభాషించేవారు. ఆఖరికి ఫోన్లో, ఎదురుగానో - మీతో వారు మాట్లాడుతున్నప్పుడు, అంతగా ఆందోళనగా కాకుండా, కూల్ గా, మృదు మధురముగా మీతో సంభాషించేవారు.

43. మీ వివరాలు ఎంతగా వారు మిమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నప్పుడు, వారూ వారి వివరాలు వెంటనే చెప్పేవారు. (ఇలా కాకుండా మీవి మాత్రమే తెలుసుకొని, వారివి ఏమీ చెప్పనివారితో కాస్త దూరం మైంటైన్ చెయ్యటం అన్నివిధాలా శ్రేయస్కరం.)

44. ప్రశంసాపూర్వక విషయాలని వారి పేర్లు చెబుతూ, విమర్షల విషయములో - ఎంత అవతలివారి పేర్లు ఏమాత్రమూ చెప్పకుండా విషయం పైపైన చెప్పేవారు. ఇలాంటివారు రేపు మీమీద ఏదైనా చెప్పాలీ అనుకుంటే, మీ పేరు చెప్పకుండా విషయం చెబుతారు.

45. మీ పుట్టినరోజు ని మరిచినా, ఆతర్వాత నిజాయితీగా అలా ఎందుకు మరిచానూ అని కారణం చెప్పి, మీకు అభినందనలు తెలియచేసేవారు.

46. చిన్ని చిన్ని బహుమతులుగా - మీకు అంతులేని ఆనందం ఇచ్చేవారు. (నా మిత్రురాలికి ఫోటో కామెంట్స్ అంటే బాగా ఇష్టం. తన ఆనందం కోసం ఆమెకి ఫోటో కామెంట్స్ పెడుతాను. అవి ఎదుటివారికి అదోలా అనిపిస్తాయి. కాని మా ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. కాబట్టి ఏమీ ఫీల్ అవము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము.)

నిజానికి ఈ సైట్లలో మన వేవ్ లెంత్ కి తగినట్లుగా, మన అభిరుచులకి తగినట్లుగా, మనకి నచ్చేవారు దొరకడం చాలా చాలా కష్టం. అలా దొరకడం కూడా అదృష్టం ఉండాలి. నిజానికి చాలా స్నేహాలు టైం పాస్ అన్నట్లు ఉంటాయి. ప్రేమలో, పెళ్లిల్లో మాత్రమే మంచీచెడూ చూడాలి గాని, స్నేహాల్లో మంచీ, చెడు చూడాలా అని కొందరు అనుకుంటారు. కాని మంచి స్నేహం దొరికితే - జీవితం చాలా అందముగా కనిపిస్తుంది. అది నిజం. ఎవరి అభిప్రాయం వారిది. నేనైతే అలా ఆనందంగా, ఆహ్లాదముగా, ఉల్లాసముగా ఉంటున్నాను. అలా నేను ఈ మధ్య బాగా చవి చూస్తున్నాను.

అందరూ మంచివారే కావాలీ అనుకోని ఉంటూ ఉంటే, మనకి ఇక మిత్రులు దొరకకపోవచ్చునేమో!. అసలు మనమే అవతలివారికి మంచి మిత్రులం అని అనుకోవటం లేదేమో!.. మనకి పరిచయం అయిన మిత్రులందరూ మనకి దగ్గరి మిత్రులు అవకపోవచ్చును. కొద్దిమంది మాత్రమే మీ గుండె గది దాకా రావచ్చును. అందులో బహు కొద్దిమంది మాత్రం మీ హృదయం లో స్థానాన్ని పొంది ఉంటారు. అలాంటివారిని ఎన్నడూ వదులుకోకండి. అలాంటివారు మీకు మళ్ళీ దొరకడం చాలా కష్టం. అలా వదులుకున్నప్పుడు మీ ప్రొఫైల్ మీద ఇగ్నోర్ పెట్టారంటే - ఇక వారు ఇక జన్మలో కలవకపోవచ్చును.

నేటి సమాజం లో కాస్త ఎదగాలీ అంటే - పరిచయాలు చాలా అవసరం. కాని అవి స్వలాభం కోసం అని ఉండటం మంచిది కాదు. అలాంటి  స్నేహాలు మీకు అనవసరం. అలాని వారితో శత్రుత్వం పెంచుకోవటమూ సరికాదు.

Tuesday, May 17, 2011

Pavana guna rama hare - Bhaktha pothana


చిత్రం : భక్త పోతన (1942)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం, గానం : నాగయ్య.
*****************

పల్లవి :

పావన గుణ రామా హరే - పావన గుణ రామా హరే
రామా హరే // పావన గుణ //
పరమ దయా నిలయా హరే - పరమ దయా నిలయా హరే // పావన గుణ //

చరణం 1:

మాయా మానుష రూపా - మాయాతీతా మంగళ దాతా
మాయా మానుష రూపా - మాయాతీతా మంగళ దాతా
వేదాంత వధూ హృదయ విహారా - వేదాంత వధూ హృదయ విహారా
వేదమయా పరమానంద రూపా - వేదమయా పరమానంద రూపా // పావన గుణ //

చరణం 2:

కరుణారసభర నయనా - దరహాస మనోహర వదనా
కరుణారసభర నయనా - దరహాస మనోహర వదనా
నవతులసీదళ మాలాభరణా - నవతులసీదళ మాలాభరణా
నానా జీవన నాటక కారణ - నానా జీవన నాటక కారణ // పావన గుణ // 







Sunday, May 15, 2011

Yaathamesi thodinaa - Pranam Khareedu

చిత్రం : ప్రాణం ఖరీదు (చిరంజీవి మొదటి చిత్రం)
సంవత్సరం : 1978
సంగీతం : చక్రవర్తి 
గాయకుడు : S. P బాలసుబ్రమణ్యం.
రచన  : జాలాది.
********************
పల్లవి :

యాతమేసి తోడినా ఏరు ఎండదు - పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు - పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా - పూరి గుడిసెలోనైనా
గాలి ఇసిరి కొడితే… దీపముండదు
ఆ దీపముండదు  // యాతమేసి తోడినా ఏరు ఎండదు //

చరణం 1: 

పలుపుతాడు మెడకేత్తే పాడి ఆవురా - పసుపుతాడు ముడులేత్తే ఆడదాయిరా
కుడితి నీళ్ళు పోసినా - అది పాలు కుడుపుతాది
కడుపు కోత కోసినా - అది మడిసికే జన్మఇత్తాది
బొడ్డు పేగు తెగిపడ్డ రోజు - తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం - తెలుసుకో // యాతమేసి తోడినా ఏరు ఎండదు //

చరణం 2: 

అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే - సీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడమిద్దెలో ఉన్నా - సెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాకా - పాడె ఒక్కటే, వల్లకాడు ఒక్కటే
కూత నేర్సినోల్ల కులం కోకిలంటరా - ఆకలేసి అరిసినోల్లు కాకులంటరా

// యాతమేసి తోడినా ఏరు ఎండదు - పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు //

Thursday, May 12, 2011

Premadesham Yuvaranee - Shakthi

చిత్రం : శక్తి (2011) 
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : మణిశర్మ
గానం : హేమచంద్ర, సైంధవి
********************
పల్లవి :
 
ప్రేమదేశం యువరాణి - పూతప్రాయం విరిబోణి
ఏరికోరి మెచ్చావే - ఈ తోట రాముణ్ణి
ఆకతాయి అబ్బాయి - హాయి పిలుపుల సన్నాయి
మనసు పైనే చల్లావే మంత్రాల సాంబ్రాణి
నా కనులు నా కలలు నిన్నే చూస్తున్నాయి
రావోయి రావోయి - సిరి సిరి లేత సొగసుల మధుపాయి

చరణం 1:

దాయి దాయి దావోయి - తీగ నడుమిటు తేవోయి
లాయి లాయి లల్లాయి - తీపి తికమక రాజేయి
బాపురే మెరుపులు వేయి - తలపులో సుడి తిరిగాయి
చందన చర్చల - తొందర మొదలయ్యీ
ఛాంగురే వలపు సిపాయి - గెలుచుకో కలికి తురాయి
రావోయి రావోయి - సిరి సిరి లేత సొగసుల మధుపాయి

చరణం 2:

అందనంటూ నీ పరువం - ఎన్ని పరుగులు తీసిందో
ఆగనంటూ నీ విరహం - ఎంతగా వల విసిరిందో
నిన్నటికి మొన్నటి మొన్న - జన్మ నీ వశమనుకున్నా
నువ్వే నేనోయ్ నేనే నువ్వోయీ 
ఈ ఋణం ఎన్నటిదైనా - యవ్వనం నీదనుకోనా
రావోయి రావోయి - సిరి సిరి లేత సొగసుల మధుపాయి // ప్రేమ దేశం యువరాణీ //

Wednesday, May 11, 2011

Kallu kalloo plassu - 100% love

చిత్రం : 100% లవ్ (2011)
రచన : చంద్రబోస్ 
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : అద్నాన్ సమీ, బృందం.

*********************

పల్లవి :

కళ్ళు కళ్ళూ ప్లస్సూ.. వాళ్ళూ వీళ్ళూ మైనస్
ఒళ్ళు ఒళ్ళు ఇంటు చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటె ఈక్వల్టూ - ఇంఫ్యాచుయేషన్ // కళ్ళు కళ్ళూ //

అనుపల్లవి :
ఎడమ భుజము కుడి భుజము కలిసి - ఇక కుదిరే క్రొత్త త్రిభుజం
పడుచు చదువులకు గణిత సూత్రమిది - ఎంతో సహజం.
సరలరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పుడుతుందో ఉష్ణం // కళ్ళు కళ్ళూ //
ఇంఫ్యాచుయేషన్.. ఇంఫ్యాచుయేషన్..

చరణం 1:

దూరాలకీ మీటర్లంట - భారాలకీ కేజీలంటా
కోరికలకి కొలమానం ఈ జంట
సెంటి గ్రేడ్ సరిపోదంట - ఫారెన్ హీట్ పనిచేయదంట
వయసు వేడి కొలవాలంటే - తంటా
లేత లేత ప్రాయాలలోన - అంతేలేని ఆకర్షణ
అర్థం కాదు యే సైన్స్ కైనా.. ఓ
పైకి విసిరినది క్రింద పడును - అని తెలిపే గ్రావిటేషన్
పైన క్రింద తలక్రిందులవుతాది - ఇంఫ్యాచుయేషన్  // కళ్ళు కళ్ళూ //

చరణం 2:

సౌత్ పోల్ అబ్బాయంటా - నార్త్ పోల్ అమ్మాయంటా
రెండు జంట కట్టే తీరాలంట
ధనావేశం అబ్బాయంట - ఋణావేశం అమ్మాయంటా
కలిస్తే కరెంటే పుట్టేనంటా
ప్రతి స్పర్శ ప్రశ్నేనంటా - మరో ప్రశ్న జవాబట
ప్రాయానికే పరీక్షలంటా.. ఓ
పుస్తకాల పురుగులు రెండంట - ఈడుకోచ్చేనంట
అవి అక్షరాల చక్కెర తింటూ మైమరచేనంటా.. // కళ్ళు కళ్ళూ //

Tuesday, May 3, 2011

Bonthapally - Sri Veera Bhadra Swamy Temple.

ఆ మధ్య ఎందుకో వీరభద్ర స్వామి ఆలయం గురించి విన్నాను. బాగుంది అంటేనూ వెళ్లాలని అనిపించింది. ఒకసారి మధ్యలో వెళ్లాలని ప్రయత్నించాను. కాని బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.. ఆ సమయంలో - ఆ రద్దీ లో ఏమి దర్శనం చేసుకుంటామని అనుకొని, ఆ రద్దీ అంతా అయిపోయాక ఒక రోజు వీలుచూసుకొని వెళ్ళాము. రద్దీ లో వెళ్ళే దానికన్నా, ఎక్కువగా రష్ లేని సమయాల్లో వెళితేనే చాలా బాగుంటుంది - అని పర్యటనల అనుభవం. అందుకే ఈ నెలలో వెళ్లాను.

కాస్త గుడి గురించి తెలుసుకున్నాను.. ఇంటర్నెట్ లో వెదికాను. ఎక్కువగా సమాచారం లేదు.. పరవాలేదు అనుకోని బయలుదేరాను. వీర భద్రుడు అంటే - శివుని ప్రమథ గణాలకి అధిపతి. అంటే శివుని యొక్క సైన్యానికి సేనాధిపతి అన్న మాట. ఈ వీరభద్రుల ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. భారతదేశములోని ఆంధ్రప్రదేశ్ రాజధానికి అతి చేరువగా ఉన్న ఒక వీరభద్ర స్వామీ గుడిని సందర్శనా నిమిత్తం ఎంచుకున్నాను. ఒక ఆదివారం వీలు చూసుకొని, ఉదయాన గుడికి బయలు దేరాను. గుడి యొక్క రహదారి మ్యాప్ ని గూగుల్ వాడి సహాయాన మీకు చూపిస్తున్నాను. ఈ ఫోటోలమీద రెండు సార్లు నొక్కితే ఫోటో పెద్దగా స్పష్టముగా కనిపిస్తుంది.

ఈ గుడి సికింద్రాబాద్ లోని బాలానగర్ నుండి, నర్సాపూర్, మెదక్ రహదారి మీద దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరములో ఉంది. చాలా తొందరగా చేరుకోవచ్చును. ఉదయం తొమ్మిదికి బయలుదేరాను. రద్దీ పెరగక ముందే వెళ్ళాలనుకొని వెళ్లాను. అలా అయితేనే దర్శనం ఏ తోపులాటలూ, క్యూ లేకుండా ఈజీగా దర్శనం చేసుకోవచ్చును అని నా ఆలోచన.


ఆ ఎర్రని రింగ్ వద్ద మీకు ఎడమ వైపున ఒక కమాన్ ఇలా మీకు కనిపిస్తుంది.


ఈ కమాన్ గుండా అక్కడక్కడా కాస్త దెబ్బ తిన్న రోడ్డు మీద మూడు కిలోమీటర్స్ లోపలి వెళ్ళితే అప్పుడు మీకు గుడి కనిపిస్తుంది. 


ఈ కమాన్ నుండి మీకు ఆటోలు చాలా దొరుకుతాయి ఆటో లో ప్రయాణానికి ఒక వ్యక్తికి ఐదు రూపాయలు తీసుకుంటారు. అలా తిన్నగా గుడి వద్దకి వచ్చేశామా!..


ఇక్కడ ఈ బసవ విగ్రహం వద్ద ఆపేస్తారు. ఇక్కడే వారివారి వాహనాలని పార్కింగ్ చేసుకోవాలి. 


ఇదే ఆ శ్రీ వీరభద్ర స్వామీ వారి గుడి. ముందూ, ప్రక్కన పసుపు రంగులో ఉన్నవి అతిథి గృహాలు. అంతగా శుభ్రముగా ఉండవు. అడ్జస్ట్ అవ్వాలి. గుడి లోపలా కొన్ని అతిధి గృహాలు ఉన్నాయి. కాని వాటి నిర్వహణ అంతంత మాత్రమే!. అలా కాస్త ముందుకి వెళితే -


భారీ సిమెంట్ నందీశ్వరుడు ముందు ఆలయం కనిపిస్తుంది.


ఇదే సిమెంట్ భారీ నందీశ్వరుడు.


ఆ నందీశ్వరుడి ప్రక్కగా, ఉత్సవాల్లో ఊరేగించే, స్వామి వారి రథం మీకు అనిపిస్తుంది.


ఇలా మీకు ఆలయ ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. మీ ఎడమవైపున పాదరక్షలని ఉంచే షెడ్ కనిపిస్తుంది.


ఆ పాదరక్షల షెడ్ వద్ద నుండి ఆలయ ప్రవేశ ద్వారం ఇలా కనిపిస్తుంది..


దాని ప్రక్కనే - అరవై గదులు కట్టేందుకై చందాల కోసం - ఫ్లెక్సి ప్రకటన.


ఇక గుడిలోకి వెళదాం. ఇదే గుడి లోపలి భాగం. గుడి రాజ గోపురం గుండా లోనకి వెళితే ఇలా మీకు కనిపిస్తుంది.

ఇక్కడ నుండి కొన్ని ఫోటోల మీద మూలాన గుడి మ్యాప్, ఫోటో యాంగిల్, మీకు ఎర్రని చుక్క ద్వారా తెలియచేస్తున్నాను. దాని వల్ల గుడి రూపాన్ని బాగా తెలుసుకుంటారని చూపిస్తున్నాను. ఇది ఇలా చూపిస్తే మీకు గుడిని కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తాను అని నా ఆలోచన. నచ్చినా, (ఎందుకు)నచ్చలేకున్నా ఈ విషయం మీద కామెంట్స్ పెట్టండి.




ఇది గుడి మంటపం ఎదురుగా ఉన్న షెడ్ లాంటిది. ఇక్కడ ద్వజ స్థంభం, రాతి నందీశ్వరుడు కనిపిస్తారు. ఈ ఎడమ ఉన్న గేటు గుండా స్వామివారి దర్శనానికి వేల్లోచ్చును.








ఇది దాటగానే కళ్యాణ మంటపం కనిపిస్తుంది. అందులో భక్తులు, పూజలూ, వ్రతాలూ, నోములూ చేసుకుంటారు. ఆలయ కమిటీ వారిని సంప్రదిస్తే, వారు వివరాలు తెలియచేస్తారు. నేను కేవలం దర్శనం కోసమే వెళ్లాను కాబట్టి, ఏమీ చెప్పలేకపోతున్నాను.




దీన్ని దాటుకొని ఎడమ ప్రక్కన ఉన్న ఇనుప రెయిలింగ్ క్యూ లో వెళ్ళితే శ్రీ వీరభద్ర స్వామీ వారి ఆలయం వస్తుంది. ఆ వీరభద్రుడి ప్రక్కన గణపతి గుడి కనిపిస్తుంది. 



ఇదే వీరభద్రుని ఆలయం. అన్ని ఆలయాల్లో ఎదురుగా ప్రవేశ ద్వారం ఉంటుంది. కాని ఇక్కడ మాత్రం ప్రక్క నుండి ప్రవేశం ఉంటుంది. ఇలా ఎందుకు అంటే - ఇక్కడ ఉన్న వీరభద్ర స్వామి వారు చాలా రౌద్ర రూపములో ఉంటాడు. మన పై ఆఫీసర్ బాగా కోపముగా ఉన్నప్పుడు ఎదురుగా వెళ్లలేముగా. అలా ఇదీ కూడా అంతే!. మనకు తెలీకుండా అగౌరవముగా ఆ స్వామి వారికి ఆగ్రహం తెప్పించి, వారి ఇబ్బందులకి గురికావద్దనేది. అందుకే ఇలా ఏర్పాటు చేశారు. ఇలా అన్ని గుళ్ళల్లో ఇలాగే చెయ్యాలి. ఆయా ఆలయాల్లో మూల విరాట్ కి ఎదురుగా నిలబడనీయరు. ఈ ఒక్క నియమం శని దేవుడి ఆలయాల్లో నిషేధం. ఎందుకూ అంటే శని దేవుడి వక్ర (వంకర) చూపు అంత మంచిది కాదు. అలా ఆయన వక్ర చూపుకి గురి అవుతే, వారు బాగా ఇబ్బందులకీ, కష్టాలకీ గురి అవుతారని ఒక విశ్వాసం. అందుకే శని దేవుడి ముందు ఎదురుగా ఉండి, పూజ చేసుకోండి.

ఇక లోపలి వెళ్లి మనసారా స్వామివారి దర్శనం చేసుకున్నాను. ఇవన్నీ తెలిసి స్వామి వారిని ఫోటో తీసే సాహాసం చెయ్యలేకపోయాను. చేసి ఆగ్రహం గురి కావద్దనుకొని ఆగిపోయాను. నాలుగు సార్లు అలా మదినిండా దర్శనం చేసుకొని ఆ స్వామి వారి సన్నిధి నుండి బయటకు వచ్చాను. అలా కుడి వైపుగా బయటకి వచ్చాక ఆ స్వామి వారి ఆలయం ఇలా కనిపిస్తుంది.







ఆ తరవాత ఆ స్వామి వారి ఆలయం వెనకాల, ఎత్తులో భద్రకాళి అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడికి వెళ్లాను.


ఈ మెట్లక్కి ఆ దేవీ గుడిలోకి వెళ్లాం.





ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని, కాసేపు అక్కడే విశ్రమించాం. ఈ దేవీ విగ్రహానికి ఎదురుగా ఎత్తు గద్దె మీద ఐదు శ్రీచక్ర గ్రానైట్ ఫలకాలు ఉంటాయి. దంపతులు ఇక్కడ అమ్మవారి సన్నిధిలో శ్రీ చక్ర కుంకుమార్చన పూజ చేయించుకోవచ్చును. అలా కాసేపు ఉన్నాక బయటకి వచ్చేశాం. బయట ఆలయం వారు అమ్మే లడ్డూలు, పులిహోర, మినప వడల ప్రసాదం కొనేసి, బయటకి వచ్చేశాం. ఆ ప్రక్కగా స్వామివార్ల అద్దాల మండపం ఉందీ అంటే అటుగా వెళ్లాను.



అలా స్వామి వారల వేవేల రూపాలని తన్మయముగా వీక్షించాను.


ఇక ఆ రాజగోపురం గుండా బయటకి వచ్చేశాం. పునర్దర్శన ప్రాప్తిరస్తు.
Related Posts with Thumbnails