గోధుమ పడి (ఉగాది సాంప్రదాయ స్వీట్) అనేది ఆంధ్రప్రదేశ్ లోని, ఒక తెలంగాణా ప్రాంతాలలో ఉగాది రోజులలో చేసే సాంప్రదాయకమైన స్వీట్ పదార్ధం. ఇది చాలా బాగుంటుంది. చల్లగా కన్నా, వేడిగా తింటే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఆ రిసీప్ ఎలా చెయ్యాలో మీకు చెబుతాను.
కావలసిన పదార్థములు ::
గోధుమలు - పావుకిలో
బియ్యం - ఒక కప్పెడు
పంచదార - పావు కిలో
శనిగె పప్పు - సగం కప్పు
ఖాజు - 20 గ్రాములు.
సారా పలుకులు - 20 గ్రాములు
కిస్మిస్ - 20 గ్రాములు
గసాలు - రెండు టేబుల్ స్పూన్స్
ఎండుకొబ్బరి కోరు - రెండు టేబుల్ స్పూన్స్
ఇలాచీ పొడి - కొద్దిగా.
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్
తయారుచేయు విధానం ::
1. గోధుమలను ముందుగా ఒక నీటి గిన్నెలో వేసుకొని, ఒక గంట సేపు నానపెట్టాలి.
2. ఆ గంట సేపు అయిన తరవాత ఆ నీటిని వంపేసుకోవాలి.
3. ఆ తరవాత ఆ గోధుమలని, రోట్లో వేసుకొని బాగా దంచవలెను.
4. ఆ తరవాత ఆ రోకట్లో ఉన్న గోధుమలని తీసి, చేటలో వేసుకొని పొట్టు చేరుగుకోవాలి. ఈ పొట్టు అసలే ఉండనంతగా దంచుకోవాలి.
5. ఆ తరవాత స్టవ్ మీద ఒక గిన్నెలో నీరు వేడి చేసి, అందులో ఈ గోధుమలని వేసి, బాగా ఉడికించాలి.
6. సగం ఉడికాక అందులో బియ్యం, శనిగె పప్పు వెయ్యాలి.
7. బాగా ఉడికాక, పంచదార వెయ్యాలి.
8. అందులోని నీరు ఆవిరి అయ్యి, ఆ పదార్ధం అంతా దగ్గరికి అయ్యాక నెయ్యిని అందులో పోసుకోవాలి.
9. ఇలాచీ పొడి, గసాలు, సారాపలుకులు, కిస్మిస్, ఎండుకొబ్బరి పొడి అందులో వేసి, బాగా కలియత్రిప్పి, దింపుకోవాలి.
10. అందమైన పాత్రలలో లోకి వంపేసి, ఖాజులతో గార్నిషింగ్ చేసుకోవాలి.
సూచనలు :
ఈ స్వీట్ రెండురోజుల వరకూ చాలా బాగుంటుంది. చల్లగా అనిపించినవారు కాస్త పాలని బాగా వేడి చేసి, ఇందులో కలుపుకుంటే చాలా బాగుంటుంది. మైక్రోవేవ్ ఉన్నవారు పాలు పోసుకొని, ముప్పై సెకనులు వేడి చేస్తే సరి. చాలా కమ్మని రుచిగా ఉంటుంది.
2 comments:
oh..sweet.. so..sweet.. nenu okasaari..naa seema snehithuraalu chesi vaddisthe.. lottalu vesukuntoo thinadam gurthuku vacchindhi..thankyou..Raj..groo.. nenu ippude try chesthanu. Thankyou so much.
ధన్యవాదములు..
Post a Comment