చాలా రోజుల తరవాత పోస్ట్ చేస్తున్నందులకు ఏమీ అనుకోకండి. కాస్త విశ్రాంతి తీసుకొన్నాను. అలాగే నా పనులు ముగించాను. ఎందుకో తరువాత టపాలో చెబుతాను.
ఒక్కోసారి ప్రోఫైల్స్ కి వైరస్ వస్తుంది. ఇది రావటం కూడా మనకి తెలీకుండా జరుగుతుంది. కాస్త జాగ్రత్తగా ఉంటే ఇలాంటివి రాకుండా చూసుకోవచ్చును. నా ప్రొఫైల్ కి ఒక BOM SABODO (ఈ పదానికి అర్థం - Good morning to saturday) అనే బ్రెజిల్ దేశం నుండి వచ్చిన వైరస్ పట్టేసింది. దానివలన కాసింత నా ప్రొఫైల్ హ్యాంగ్ అవటం అనే ఇబ్బంది. కొద్దిరోజుల తరవాత అది పోయింది. కాని అన్ని వైరస్ లూ అలాగే ఉండవు. ఈ క్రింది ఫోటో చూడండి. ఇది నిన్ననే వచ్చిన వైరస్. కాని ఇది పాత వైరస్.
ఆ ప్రొఫైల్ అతనికి తెలీదు. ఇలా రావటం మామూలే!. ఇదే విషయం ఇదే సోషల్ సైట్లలో - ఒకతని ఆడ్ రిక్వెస్ట్ వస్తే అతని ప్రొఫైల్ ఇలా కత్రినా కైఫ్ తో... అని ఉంది.. రిజెక్ట్ చేశాను అని చెప్పానుగా. అప్పుడే చెప్పాలని అనుకున్నాను కాని అది వేరే విషయం గురించి మాట్లాడుకుంటూన్నాముగా. అందులో చెప్పే బదులు వేరుగా చెబుదామని ఆగాను. అలాంటి విషయం గురించి ఇక్కడ కాస్త వివరముగా చెబుతాను. కొన్ని జాగ్రత్తలూ చెబుతాను.
ఇలా ప్రొఫైల్ కి వైరస్ రావటం చాలావరకు మనం చేసే పొరపాట్లు వలన ఎక్కువగా వస్తుంటాయి. అక్కడ జాగ్రత్తలు తీసుకుంటుంటే చాలా వరకూ వాటిని తప్పించుకోవచ్చును.
1. ఈ సోషల్ సైట్లలోకి లాగ్ అయినప్పుడు కొన్ని అనుమానిత సైట్లలోకి వెళ్ళకండి. అనుమానిత సైట్లు అంటూ ప్రత్యేకముగా ఉండవు. కాస్త అనుభవముతో అవి తెలుసుకుంటుంటాము.
2. మీ స్నేహితుల ప్రొఫైల్ లలోకి వెళ్ళే ముందు ఒకసారి మీ పేజీ లోని, అప్డేట్స్ లలోకి వెళ్ళండి.
అక్కడ మీకు మీ స్నేహితుల ప్రొఫైల్ కి వైరస్ వస్తే అప్పుడే అక్కడే కనిపిస్తుంది. అప్పుడే జాగ్రత్త పడి ఆ ప్రొఫైల్ కి వెళ్ళకుండా ఆగిపోవచ్చును. నేను ఇలా చూసి జాగ్రత్త పడతాను.
3. అలా వైరస్ వచ్చిన ప్రొఫైల్ విజిట్ చేసినా మీ ప్రొఫైల్ కీ వైరస్ రావచ్చును. చాలా వరకూ అలా రాదు. కాని ఆ ప్రొఫైల్ ఇలా వైరస్ కనిపించాక, ఆ డాటా మీద క్లిక్ చేస్తే, మీ ప్రొఫైల్ కి కూడా రావచ్చును. కనుక ఇక్కడే జాగ్రత్తగా ఉండండి.
4. అలా సెక్స్.. అంటూ వచ్చిన లింక్ ల మీద ఆసక్తిగా క్లిక్ చెయ్యకండి. అలా వచ్చినవన్నీ ఇలాంటివే! చేపని పట్టడానికి వాడే ఎర లాంటివి ఇవి. మీరు చేపగా మారోద్దని ఇవన్నీ జాగ్రత్తలు చెప్పటం. నేను చెప్పిన సూచనలన్నీ పాటించాక మీరు అలా చెయ్యరని నాకు తెలుసు.
5. ఈ వైరస్ లు అనేవి ఎక్కువగా లింక్స్ ద్వారా, లేదా GIF (యానిమేటెడ్ స్క్రాప్స్), గుడ్ మార్నింగ్ విషేష్ కార్డ్స్ ద్వారా వస్తుంటాయి. మనకి వచ్చే అన్నీ ఇలాంటివి కాకపోవచ్చును. వేల దాంట్లో ఒకటి ఉండొచ్చును. మన టైం బాగోలేక పోతే పొరబాటున క్లిక్ చేసేస్తాము.
6. బాగా తెలిసినవారు, నమ్మకస్థులు అన్న వారి వద్ద నుండి వచ్చిన లింక్స్ మాత్రమే ఓపెన్ చెయ్యండి. వేరేవారినుండి వచ్చిన లింక్స్ పొరబాటున కూడా వెంటనే ఓపెన్ చెయ్యకండి. కాసేపు మీ మిగతా పని చేసుకోండి. కనీసం ఒకరోజు గడువు ఇచ్చి ఓపెన్ చేసి చూడండి. అప్పటిలోగా ఆ వైరస్ కి ధీటుగా యాంటీ వైరస్ అందుబాటులోకి వస్తుంది.
5. ఈ వైరస్ లు అనేవి ఎక్కువగా లింక్స్ ద్వారా, లేదా GIF (యానిమేటెడ్ స్క్రాప్స్), గుడ్ మార్నింగ్ విషేష్ కార్డ్స్ ద్వారా వస్తుంటాయి. మనకి వచ్చే అన్నీ ఇలాంటివి కాకపోవచ్చును. వేల దాంట్లో ఒకటి ఉండొచ్చును. మన టైం బాగోలేక పోతే పొరబాటున క్లిక్ చేసేస్తాము.
6. బాగా తెలిసినవారు, నమ్మకస్థులు అన్న వారి వద్ద నుండి వచ్చిన లింక్స్ మాత్రమే ఓపెన్ చెయ్యండి. వేరేవారినుండి వచ్చిన లింక్స్ పొరబాటున కూడా వెంటనే ఓపెన్ చెయ్యకండి. కాసేపు మీ మిగతా పని చేసుకోండి. కనీసం ఒకరోజు గడువు ఇచ్చి ఓపెన్ చేసి చూడండి. అప్పటిలోగా ఆ వైరస్ కి ధీటుగా యాంటీ వైరస్ అందుబాటులోకి వస్తుంది.
7. ఒకవేళ మీకు అత్యవసర విషయం అని అనుకుందాం. ఆ లింక్ ని కాపీ చేసి, గూగుల్, ఫైర్ ఫాక్స్ అడ్రెస్ బార్ లోనో పేస్ట్ చేసి ఓపెన్ చెయ్యండి. ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ (IE) కూడా బాగానే ఉంటుంది కానీ, చాలా మంది దీనిలో డిఫాల్ట్ వర్షన్ అయిన IE 5, IE 6 నే ఇంకా వాడుతున్నారు. లేటెస్ట్ అయిన IE 8, IE 9 వాడేవారు చాలా తక్కువ. ఇలా అప్గ్రేడ్ వర్షన్ వాడేవారు ఇందులోనే ఓపెన్ చేసుకోవచ్చును. ఈ IE లో సెక్యూరిటీ సెట్టింగ్స్ మామూలుగా - డిఫాల్ట్ గా ఉంటాయి. వాటిని మనం మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. అందరికీ అవి ఎక్కడ ఉన్నాయో తెలీవుగా. అందుకే గూగుల్ క్రోం ని వాడమనేది. ఆ క్రోం లో వెంటనే ఆ సైట్ ఓపెన్ చెయ్యకుండా, మీకో హెచ్చరిక కనిపిస్తుంది. అప్పుడు మీరు జాగ్రత్త పడవచ్చును. అది ఎలా ఉంటుందో త్వరలో మీకు ఫోటోలో తెలియజేస్తాను. (ఇప్పుడు అలా వెదకాలి అంటే వెంటనే దొరకవుగా)
8. ఎక్కువగా పోర్న్ కి సంబంధించిన బొమ్మల వల్ల ఇలా సిస్టం లలోకి వస్తుంటాయి. ఫైర్ వాల్, యాంటీ వైరస్ అప్డేట్స్ బాగున్నవారు కి ప్రమాదం చాలా చాలా తక్కువ.
9. నిన్న రాత్రి నా మిత్రుని దాంట్లో స్క్రాప్ చేద్దామని వెళ్ళితే - అతని పేజీ ఓపెన్ కాలేదు. అతనికి ఒక మాట చెప్పాను - నీ స్క్రాప్స్ లలో వైరస్ ఉందని. అతను తీసేశాడు వాటిని. మరునాడు ఇలా ఈ విషయమై నేను టాపిక్ వ్రాస్తానని ఊహించలేదు గనుక, వాటి వివరాలు తీసుకోలేక పోయాను.
10. రెగ్యులర్ గా వచ్చే మిత్రులకి మీ ఫోన్ నంబర్ తెలియజేస్తే - వారు వెంటనే మీకు తెలియచేస్తారు. నా స్నేహితురాలు ఒకావిడ ఇలా రెండు సార్లు వైరస్ ల బారిన పడి, వారి అబౌట్ మీ మారిపోయింది. రెండు సార్లూ నేనే కాల్ చేసి చెప్పాను - ఇలా మీది మారిపోయిందనీ!. తను వెంటనే మార్చేశారు.
11. ఇలా వైరస్ వచ్చిన ప్రొఫైల్ ని సరిదిద్దేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోండి. ముందుగా లాగిన్ అవ్వండి. అనుమానిత స్క్రాప్స్ ఏమైనా ఉంటే వాటిని తీసెయ్యండి. ఆ తరవాత అబౌట్ మీ మార్చేయ్యండి. ఆ తరవాత సైన్ అవుట్ అయ్యి, మళ్ళీ లాగిన్ అయ్యి Can't access your account? వద్ద నొక్కి మీ పాస్ వర్డ్ మార్చేయ్యండి.
12. మీ స్వంత సిస్టం ఉంది మీరొక్కరే వాడుతారు, వేరేవారు వాడినా ఫరవాలేదు అన్నప్పుడు ఆటో ఫిల్ అనే ఆప్షన్ వాడుకోండి. దీనివలన మాటి మాటికీ మీ మెయిల్ ID నీ, పాస్ వర్డ్ నీ టైపు చెయ్యాల్సిన అవసరం ఉండదు. ఇలా చెయ్యటం వలన మీరు ఏదైనా వైరస్ అంటుకున్న సైట్లో ఉన్నప్పుడు, వేరే చోట మీరు లాగిన్ అవ్వాల్సి ఉన్నప్పుడు కీ లాగర్స్ వల్ల మీ పాస్ వర్డ్ అవతలి వారికి చేరే అవకాశాలు చాల తక్కువ.
13. వేరే సైట్ల లోకి లాగిన్ అవ్వాల్సి ఉన్నప్పుడు మీ మెయిల్ ID, పాస్ వర్డ్ అడుగుతారు. అక్కడ వేరే పాస్ వర్డ్ వాడండి. అలా చేస్తే మీ ప్రొఫైల్ భద్రముగా ఉంటుంది కూడా.
14. (కొన్ని) సైట్లు రెడీమేడ్ గా అందించే విషేష్ కార్డ్స్ వద్దకి మాటి మాటికీ వెళ్ళకండి. వాటిని మీ స్నేహితుల వాటిల్లో పోస్ట్ చెయ్యకండి. అలా కూడా వైరస్ లు రావచ్చును. వాటిని ఎక్కువగా మీ స్క్రాప్ బుక్ లో ఉంచకండీ!. బాగున్నవి ఉంచేసుకొని, మిగతావి తీసేయ్యండి.
15. వైరస్ లు వస్తే - ఈ సోషల్ సైట్లలో పోవడం కష్టం. ఎందుకు అంటే చాలా కారణాలు. వైరస్ అని తెలీక చాలా మంది ఓపెన్ చేస్తారు. వారికి అంటుకుంటుంది. వారూ తెలీక ఇతరులకి పంపిస్తారు. ఆ సైట్ వారు దీనికి రెమేడీ కనిపెట్టి అందరి ప్రోఫైల్స్ క్లీన్ చేసేసరికి కొంత సమయం పడుతుంది. అప్పటివరకూ దాని బారిన పడతాము.
16. ఈ వైరస్ ల వల్ల మన ఫొటోస్ గానీ, డాటా గానీ వేరేవారికి అంటే ఆ వైరస్ పెట్టినవారికి చేరుతుంటాయి.
17. వైరస్ ఉన్నప్పుడు సెక్యూరిటీ పాస్ వర్డ్ అసలు మార్చే ప్రయత్నం చెయ్యకండి. దానివలన మీ అక్కౌంట్ మీ చేతుల్లోంచి వేల్లిపోవచ్చును. తస్మాత్ జాగ్రత్త.
1 comment:
thank you.. andi
good baga rasaru..
Post a Comment