Thursday, January 13, 2011

Social NW Sites - 2 - ముందుమాట.

మనం చదువుకున్నప్పుడో, వృత్తిపరముగా  ఏర్పడే స్నేహాలు ఎలాగో ఇవీ అంతే! కూడా. కాకపోతే అవి ఒక ప్రదేశములో, ప్రత్యక్షముగా తాకి, అనుభవిస్తాము. కానీ ఈ ఆన్లైన్ సోషల్ సైట్లలో ఆ టచ్ మాత్రం ఉండదు. ఇక్కడ అంతా ఒక మాయ / ఊహాలోకములో స్నేహం అనుభవిస్తాం. ఇదొక్కటే ఇందులో ఉండదు. మిగతా అన్నీ ఒక్కటే. నిజమైన స్నేహాల్లోని ప్రేమ, వాత్సల్యం, దయ, జాలి, కారుణ్యం, ఆత్మీయత, ఆరాధన, అమాయకత్వం, తాము సాధించినవీ, విన్నవీ, కన్నవీ.. అలాగే మోసం, చాడీలూ, దగా, చాటుగా ఒకరిమీద మాట్లాడుకోవటం, ఒకరిమీద అభిప్రాయాలను  తెలుసుకోవటం, ఫిర్యాదులని ఇవ్వటం, చెడుగా చెప్పటం, నమ్మించి మోసం చెయ్యటం, అవసరానికి వాడుకొని అవతలకి జంప్ అవటం, మనదగ్గరవి దొంగిలించటం.. ఇలా నిజ స్నేహాలు ఎలా ఉంటాయో - ఇందులో ఇక్కడా అంతే!.. ఏమీ తేడా ఉండదు. అక్కడ స్నేహం కోసం కనీసం టీ అయినా ఇస్తే - ఇక్కడ ఆ ఖర్చే ఉండదు.

నిజ స్నేహాల్లో ఉన్న కొన్ని విషయాలు ఇందులో ఉండవు. ఇందులో ఉన్న కొన్ని ప్రత్యేకతలు నిజ స్నేహం లో ఉండవు. ఉదాహరణకి - నిజ స్నేహాల్లో మనిషిని ప్రత్యక్షముగా ముందు ఉండే మాట్లాడుతాము. ఇందులో అలా కాదు. ఇందులో ఉన్న ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏమిటంటే - వ్యక్తులు ఎక్కడైనా ఉండనీ, యే చోటనైనా ఉండనీ, వెంటనే కలుసుకోవచ్చు, అభిప్రాయాలని పంచుకోవచ్చు. రానున్న కాలములో ఇది మరింత ఊపు కి వస్తుంది. ఇంటింటికీ టీవీల్లా, కంప్యూటర్స్ ఉంటున్నాయి. యువతా పెరిగిపోతున్నది. దూరాన ఉన్న బంధు మిత్రులకి టచ్ లో ఉండేలా వీటిని వాడుకునేవారు ఎక్కువగా అవుతున్నారు. ఇలా వాడుకొనేవారు తమకంటూ ఒక ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ వాళ్ళు మాత్రమే వాడుకొనేలా సెట్టింగ్స్ పెట్టుకొని వారు వారు ఎంజాయ్ చేసేవారూ పెరిగిపోతున్నారు. ఇలా వాడుకునేవారికి ఇదొక వరం. అందునా ఇది ఫ్రీ కాబట్టి. అది ఎలా వాడుకోవచ్చో ముందు ముందు చెబుతాను.

ఇలా కాకుండా ఏదో ఆన్లైన్ లో విహరిద్దామనుకునే స్నేహాలు చేసేవారు మాత్రం - ఈ ఆన్లైన్ స్నేహాలని కాస్త అదుపులో పెట్టుకోవాలి. నిజానికి ఇదొక అందమైన ఊబి. ఉన్నా కొద్దీ ఉండాలనిపించే మాయాలోకం ఇది. మీ ఆర్ధిక, ఉద్యోగాలకు భంగం కాకుండా వీటిని మైంటైన్ చేసుకుంటే - వీటిలో ఆనందం పొందుతారు. లేకుంటే అధఃపాతాళానికి వెళ్ళటం ఖాయం. ఇది రెండువైపులా బాగా పదునున్న కత్తి లాంటిది. ఎలా వాడుకోవాలో బాగా తెలిసుండాలి. లేకుంటే  - అంతే!. నేనూ ఈ ఆన్లైన్ స్నేహాల వల్ల చాలా నేర్చుకొన్నాను. పోగొట్టుకున్నాను. అయినా ఒకటి పొందాలీ అంటే ఒకటి పోగొట్టుకోవటం తప్పనిసరి. కానీ అది ఎంత తక్కువగా పోగొట్టుకుంటే - ఎంత ఎక్కువగా దొరకబుచ్చుకోవచ్చు అనే ఇక్కడ మీ విజయానికి గీటురాయి.

అలాని ఇదేదో అందమైన భయంకర ఊబిలా ఉందని డీలా పడకండి. రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయని అసలు రోడ్డు మీదకి ఎక్కకుండా ఆగుతున్నామా? రోడ్డు మీద ఎలా జాగ్రత్తగా ఉంటామో ఇక్కడే అలాగే ఉండండి. అంతే!. ఒక్కోసారి ఎదుటివాడు - మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వాడే తప్పుడు దారిలో వచ్చేసి, ఆక్సిడెంట్ చేసేస్తాడు. అంత మాత్రాన మన తప్పు ఉన్నట్లు ఫీలయ్యి, అసలు రోడ్డు మీదకే - ఈజన్మలో రాము అని శపథం చెయ్యలేముగా. అలా ప్రమాదాలు ఈ భూమ్మీద ఉన్న వారికి అతి సహజాతి సహజం. ఇక్కడా అంతే!. రోడ్డు మీద ఎలా నడపాలో డ్రైవింగ్ క్లాసెస్ ఉంటాయే, శిక్షకులు ఉంటారు కానీ ఇక్కడ ఎవరూ ఉండరు. ఈ లోటుని కాస్త తగ్గిద్దామని నావంతుగా ఈ చిన్ని ప్రయత్నం అంతే!.. ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను.

ఇక్కడ మీరు చెయ్యాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే - మీ పర్సనల్ డాటా మాత్రం ఎవరికీ చెప్పకండి. మరీ అంత లోతుగా వెళ్ళకండి. ఇక్కడ స్నేహమే ముఖ్యం కానీ అంత కుటుంబ డిటైల్స్ అవసరం లేదని నా అభిప్రాయం. బాగా పరిచయాలయ్యాక అలా సమాచారం ఇచ్చి పుచ్చుకోండి. అలా ఎందుకో తరవాత చెబుతాను..

నేను ఈ షోషల్ సైట్లలో జాయిన్ అయినప్పుడు ఇలాంటి సమాచారం కోసం ఎంతగానో వెదికాను. ఊహు.. నాకు దొరకలేదు. నేనే ఒక్కొక్కటీ నేర్చుకుంటూ వెళ్లాను. ఇప్పుడు - నాలా తెలీని వారికి / తెలుసుకునేవారికీ చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నములో ఎంతవరకూ విజయవంతం అవుతానో వేచి చూడాలి.

ఇలా ఎన్నెన్నో విషయాలు చెప్పోచ్చును. కానీ ఇక్కడే అన్నీ చెప్పుకుంటూ వెళితే - ముందు ముందు టపాల్లొ ఏమి చెప్పుకుంటాము. కనుక ఇక మనం ముందుకు సాగుదాము.
updated on 17-Jan-2011

3 comments:

నీహారిక said...

ఇది కమెంట్ అని అనుకోకండి నా రిక్వెస్ట్ అని అనుకోండి.

మీరు ఎంతో శ్రమతో ఈ బ్లాగు నిర్వహిస్తున్నారు.

ఇంకొంచెం శ్రమ అని అనుకోకపోతే అన్ని టపాల లింకులూ ఒక టపా లో ఇవ్వగలరేమో ట్రై చేయకూడదూ ???

మాకు అవసరం అయినవి వెంటనే వెతుక్కోవచ్చు.

నేను చాలా బ్లాగుల్లో చదివినవి మళ్ళీ వెతకాలంటే అన్ని పోస్టులూ చూడవలసి వచ్చి బద్దకంతో వదిలివేస్తున్నాను. మీకు వీలవకపోతే వద్దులెండి .

Raj said...

ఫరవాలేదు. ఇది మీ రిక్వెస్ట్ గానే తీసుకున్నాను.

నా శ్రమని గుర్తించినందులకు కృతజ్ఞతలు.

అన్ని టపాల లింకులూ సబ్జెక్ట్ ల వారిగా Lables లలోనూ, టపాల లింకులూ Blog archive లోనూ ఉంటాయి. అక్కడ నొక్కితే అన్నీ సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చును. అందులో మీకు అవసరమైనవి వెంటనే వెదుక్కోవచ్చును.

Raj said...

మీరు నా బ్లాగ్ లో వెదకాలంటే పైన కుడి ప్రక్కన ఉన్న "ఇక్కడ మీకు కావలసింది టైప్ చేసి, ఈ బ్లాగ్ లో వెదకండి." అన్న దాంట్లో ఒక పదం టైప్ చేసి వెదకవచ్చును. లేదా - http://achampetraj.blogspot.com/2010/02/blog-post_09.html ఈ లింక్ కాపీ చేసి, అడ్రెస్ బార్ లో పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి. అప్పుడు నా బ్లాగ్ లోని ఒక టపా (కృతజ్ఞతలు - నా బ్లాగు గురించి) ఒక టపా వస్తుంది. అందులో నీలిరంగులో ఉన్న లింక్ నొక్కితే ఒక చిన్న ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అది ఆఫీస్ 2003/7 లో ఓపెన్ అవుతుంది. అందులో 2010 సంవత్సరపు పోస్ట్స్ అన్నీ లింక్స్ ఉంటాయి. అది మీకు చాలా యూస్ అవుతుంది. ఇందులో అన్నీ వివరముగా ఉంటాయి.

ఈ సంవత్సరపు 2011 టపాల లింక్ పోస్ట్ కావాలంటే ఇంకోద్దిరోజులు ఆగండి. లేదా జనవరి 2012 లో ఎదురుచూడండి.

Related Posts with Thumbnails