సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఎన్ని ఉన్నాయో మీకు చెప్పానుగా.. చాలా సైట్లు ఉన్నాయిగా - అందులో వేటిలో చేరాలి అనేదీ మీరు ఈపాటికే నిర్ణయించుకొని ఉండొచ్చు.. చేరి ఉండొచ్చు కూడా.. ఓకే.. మీకు అభినందనలు.
మీరు మీ ఓపిక, మీ వీలు సమయం దృష్టిలో పెట్టుకొని మీకు ఎన్నింట్లో చేరాలీ అనుకుంటే - అన్నింట్లో చేరొచ్చు. అన్ని సైట్లూ ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి. జస్ట్ నాలుగైదు వివరాలు నింపి, ఓకే చేస్తే - సెకన్లలో ఇక మనకంటూ ఒక ప్రొఫైల్ ఏర్పడుతుంది. ఇక ఆ ప్రొఫైల్ ని మన వివరాలతో నింపి, సేవ్ చేసుకుంటే - అదే అందరికీ కనిపిస్తుంది. ఎన్నింట్లో చేరాలి అన్నది మీ ఇష్టం. మీకు ఏమీ పనీ లేకుంటే, తాత ముత్తాతలు సంపాదించిన ఆస్థులు బాగా దండిగా ఉంటే - అంటే యే పని చెయ్యాల్సిన అవసరం లేకుంటే మీరు అన్ని సైట్లలోనూ జాయిన్ అవచ్చును. ముందే చెప్పాను. ఇది అందమైన ఊబి. ఖాళీ సమయం అంటూ ఉండి, ఆసక్తి ఉంటే రావటం బెస్ట్. లేకపోతే ఇందులోకి రావటం మీరు రావటం వృధా.
మీకు స్వంత సిస్టం లేకుంటే కాస్త ఇబ్బందే!.. బయట నెట్ సెంటర్ నుండి ఓపెన్ చేస్తూ ఉంటే మాత్రం మీకు నెగటివ్ గా మారుతుంది. ఎలా అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ స్క్రాప్స్ వ్రాస్తే - వాటికి రిప్లై ఇవ్వకపోతే మిమ్మల్ని చెడుగా అనుకునే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇలా మీ పరిస్థితి ఉంటే - మొబైల్ నుండి GPRS ఎనేబుల్ చేసుకొని, సమాధానాలు ఇవ్వటం బెస్ట్.
నా వివరణ :
మీరు ఎన్నింట్లో జాయిన్ అవ్వాలి అనేదానికి ఏవైనా రెండు సైట్లు సరిపోతాయి అనేది నా అనుభవం. నాకు ఐదింటిలో ప్రవేశం ఉంది. ఇప్పుడు ఒక దాంట్లో తప్పించి, అవన్నింటిలో చాలా తగ్గించేశాను. ఆ ఒక్కటీ చాలు అనుకున్నాను.. అలాగే డిసైడ్ అయ్యాను. ఆ ఒక్కటే అన్నీ అనుకొని దానిలోనే స్నేహితులని వెదుక్కుంటున్నాను. అందులోని వారితోనే మాట్లాడుతున్నాను. రోజూ వేరే సైట్లలో చేరమని కనీసం రెండు మెయిల్స్ అయినా వస్తున్నాయి. వాటన్నింటినీ వెంటనే రిజెక్ట్ చేస్తున్నాను. చెప్పాగా - నాకు ఒక్కటి చాలు. అందులో నాకు సరియైన మిత్రులు దొరకకుంటే - నాలోనే లోపం అని నాకు తెలుసు. ఇక్కడే స్నేహితులని వెదుక్కోలేని వాడిని - ఇంకా వేరే సైట్లలో ఎలా వెదుక్కోగలను. అందుకే ఇలా ఒక్కదానిలోనే ఆగిపోయాను. ఆ వేరేవీ కనీసం లాగిన్ అవటం కూడా లేదు. వాటి సంగతే ఇక మరిచాను. నాకంటూ ఒక యాభై మంది దొరికితే చాలు అనుకున్నాను. దొరికారు. ఇక చాలు. వారితో నేను సంతోషముగా ఉంటున్నాను. కాబట్టి ఎక్కువ సైట్లలో లాగిన్ అవద్దని అనుకుంటున్నాను. ఒకవేళ చేరితే దానికి న్యాయం చెయ్యలేక, ఉన్న మిత్రులని మంచి చేసుకోలేక - నేనే ఇబ్బంది పడాలి. నాకు అంత అవసరమా..? నిక్కమైన నీలం ఒక్కటి ఉన్న చాలు అన్నది ఎలానో - నాకున్న కొద్దిమంది మిత్రులు చాలు. "గంగిగోవు పాలు గరిటడైనను చాలు, కడవనైనా నేమి ఖరము పాలు.." అని వేమన సత్యం ఇక్కడ ఖచ్చితముగా వర్తిస్తుంది. ఇక ఇది నా అంతట నేనుగా తీసుకున్న నిర్ణయం. అలా ఒక్కదాంట్లోనే ఉంటూ నా మిగతా పనులు చేసుకుంటూ ఉన్నాను. మీరు మాత్రం మిమ్మల్ని మీరు పరిశీలించి నిర్ణయం తీసుకోండి.

updated on 21-Jan-2011 evening.
No comments:
Post a Comment