నన్నూ బాగా ప్రభావితం చేసినవారిలో ఇప్పటి వరకూ ముగ్గురు చనిపోయారు. వారిలో ఒకరు నా మామ (అని ముద్దుగా పిలుచుకునే) - రంగు శ్రీను మామ ఒకరు.. ఈ డిసెంబరు 31 న తన పట్టిన రోజుకి కొత్త బట్టలు కుట్టించుకొని, రడీగా ఉంచుకున్న తను, పుట్టిన రోజునకి కేవలం 5 రోజుల ముందు అంటే ఈ నెల 26 న ఓ రోడ్డు ప్రమాదములో చనిపోయాడు.. తెలంగాణా బందు వల్ల బస్ లో వెళ్ళే తను, మోటర్ సైకిల్ పైన గజ్వేల్ వద్ద తను మోటార్ సైకిల్ నడుపుతుండగా ఒక కుక్క రోడ్డు దాటబోయి, అవతలి వైపున రోడ్డులో ఒక లారీ రావటముతో ఆ కుక్క వెనుదిరిగి, ఈ మోటార్ సైకిల్ వెనకచక్రం క్రింద పడటముతో అ బండి మూడు పల్టీలు కొట్టింది.. అలా గాయపడిన తను చివరికి హాస్పిటల్ లో మరణించాడు..
నేను ఇక ఎవరిని మామా! అని ముద్దుగా పిలవాలి?
నాకిక ఎవరు క్రొత్త క్రొత్త విషయాలు చెబుతారు?
నేనిక ఎవరితో బైకు మీద లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి?
నాతో మిత్రుడికన్నా సన్నిహితముగా ఇంకెవరు ఉంటారు?
పర్సనల్ విషయాలు కూడా ఎవరితో షేర్ చేసుకోవాలి?
నేను పిలవగానే బైకు మీద 75 కిలోమీటర్లు లగేత్తుకొని నాకోసం వంటరిగా ఎవరొస్తారు ఇక?
మనం ఫ్యూచర్ లో ఇలా ఉండాలి అంటూ ప్రణాళికలు నాతో ఎవరు వేయిస్తారు?
తన సర్కిల్లో నాకో గొప్ప విలువను ఇక నాకెవ్వరు కలిపిస్తారు?
ఇలా బిజినెస్ చెయ్యాలి అని నాకెవరు చెబుతారు?
నన్నూ ఆర్థికముగా మంచి పోజీషను లోకి ఎవరు చేరుస్తారు?..
...
...
...
Tuesday, December 29, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment