నాలుగు సంవత్సరాల క్రిందట ఒకరి పెళ్లి రిసెప్షన్ కి వెళ్లాను. వధూవరులని కలిసాక, నాకు తెలిసిన వారినీ కలిసాక.. విందులో పాల్గొన్నాను.. నేను మిత్రుడితో కలసి భోంచేస్తున్న సమయములో నా మిత్రుడు ఇంకొంత పెట్టించుకోవటానికి వెళ్ళాడు.
అదే అదను అనుకొని ఒక వ్యక్తి, టిప్పు టాపుగా ఉన్న నా వద్దకి వచ్చాడు. నేనైతే చాలా సేపుగా అతన్ని గమనిస్తున్నాను - ఏంటా? ఇతను నా వంకే చూస్తున్నాడని. అతడికి నలభై సంవత్సరాలు ఉంటాయి. కొద్దిగా పెద్దమనిషిలా ఉన్నాడు. అతను మీరు ఇక్కడే (ఈ టవున్ లోనే) ఉంటారా? అవునని సమాధానం ఇచ్చాను. రెండో ప్రశ్నగా - మీరు ఏమి చేస్తుంటారు? అని అడిగాడు. (నాకిక అంతా అర్థమయింది. అదేమిటో తర్వాత చెబుతాను) నా స్థాయిని తగ్గించి మామూలు పనివాడి స్థాయిని చెప్పాను. అలాగా అని తన గురించి కొంత వివరణ ఇచ్చి "ఒక్క క్షణం.." అని ప్లేటులో పదార్థాలు వడ్డించుకోవటానికి వెళ్ళాడు.. మళ్ళీ తిరిగి రాలేదు - ఇప్పటి వరకూ. తరవాత మా ఫ్రెండ్ వచ్చాడు. జరిగినదంతా చెప్పాను. చూసాను.. భలే చెప్పావురా.. అని మెచ్చుకున్నాడు. ఆ విందులో ఇక కావాలని అతడి ముందు నుండి తిరిగినా నేను కనపడనట్లే ప్రవర్తించాడు.
ఇలాంటివి విందుల్లో, పెళ్ళిళ్ళలో, మార్కెట్లలో.. చాలా సాధారణం. కాదనను. ఇలాంటి పరిచయాలు మన స్టేటస్, ఆస్థి, ఐశ్వర్యం, పలుకుబడి.. ఇత్యాది కారణాల మీద ఏర్పడుతుంటాయి. మనం ఎంతెంత బలముగా ఉంటే అంతగా పరిచయాలు ఉంటాయి. ఈ పరిచయాలు వల్ల మనకో గుర్తింపు వచ్చిందనీ, అందరూ మన ప్రాపకం కోసం అర్రులు చాస్తున్నారనీ.. అంటూ ఏవేవో భ్రమల్లో తేలిపోతాము. కాని ఇలాంటి పరిచయాల వల్ల మనకు ఒరిగేదేమీ లేదని, వాళ్ళ స్వలాభానికి మనతో స్నేహం చేసారని.. - అని మన హోదానో, పరపతో, ఆస్థియో తగ్గినప్పుడు మనకి స్పష్టముగా అర్థమవుతుంది. అందరూ "మనల్ని వాళ్ళ చేతులు ఎర్రగా పండటానికి పెట్టుకున్న గోరింటాకులా" తయరయ్యామని అప్పటికి గానీ అర్థం కాదు. అవతలివారు మనకెలా ఉపయోగపడతారూ! అనుకుంటూ - లెక్కలు వేసుకుంటూ చేసే ఈ పరిచయ కార్యక్రమాలు మనకేమీ ఒరగాపెట్టవు సరికదా మనల్ని వారి అవసరాలకై వాడుకునేదే ఎక్కువ. ఇలాంటివారిని మనం తేలికగా గుర్తుపట్టచ్చు.. నా అనుభవాల్లన్నిటినీ పరిశీలనా దృష్టితో చూస్తే - చివరికి తేలింది ఏమిటంటే - ఒకరు మనకి పరిచయమైనా కొత్తలో కుశలపు మాట (హాయ్, హలో, బాగున్నారా?, భోంచేసారా?, మిమ్మల్ని అక్కడ చూసాను.. ) తరవాతి మాటగా మిమ్మల్ని మీరు ఏమి చేస్తుంటారు అని అడిగారు అనుకోండి.. అంతే! ఆ మనిషి మిమ్మల్ని మీ హోదా, పరపతి.. కోసం మీతో చనువు పెంచుకోవాలని అనుకుంటున్నాడు అని డిసైడ్ అవండి. అలాంటి వారు మీకు అంతగా నప్పరు.. స్నేహం అంటే - ఇవ్వడాలు, పుచ్చుకోవడాలు అంటూ ఉంటేనే బాగుంటుంది. అంతేకాని మనం ఇస్తూ పోతుంటే... చివరికి మనకేమీ మిగలదు. అప్పుడు మనం - జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది.. అని సోలోగా పాడుకోవాల్సివస్తుంది.
ఇక్కడ చిన్న సవరణ: ఇలాంటివారు అమాయకులు.. మీరు నమ్మకున్నా ఇది నిజం! ఇలా అడిగి తొందరగా బయట పడతారు.. కాని ఇంకొంతమంది - పులిగుహలోకి వెళ్లేముందు చేసే "రెక్కి" (ఆ గుహ ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు, లోపల ఎన్ని పులులు ఉన్నాయ్, అందులో ముసలివి ఎన్ని, వయసువి ఎన్ని.. అనే పద్దతిలో) లా ముందే అన్నీ ఇతరులనుండి మన గురించి తెలుసుకొని గోముఖ వ్యాఘ్రాల్లా వస్తారు చూడండి.. వారిని ఏమాత్రం పసి కట్టలేం! సో, బీ కేర్ఫుల్!

1 comment:
You're right! bro.
Post a Comment