నేను అప్పుడప్పుడూ సరదాకోసమనీ, రొటీన్ కి భిన్నముగా, కొద్దిగా మూడ్ మార్పు కోసమనీ వంటలు చేస్తుంటాను. నేను వంటలలో అంత ప్రావీన్యుడిని కాను గాని ఎప్పుడైనా అవసరం ఉంటుందేమోనని ఈ వంట నేర్చుకున్నాను.. "మడిసన్నాక కాస్త కలాపోసన ఉండాలని" అన్నట్లు ఈ రంగములో కూడా కొద్దిగా తెలిసుండాలని సరదాగా నేర్చుకున్నాను.. ఇప్పుడు ఆ వంటకం ఎలా చెయ్యాలో ఫోటోల సహాయముతో మీకు వివరిస్తాను.. మీరూ నేర్చుకొండే!.. కమాన్!.. మీరూ రెడీ కదూ..
ఇప్పుడు ముందుగా చికెన్ ముక్కలను నీటితో శుభ్రముగా కడుక్కోవాలి.. పెద్ద ముక్కలకి కాస్త లోతుగా గాట్లు పెట్టుకోవాలి. ఇలా చేస్తే గ్రేవీ ఆ సందుల గుండా లోపలి వెళ్ళుతుంది. తినేటప్పుడు కాస్త ఎక్కువ రుచిగా ఉంటుంది కూడా..
పసుపూ, కారం, అల్లం-వెల్లుల్లి పేస్టూ, ఉప్పూ, కొంత వెనిగరూ.. కలపాలి.. ఇలా చేసి ప్రక్కన పెడితే అవన్నీ ముక్కలకి బాగా పట్టుకుంటుంది.
వాటిని బాగా కలియదిప్పి పక్కన ఉంచుకోవాలి.. అవన్నీ ముక్కలకి బాగా పట్టుకోవటానికి అలా కాసేపు వదిలెయ్యాలి..
అలా మారినేట్ అయ్యేలోగా - ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పూదినా పక్కన పెట్టుకోవాలి. పచ్చి మిరపకాయలను నిలువుగా కోసుకోవాలి. అలాగే ఉల్లిపాయలనూ సన్నగా తరుముకోవాలి.
ఇలా అన్నీ సిద్దముగా ఒక ప్లేట్ లో రెడీ గా పెట్టుకోవాలి..
ఇప్పుడు స్టౌ వెలిగించి.. పాన్లో నూనె వేడిచేసుకోవాలి.. మంచి రుచి రావటానికి, రిఫైండ్ పల్లి (వేరుసెనగ) నూనె వాడండి. కర్రీ బాగా రుచిగా ఉంటుంది. కాని ఆ నూనె లో కొవ్వు పదార్థాలు ఎక్కువ. కనుక బాగా రుచిగా వండాలి అంటేనే ఆ వేరుసెనగ నూనె వాడండి.
నూనె వేడయ్యాక, అందులోకి పచ్చి మిర్చి వేపుకోవాలి..
ఆ తరవాత ఉల్లిపాయలనీ వేసి, కలియత్రిప్పాలి..
..కరివేపాకూ, కొత్తిమీర, పూదినా వేసుకొని వేపుకోవాలి.. పూదీన కాస్త ఎక్కువగా వేసుకోవాలి.
అవన్నీ కాస్త రంగు మారాక, అప్పుడు అందులోకి - ముందే సిద్దముగా ఉంచుకున్న చికెన్ పేస్టు ముక్కలను పాన్లోకి వంపుకోవాలి..
..కొద్దిగా సోయాసాస్ పోయాలి..
..కొద్దిగా వెనిగరూ కలుపుకోవాలి (ముక్కలు పులుపుగా మెత్తగా ఉడికేందుకై )..
అలాగే కాస్త ఘాటుగా ఉండాలి అంటే - పచ్చి మిర్చి పేస్ట్, దాల్చిన పొడి, లవంగాల పొడి, దంచిన అల్లం ముక్క, ధనియాల పొడి.. వేసుకోవాలి. కొద్దిసేపు (ముక్కలు మెత్తగా అయ్యేవరకూ) మూత పెట్టాలి.. నీరు అసలే పోయవద్దు. చికెన్ లోనుండి వచ్చే రసాలు చాలానే ఉంటుంది. అది సరిపోతుంది.
కొద్దిగా ఉప్పును కలుపుకోవాలి.. కొద్దిగా అల్లము పేస్టు కలపాలి.
ఎండుకొబ్బరిని పొడిగా చేసుకొని, ఇలా వేసుకోవాలి.. అలాగే కాసింత గసాలు మెత్తగా నూరి, ఇందులోకి కలుపుకోవాలి.
తరవాత కొంచెం కారం, చికెన్ మసాలా.. వేసి బాగా కలుపుకోవాలి.
చివరిగా గార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీర, పూదిన, నిమ్మరసం.. వేసుకోవాలి. ఇదిగో.. నోరూరించే చికెన్ వంటకము రెడీ..
బావుందా.. మీరు చేసారా - ఇలా!. ఈ వంటకం మీకు నచ్చిందా..?
updated on 27-July-2008
4 comments:
చాలా బాగుందండీ.. ఇలా చూస్తూ అలా నేర్చేసుకున్నాను. మా వారినుండి మంచి ప్రశంశలు పొందాను.. అందులోంచి మీకూ వాటా ఇస్తున్నాను.. అసలు క్రెడిట్ మీది కాబట్టి.
ధన్యవాదములు మీకు.. మొత్తానికి నాలా వండి మీ కుటుంబంని సంతోషపరిచారన్న మాట..
nenu aha na pellanta lo kota type lo ..mee recipe chusesi..lottalesanandi. mee opikaku joharlu..step by step narration with pics..bavundi.
నా చేతివంట నచ్చినందులకు, "కళ్ళతో రుచి చూసినందులకూ" ధన్యవాదములు. హ ఆహ్హహ్హా.. ఏదో ఆరోజు అలా చెయ్యాలనిపించింది. చేశా. అది అందరితో షేర్ చేసుకున్నాను.
Post a Comment