మానవుడు అన్నవాడికి ఏదో ఒకటంటూ నామధేయం అంటూ ఉంటుందికదా.. బారసాల నాడు పెట్టిన ఈ పేరు అలాగే కొనసాగుతుంది కదా.. విద్యాభ్యాసం తరవాత ఆర్జనపరులైనప్పుడు వరకూ అంతా ఒకే.! ఆర్జన పరులైనప్పుడు విజయాలు వచ్చనప్పుడు ఏమీ పట్టించుకోము గాని - అపజయాలు ఎదురైనప్పుడు మాత్రం ఏమైయుంటుంది అంటూ అన్నీ ఆలోచిస్తాము.. అలా తీక్షణముగా ఆలోచించి..చించీ.. బుర్ర వేడెక్కి ఇతరులమీద ఆధారపడుతాం! ఇదిగో ఇక్కడే మన పతనం మొదలవుతుంది..
ఈ పేరు మార్చడం సాధారణముగా ఎక్కువగా సినిమా రంగములో చూస్తుంటాము.. నేములోనే నేమున్నది అంటూ బురిడీ కొట్టించి తమ పబ్బం గడుపుకునేవాళ్ళు ఈ రంగములో మెండు.. కోట్లు పోసి తీసిన సినిమా - విడుదల అయ్యాక "ఫట్" అని పేలిపోతుందో అని భయం వల్ల "కొద్దిమాత్రం" (వేలల్లో) ఖర్చే కదాని సాంఖ్యాక శాస్త్ర నిపుణులను (numerical analyst), అచ్చొచ్చిన గురువునో కలుస్తారు. వచ్చినవారిని ఖాళీగా ఎందుకు వదిలెయ్యాలని? (శాస్త్రం గీస్త్రం శుద్ధ దండగ.. అని అనక) వచ్చిన "బకరాలను" అదో, ఇదో చెప్పి వేలకు వేలు లాగి చిన్న పరిష్కార మార్గం చెపుతారు.. ఆ సినిమా పేరులో ఒక అక్షరం ఎక్కువ పెట్టుకో.. అంతా కలసి వస్తుంది అని అంటారు (pavan kalyan అని ఉంటే pavvan kalyaan గా మారుస్తారు)..
ఇవన్నీ చూసి నచ్చక మనమేమీ మార్చాక "హిట్"అయితే వాడి టైం బావుందనీ, "ఫట్" అయితే నేను ముందే చెప్పలా పేరు మార్చమనీ, వింటేనా.. అని ఎకసేక్కాలు.. ఇలా మార్చాక హిట్ అయితే తమ చలవ అనీ, "ఫట్" అయితే దురదృష్టం బాగా బలంగా ఉందనీ, రాహు,కేతు,సర్ప యాగాలు చేయిస్తే దోషం పోతుందనీ చెబుతారు..
మళ్ళీ ఇక్కడ దోపిడీ.. "నీవు అక్కడికి వెళ్ళు అక్కడ నాకు తెలిసిన గురువు ఉన్నాడు.. తను నీకు బాగా హెల్ప్ చేస్తాడు.. తక్కువలో అవుతుంది" అంటాడు. అక్కడికి వెళ్ళాకా ఆ "గురువు" "ఒహొ మీరు వారు పంపగా వచ్చారా?.. మరీ మంచిది అంటూ తన రెట్టింపు ఫీజు, పంపిన వాడికి కమీషనూ, అన్నీ నాణ్యమైన పూజా సామగ్రి, పూజా ఫీజు అంటూ వసూలు చేస్తారు.. ఇంత అయ్యాక గ్యారంటీ ఏమైనా ఇస్తారా అంటే ప్చ్.. నో గ్యారంటీ! ఇక్కడ మనసు ని మాటలతో సంతోషపరచి పంపుతారు అంతే! అయినా "ఫట్" అయ్యిందా.. ఇక దేవుడే దిక్కు..
No comments:
Post a Comment