Tuesday, November 29, 2016

CMOS Battery life

నేను 2005 ఏప్రిల్ లో క్రొత్త డెస్క్ టాప్ తీసుకున్నాను. అప్పటినుండీ నేటివరకూ ఆ సిస్టం భేషుగ్గా పనిచేస్తున్నది. ఒక్క మెమొరీ స్టోరేజీ స్పేస్ తప్ప నాకున్న అవసరాలకు ఆ సిస్టం సరిపోతున్నది.. ఇప్పటికీ సిస్టం మదర్ బోర్డ్ 99.8% గుడ్ కండీషన్ లో ఉందని మదర్ బోర్డ్ కంపనీ ఇంటెల్ వారి ఒక ప్రోగ్రాం వల్ల తెలుసుకున్నాను. ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం ఏమిటంటే - ఆ సిస్టం లోని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అయిన CPU కి ఉన్న బ్యాటరీ జీవితకాలం గురించి. 

మామూలుగా CPU కి తేదీ, సంవత్సరం మరియు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఒక గడియారం అవసరం. సిస్టం ఆఫ్ లో ఉన్నప్పుడు ఆ గడియారం అలాగే కొనసాగటానికి తగినంత శక్తిని ఇవ్వటానికి బ్యాటరీ అవసరం. అందుకే ప్రతి మదర్ బోర్డ్ లో ఒక బ్యాటరీ సెల్ తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారు. ఈ సెల్ ని అమర్చటం / మార్పు చెయ్యడం కూడా చాలా సులభమే. 

సిస్టం కొన్నాక మొదలెట్టిన ఆ బ్యాటరీ సెల్ జీవనం మొన్న మొన్నటివరకూ సాగింది. దాదాపు 11 సంవత్సరాల 7 నెలల కాలం ఆ బ్యాటరీ సెల్ తన శక్తిని నిరంతరముగా అందించింది. నేను అనుకోలేదు ఒక చిన్న సైజు / పాత పాతిక పైసల నాణెం సైజులో ఉండే CR 2032 3V బ్యాటరీ సెల్ ఇంతకాలం మన్నిక వస్తుందనీ, ఎటువంటి అంతరాయాన్ని కలుగచేయకుండా తన శక్తిని ఇస్తుందనీ.. ఒక మదర్ బోర్డ్ బ్యాటరీ జీవితకాలం ఎంత ఉంటుంది అన్న ఆసక్తికి సమాధానంగా ఈ పోస్ట్. 
గూగుల్ ఇమేజెస్ నుండి తీసుకోబడినది. చిత్రములో ఉన్న మదర్ బోర్డ్ నాది కాదు. బ్యాటరీ మాత్రం అదే నంబర్  ( CR2032 3V )

ఇది ఒకే.. బ్యాటరీ లోని శక్తి అయిపోయాక సిస్టం లో ఏమేమి మార్పులు వస్తాయి అనే మరో సందేహానికి ఈ వివరణ. ఈ మార్పులు గమనించాను కాబట్టి అవి మీకు తెలియచేస్తున్నాను. 

1. సిస్టం ని ఆన్ చేస్తే - అది మామూలుగా ఓపెన్ కాదు. మానిటర్ మీద రెండు లైన్ల మెసేజ్ వస్తుంది. మీ సిస్టం లోని CMOS (Complementary Metal-Oxide Semiconductor ) బ్యాటరీ ఫెయిల్యూర్ వల్ల మామూలుగా ఓపెన్ కాదు.. ఏదైనా కీ బోర్డ్ కీ నొక్కండి అనే మెస్సేజ్ కనిపిస్తుంది. 

2. పై మెసేజ్ కనిపించాక ఎంటర్ కీ ని నొక్కాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ మెసేజ్ వస్తుంది.. మళ్ళీ ఎంటర్ కీ నొక్కాలి. ఇలా మూడుసార్లు చేశాక మామూలుగా OS పనిచేస్తుంది. 

3. అలా తెరచుకున్నాక సిస్టం ని మామూలుగా తెరవలేం. సిస్టం ట్రేలో ఉన్న గడియారం - ఆ సిస్టం తయారీ తేదీని చూపిస్తుంది. ఆ సమయం మీద క్లిక్ చేసి, ఆ సమయాన్ని మార్చుకోవాలి. 

4. మీ సిస్టం లోని అప్డేట్ అంటి వైరస్ ప్రోగ్రాం మీరు అంతర్జాలం లోకి వెళ్ళటాన్ని నిరోధిస్తుంది. అంటే అంతర్జాలం తెరచుకోదు. అప్పుడు ఖచ్చితముగా ఆ సమయాన్ని అప్డేట్ చెయ్యాల్సిందే. ( నాకు మాత్రం అలాగే జరిగింది). 

5. ఇలా చెయ్యటం అన్నది - ఆ సిస్టం ని తెరచినప్పుడల్లా ఇలా తప్పనిసరిగా చెయ్యాల్సిరావటం విసుగ్గా ఉంటుంది. 

6. ప్రతిసారి ఇలా ఇబ్బంది పడే బదులు 30 రూపాయలు పెట్టి ఆ బ్యాటరీ సెల్ మార్చుకుంటే సరి. 


2 comments:

sarma said...

Yes I v experienced this,good post

Raj said...

మీ అభినందనకు ధన్యవాదములు..

Related Posts with Thumbnails