ఈ మధ్య నేనొక గోడ మీద బార్డర్ డిజైన్ వేశాను. ఊబుసుపోక ఏం చెయ్యాలో తోచని వేళ ఆ పని పెట్టుకున్నాను. దాని గురించి మీకు తెలియచేస్తున్నాను.
రోడ్డు వైపున ఉండే గోడ అది. ఆ గోడకి ఈ మధ్యే రంగు వేశాను.. హా.. మీరు విన్నది నిజమే. నేనే వేశాను. అంతకు ముందు ఆ గోడకి - చాలా ఖరీదైన రాయల్ వెల్వెట్ ఎమల్షన్ పెయింట్ వేయించాను. మంచిగా కనిపిస్తే జనాలు ఓర్వలేరు కదా.. దాన్ని మేకులతో గీకి, పాడు చేశారు. ఇలా కాదనుకొని వంకాయ రంగు నుండి బూడిద రంగుకి మార్పించాలనిపించింది. మహా అంటే 15' x 11' అడుగుల గోడ. దీనికి రంగు వెయ్యటానికి Rs. 500 అడిగాడు పెయింటర్ అబ్బాయి. మరొకరిని అడిగినా దాదాపుగా అంతే!..
చూస్తే అది చిన్న పని.. వాళ్ళైతే అలవాటైన పని గనుక మహా అంటే పది నిమిషాల్లో ముగించేసే పని. ఆమాత్రం దానికే అంత డబ్బా!! పోనీ అదేమైనా స్కిల్ వర్క్ Skill work కూడా కాదు. మరొక ఎమల్షన్ పెయింట్ ని పెయింట్ రోలర్ సహాయాన పూసేయ్యడమే. ఇక లాభం లేదని నేనే వేసుకోవడానికి సిద్ధమయ్యాను. ఓ ఆదివారాన దానికి సుముహూర్తం పెట్టాను.
ఆరోజు రానే వచ్చింది. రోడ్డు కదా.. జనాలు బాగానే అటూ, ఇటూ తిరుగుతూ ఉన్నారు. వారి ముందు అలా వెల్ల వేయటం కాస్త నామోషీగా అనిపించి, మొదలెట్టక ఆగాను. కానీ వారి రాకపోకలు ఆగిపోవాలంటే - ఇక చీకటి పడాల్సిందే.. అపుడైతే నామోషీగా ఉండదేమో గానీ, ఎక్కడ రంగు బాగా వచ్చింది, ఎక్కడ గుడ్డి గుడ్డిగా వచ్చిందో తెలీదు. ఇక కాదని సాయంత్రం పూట రంగేయ్యటం మొదలెట్టాను.
ఇంతకు ముందు రంగేసినప్పటి పెయింట్ రోలర్ ఇంట్లో ఉంది కాబట్టి, ఈజీగా అయ్యింది. దాన్ని ఒక కట్టెకు గుచ్చి ( ఇలా చెయ్యటానికి ఆ రోలర్ హాండిల్ కి ఈ సదుపాయం ఉంటుంది ) రంగు పూయటం మొదలెట్టాను. వాళ్ళూ, వీళ్ళు వచ్చి, ఇలా ఎలా వేస్తున్నానో చూడటానికి వచ్చినా, ఇక పట్టించుకోక దాదాపు పావుగంటలోనే ఒక కోటింగ్ పూర్తి చేశాను. అది ఆరాక మరో కోటింగ్ కూడా వేశాను. రోలర్ సహాయన అలా వెయ్యటం చాలా తేలికగా పని ముగిసింది.
ఇలా వేస్తున్నప్పుడు తెలిసిన పెయింటర్ అటుగా వెళుతూ, చూసి, ఆగాడు. వచ్చి " నేను వెయ్యాలా అన్నా!.." అని అడిగాడు.
" వేయు.. ఎంత తీసుకుంటావ్.." అన్నాను.
" మూడొందలు ఇవ్వన్నా.." అన్నాడు. అప్పటికే సగం అయ్యింది. రోలర్ తో వెయ్యడం క్రొత్తగా, భలేగా అనిపిస్తున్నది. అంతా నేనే వేసుకోవాలని అనుకున్నాను. ఈరోలర్ ని చూసే - ఈ పెయింట్ వెయ్యటానికి వచ్చాడంట. అంటే రోలర్ వల్ల అంత తేలికగా పెయింట్ వెయ్యడం జరిగిపోతుందన్నమాట. తను ఉన్నప్పుడే ఒక కోటింగ్ వెయ్యటం పూర్తయ్యింది కూడా.. ఇంకో కోటింగ్ అతనికి ఎందుకివ్వాలనిపించింది. ఇచ్చి డబ్బులు ఎందుకు వృధా చేసుకోవాలనిపించింది..!! కాసేపు ఆ మొదటి కోటింగ్ ని ఆరనిచ్చాను. ఆతర్వాత రెండో కోటింగ్ ని ఇట్టే లాగించేశాను.
అలా రెండు కోటింగ్స్ పూర్తయ్యాక - ఆ గోడ నాకైతే మరింత అందముగా కనిపించటం మొదలెట్టింది... బహుశా నేను వేశానని కాబోలు. ( ఇదంతా ఈ పోస్ట్ హెడ్డింగ్ కి సరిపోదు కానీ, జ్ఞాపకం కోసం వ్రాసుకున్నాను )
ఆ తరవాత కొద్దిరోజులకు ఆ గోడకి క్రిందన బార్డర్ కొట్టాలనిపించింది. అలా అయితే ఆ గోడ మరింత అందముగా కనిపిస్తుందని. ఆలివ్ గ్రీన్ ఎమల్షన్ Alive Green Emulsion కాస్త మిగిలినట్లు ఉంటే - దాన్ని వాడేసి, ఆ డబ్బాని తీసేద్దామని ఆ రంగుని ఎంచుకున్నాను. ఆ డబ్బా తీసేస్తే నాకు కాస్త స్టోరేజీ సమస్య తీరుతుంది.
మళ్ళీ ఒక ఆదివారం ఎంచుకొని, ఆ గోడ మీద బార్డర్ లైన్ వ్రాసుకొని, ఆ రంగుని 50mm నంబర్ బ్రష్ సహాయాన పూసేశాను. అదీ రెండు కోటింగ్స్ వేశాను. ఇలాంటి వాటిని వేసేటప్పుడు - కొన్ని విషయాలు బాగా గుర్తు పెట్టుకోవాలి. అందులో ఇది ఒకటి - ఎక్కడైతే పెయింట్ పోయిందో / క్రొత్తగా వెయ్యాల్సి ఉంటుందో / మరకలతో అసహ్యముగా కనిపిస్తుందో - అక్కడ అన్నింటికన్నా ముందే ప్యాచెస్ మాదిరిగా పెయింట్ చేసుకొని, ఆతర్వాత మిగతా అంతా మొదలెట్టుకోవాలి. అలా అయితే మరింత లుక్ వస్తుంది.
ఇలా రెండు, మూడు కోటింగ్స్ అయ్యాక - ఆ పెయింట్ కొద్దిగా అంటే 50 ml. మిగిలింది. అలా మిగల్చాలి కూడా! పెయింట్ వేశాక ఎక్కడైనా మరకలుగా ఉంటే టచప్స్ Touch up కోసం అది అవసరానికి అట్టే పెట్టుకోవాలి.
ఇదయ్యాక చాలా వారాలకు / కాదు నెలలకు - ఆ క్రింది బార్డర్ ని మార్చాలనిపించింది. ఎలా మార్చాలో, ఎలా ఉండాలో అప్పటికి ఇంకా నిర్ణయమూ తీసుకోలేదు.. జస్ట్ అనుకున్నా అంతే!.
ఒకరోజు రాత్రి సడన్ గా ఒక ఐడియా. ఇది నా జీవితాన్ని మార్చలేదు కానీ గోడ అందాన్ని మారుస్తుంది అనుకున్నాను. ఎన్నోసార్లు క్రాస్ చెక్ చేసి, ఆలోచించా.. బాగుంటుంది అనిపించింది. ఎమ్మెస్ పెయింట్ లో అలా గీసి, రంగులేసి, చూశా.. వావ్! అనిపించింది. మరి ఇది అందరికీ నచ్చుతుందో లేదో.. అనిపించింది.
మరోరోజు రాత్రిన ఆ ఐడియాని అప్డేట్ చేసుకున్నాను - నా ఫేస్ బుక్ గోడ Wall నా ఇష్టం, నాకు నచ్చింది వ్రాసుకుంటా, ఇష్టమైనది వేసుకుంటా.. అన్నట్లు నా గోడ నా ఇష్టం అనిపించి, ముందుకు సాగాను. ఒకవేళ బాగా రాకుంటే ? హా! ఏముంది? మరొక రంగుతో ఆ బార్డర్ ని మార్చితే సరి అని నిర్ణయించుకున్నాను.
ఆ మిగిలిన 50ml ఆలివ్ గ్రీన్ ఎమల్షన్ పెయింట్ లో కాస్త ఫాస్ట్ గ్రీన్ fast green స్టైనర్ ని కలిపి ఆ రంగుని మరింత డార్క్ చేసి, అక్కడక్కడ ప్యాచెస్ రూపములో ఆ బార్డర్ పట్టీ మీద పూశాను. అప్పటికీ మరికొద్దిగా మిగిలితే నలుపురంగు స్టైనర్ ని కలిపి, మరింత ముదురు ఆకుపచ్చగా మార్చి - అక్కడక్కడ మళ్ళీ ప్యాచెస్ మాదిరిగా వేశాను. అప్పటికి ఆ రంగు అయిపోయింది. ఆ తరవాత తెలుపు రంగు ఎమల్షన్ తీసుకొని, అందులో ఫాస్ట్ పసుపు Fast Yellow, ఫాస్ట్ రెడ్ Fast Red లను తగుపాళ్ళలో కలుపుతూ మరిన్ని రంగులని తయారుచేసి, వాడాను. కాస్త కాఫీ బ్రౌన్ కలర్ కూడా ఉంటే అదీ వాడాను. ఒక ప్యాచ్ కీ, మరొక ప్యాచ్ కీ ఆనుకోనేలా, వివిధ రంగులు కలుసుకోనేలా వేశాను. ఇక ఆరోజు అంతటితో ముగించేశాను. స్టైనర్ అంటే - ఎమల్షన్ పెయింట్ లో మనకి కావాల్సిన షేడ్ వచ్చేందుకు కలిపే అతిచిక్కని, గాఢమైన రంగు.
దాన్ని చూసి, ఇదేమిట్రా - వీడు గోడని ఇలా రకరకాల రంగులు వేస్తూ పాడుచేస్తున్నాడు అనుకున్నారు. కొద్దిమంది నాతో అన్నారు కూడా. కానీ నేనేమీ పట్టించుకోలేదు. నాకైతే - అది పూర్తయితే మరింతగా బాగుంటుందని నమ్మకముగా ఉన్నాను.
మరో రెండు మూడు వారాల సమయం తీసుకొని తెలుపు ఎమల్షన్ లో ఎక్కువగా నలుపురంగు స్టైనర్ ని కలిపి నల్లని రంగుని తయారుచేశాను. ఆ రంగుని ఒక సన్నని బ్రష్ సహాయాన - ఆ ప్యాచెస్ ని ఒక్కొక్కటీ సేపరేటుగా ఉండేలా, బార్డర్స్ గీశాను. ఇప్పుడు మరింత అందముగా వచ్చింది. అప్పుడు దాన్ని చూసిన వారు - నన్ను అభినందించారు. నాకు మాత్రం నాకు నచ్చిన డిజైన్ ని అలా బార్డర్ గ వేసుకొని నాలోని కోరికని నేరవేర్చుకున్నానని అనిపించింది.
ఇదే ఆ గోడ గ్రాఫిటీ -

No comments:
Post a Comment