Monday, February 27, 2017

Good Morning - 627


నిన్న కలిగిన బాధను తలచుకుంటూ క్రుంగిపోయేకంటే, నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ, రేపటి ఆనందం కోసం దారులు వెదకాలి. ఇదే మానవ జీవన రహస్యం. 




Saturday, February 25, 2017

కొన్ని సినిమా పంచ్ డైలాగ్స్ తాలూకు ఈ కార్డ్స్

నేను సరదాగా వ్రాసిన - కొన్ని సినిమా పంచ్ డైలాగ్స్ తాలూకు ఈ కార్డ్స్ e cards. 




























Sunday, February 19, 2017

పొడుపు కథలు - 37


లోతైన చెరువులో తోకతో నీటిని త్రాగే అందాల చిలుక. ఏమిటది? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
విడుపు : దీపం 


Friday, February 17, 2017

Wall Graphity

ఈ మధ్య నేనొక గోడ మీద బార్డర్ డిజైన్ వేశాను. ఊబుసుపోక ఏం చెయ్యాలో తోచని వేళ ఆ పని పెట్టుకున్నాను. దాని గురించి మీకు తెలియచేస్తున్నాను.

రోడ్డు వైపున ఉండే గోడ అది. ఆ గోడకి ఈ మధ్యే రంగు వేశాను.. హా.. మీరు విన్నది నిజమే. నేనే వేశాను. అంతకు ముందు ఆ గోడకి - చాలా ఖరీదైన రాయల్ వెల్వెట్ ఎమల్షన్ పెయింట్ వేయించాను. మంచిగా కనిపిస్తే జనాలు ఓర్వలేరు కదా.. దాన్ని మేకులతో గీకి, పాడు చేశారు. ఇలా కాదనుకొని వంకాయ రంగు నుండి బూడిద రంగుకి మార్పించాలనిపించింది. మహా అంటే 15' x 11' అడుగుల గోడ. దీనికి రంగు వెయ్యటానికి Rs. 500 అడిగాడు పెయింటర్ అబ్బాయి. మరొకరిని అడిగినా దాదాపుగా అంతే!.. 

చూస్తే అది చిన్న పని.. వాళ్ళైతే అలవాటైన పని గనుక మహా అంటే పది నిమిషాల్లో ముగించేసే పని. ఆమాత్రం దానికే అంత డబ్బా!! పోనీ అదేమైనా స్కిల్ వర్క్ Skill work కూడా కాదు. మరొక ఎమల్షన్ పెయింట్ ని పెయింట్ రోలర్ సహాయాన పూసేయ్యడమే. ఇక లాభం లేదని నేనే వేసుకోవడానికి సిద్ధమయ్యాను. ఓ ఆదివారాన దానికి సుముహూర్తం పెట్టాను. 

ఆరోజు రానే వచ్చింది. రోడ్డు కదా.. జనాలు బాగానే అటూ, ఇటూ తిరుగుతూ ఉన్నారు. వారి ముందు అలా వెల్ల వేయటం కాస్త నామోషీగా అనిపించి, మొదలెట్టక ఆగాను. కానీ వారి రాకపోకలు ఆగిపోవాలంటే - ఇక చీకటి పడాల్సిందే.. అపుడైతే నామోషీగా ఉండదేమో గానీ, ఎక్కడ రంగు బాగా వచ్చింది, ఎక్కడ గుడ్డి గుడ్డిగా వచ్చిందో తెలీదు. ఇక కాదని సాయంత్రం పూట రంగేయ్యటం మొదలెట్టాను. 

ఇంతకు ముందు రంగేసినప్పటి పెయింట్ రోలర్ ఇంట్లో ఉంది కాబట్టి, ఈజీగా అయ్యింది. దాన్ని ఒక కట్టెకు గుచ్చి ( ఇలా చెయ్యటానికి ఆ రోలర్ హాండిల్ కి ఈ సదుపాయం ఉంటుంది ) రంగు పూయటం మొదలెట్టాను. వాళ్ళూ, వీళ్ళు వచ్చి, ఇలా ఎలా వేస్తున్నానో చూడటానికి వచ్చినా, ఇక పట్టించుకోక దాదాపు పావుగంటలోనే ఒక కోటింగ్ పూర్తి చేశాను. అది ఆరాక మరో కోటింగ్ కూడా వేశాను. రోలర్ సహాయన అలా వెయ్యటం చాలా తేలికగా పని ముగిసింది. 

ఇలా వేస్తున్నప్పుడు తెలిసిన పెయింటర్ అటుగా వెళుతూ, చూసి, ఆగాడు. వచ్చి " నేను వెయ్యాలా అన్నా!.." అని అడిగాడు. 

" వేయు.. ఎంత తీసుకుంటావ్.." అన్నాను. 

" మూడొందలు ఇవ్వన్నా.." అన్నాడు. అప్పటికే సగం అయ్యింది. రోలర్ తో వెయ్యడం క్రొత్తగా, భలేగా అనిపిస్తున్నది. అంతా నేనే వేసుకోవాలని అనుకున్నాను. ఈరోలర్ ని చూసే - ఈ పెయింట్ వెయ్యటానికి వచ్చాడంట. అంటే రోలర్ వల్ల అంత తేలికగా పెయింట్ వెయ్యడం జరిగిపోతుందన్నమాట. తను ఉన్నప్పుడే ఒక కోటింగ్ వెయ్యటం పూర్తయ్యింది కూడా.. ఇంకో కోటింగ్ అతనికి ఎందుకివ్వాలనిపించింది. ఇచ్చి డబ్బులు ఎందుకు వృధా చేసుకోవాలనిపించింది..!! కాసేపు ఆ మొదటి కోటింగ్ ని ఆరనిచ్చాను. ఆతర్వాత రెండో కోటింగ్ ని ఇట్టే లాగించేశాను. 

అలా రెండు కోటింగ్స్ పూర్తయ్యాక - ఆ గోడ నాకైతే మరింత అందముగా కనిపించటం మొదలెట్టింది... బహుశా నేను వేశానని కాబోలు. ( ఇదంతా ఈ పోస్ట్ హెడ్డింగ్ కి సరిపోదు కానీ, జ్ఞాపకం కోసం వ్రాసుకున్నాను ) 

ఆ తరవాత కొద్దిరోజులకు ఆ గోడకి క్రిందన బార్డర్ కొట్టాలనిపించింది. అలా అయితే ఆ గోడ మరింత అందముగా కనిపిస్తుందని. ఆలివ్ గ్రీన్ ఎమల్షన్ Alive Green Emulsion కాస్త మిగిలినట్లు ఉంటే - దాన్ని వాడేసి, ఆ డబ్బాని తీసేద్దామని ఆ రంగుని ఎంచుకున్నాను. ఆ డబ్బా తీసేస్తే నాకు కాస్త స్టోరేజీ సమస్య తీరుతుంది. 

మళ్ళీ ఒక ఆదివారం ఎంచుకొని, ఆ గోడ మీద బార్డర్ లైన్ వ్రాసుకొని, ఆ రంగుని 50mm నంబర్ బ్రష్ సహాయాన పూసేశాను. అదీ రెండు కోటింగ్స్ వేశాను. ఇలాంటి వాటిని వేసేటప్పుడు - కొన్ని విషయాలు బాగా గుర్తు పెట్టుకోవాలి. అందులో ఇది ఒకటి - ఎక్కడైతే పెయింట్ పోయిందో / క్రొత్తగా వెయ్యాల్సి ఉంటుందో / మరకలతో అసహ్యముగా కనిపిస్తుందో - అక్కడ అన్నింటికన్నా ముందే ప్యాచెస్ మాదిరిగా పెయింట్ చేసుకొని, ఆతర్వాత మిగతా అంతా మొదలెట్టుకోవాలి. అలా అయితే మరింత లుక్ వస్తుంది.

ఇలా రెండు, మూడు కోటింగ్స్ అయ్యాక - ఆ పెయింట్ కొద్దిగా అంటే 50 ml. మిగిలింది. అలా మిగల్చాలి కూడా! పెయింట్ వేశాక ఎక్కడైనా మరకలుగా ఉంటే టచప్స్ Touch up కోసం అది అవసరానికి అట్టే పెట్టుకోవాలి. 

ఇదయ్యాక చాలా వారాలకు / కాదు నెలలకు - ఆ క్రింది బార్డర్ ని మార్చాలనిపించింది. ఎలా మార్చాలో, ఎలా ఉండాలో అప్పటికి ఇంకా నిర్ణయమూ తీసుకోలేదు.. జస్ట్ అనుకున్నా అంతే!. 

ఒకరోజు రాత్రి సడన్ గా ఒక ఐడియా. ఇది నా జీవితాన్ని మార్చలేదు కానీ గోడ అందాన్ని మారుస్తుంది అనుకున్నాను. ఎన్నోసార్లు క్రాస్ చెక్  చేసి, ఆలోచించా.. బాగుంటుంది అనిపించింది. ఎమ్మెస్ పెయింట్ లో అలా గీసి, రంగులేసి, చూశా.. వావ్! అనిపించింది. మరి ఇది అందరికీ నచ్చుతుందో లేదో.. అనిపించింది. 

మరోరోజు రాత్రిన ఆ ఐడియాని అప్డేట్ చేసుకున్నాను - నా ఫేస్ బుక్ గోడ Wall నా ఇష్టం, నాకు నచ్చింది వ్రాసుకుంటా, ఇష్టమైనది వేసుకుంటా.. అన్నట్లు నా గోడ నా ఇష్టం అనిపించి, ముందుకు సాగాను. ఒకవేళ బాగా రాకుంటే ? హా! ఏముంది? మరొక రంగుతో ఆ బార్డర్ ని మార్చితే సరి అని నిర్ణయించుకున్నాను.

ఆ మిగిలిన 50ml ఆలివ్ గ్రీన్ ఎమల్షన్ పెయింట్ లో కాస్త ఫాస్ట్ గ్రీన్ fast green స్టైనర్ ని కలిపి ఆ రంగుని మరింత డార్క్ చేసి, అక్కడక్కడ ప్యాచెస్ రూపములో ఆ బార్డర్ పట్టీ మీద పూశాను. అప్పటికీ మరికొద్దిగా మిగిలితే నలుపురంగు స్టైనర్ ని కలిపి, మరింత ముదురు ఆకుపచ్చగా మార్చి - అక్కడక్కడ మళ్ళీ ప్యాచెస్ మాదిరిగా వేశాను. అప్పటికి ఆ రంగు అయిపోయింది. ఆ తరవాత తెలుపు రంగు ఎమల్షన్ తీసుకొని, అందులో ఫాస్ట్ పసుపు Fast Yellow, ఫాస్ట్ రెడ్ Fast Red లను తగుపాళ్ళలో కలుపుతూ మరిన్ని రంగులని తయారుచేసి, వాడాను. కాస్త కాఫీ బ్రౌన్ కలర్ కూడా ఉంటే అదీ వాడాను. ఒక ప్యాచ్ కీ, మరొక ప్యాచ్ కీ ఆనుకోనేలా, వివిధ రంగులు కలుసుకోనేలా వేశాను. ఇక ఆరోజు అంతటితో ముగించేశాను. స్టైనర్ అంటే -  ఎమల్షన్ పెయింట్ లో మనకి కావాల్సిన షేడ్ వచ్చేందుకు కలిపే అతిచిక్కని, గాఢమైన రంగు.

దాన్ని చూసి, ఇదేమిట్రా - వీడు గోడని ఇలా రకరకాల రంగులు వేస్తూ పాడుచేస్తున్నాడు అనుకున్నారు. కొద్దిమంది నాతో అన్నారు కూడా. కానీ నేనేమీ పట్టించుకోలేదు. నాకైతే - అది పూర్తయితే మరింతగా బాగుంటుందని నమ్మకముగా ఉన్నాను.

మరో రెండు మూడు వారాల సమయం తీసుకొని తెలుపు ఎమల్షన్ లో ఎక్కువగా నలుపురంగు స్టైనర్ ని కలిపి నల్లని రంగుని తయారుచేశాను. ఆ రంగుని ఒక సన్నని బ్రష్ సహాయాన - ఆ ప్యాచెస్ ని ఒక్కొక్కటీ సేపరేటుగా ఉండేలా, బార్డర్స్ గీశాను. ఇప్పుడు మరింత అందముగా వచ్చింది. అప్పుడు దాన్ని చూసిన వారు - నన్ను అభినందించారు. నాకు మాత్రం నాకు నచ్చిన డిజైన్ ని అలా బార్డర్ గ వేసుకొని నాలోని కోరికని నేరవేర్చుకున్నానని అనిపించింది.

ఇదే ఆ గోడ గ్రాఫిటీ -





Sunday, February 12, 2017

My Creativity

ఈరోజు నుండీ నా బ్లాగులోని లేబుల్స్ Label లలో మరొకటీ చేర్చుతున్నాను. ఇన్నిరోజులూ ఆ విభాగాన్ని బాగా నిర్లక్ష్యం చేశాను. నా గురించి, నా అభిరుచుల గురించి నేను చెప్పుకోలేక పోతే ఎలా? ఎన్నో రంగాల్లో కొద్దికొద్దిగా ప్రవేశం ఉన్న నాకు వాటిల్లో - చాలా కొద్దిగా తెలిసినా, నాకున్న పనిదాహాన్ని / పని చేస్తుంటే వచ్చే తృప్తి దాహాన్ని అవి చక్కగా తీరుస్తుంటాయి. అందులోనే నాకు చాలా విజయం తాలూకు గెలుపుని ఆస్వాదిస్తుంటాను. వాటిని ఇక్కడ మీకందరికీ పరిచయం చెయ్యాలని అనుకుంటున్నాను. ఇలాంటి వాటన్నింటినీ మై క్రియేటివిటీ My Creativity అనే వర్గీకరణ లేబుల్ క్రిందన చూపించబోతున్నాను. ఇందులో నాకొచ్చిన చాలా పనులవి - చిన్నవి నుండి పెద్దవి వరకూ - (నానా చెత్తా చెదారం) ఉంటాయి. అలాగే వాటిలోన సూచనలూ కూడా ఉంటాయి.


అలాగే దానిలోనే - ఇంతకు ముందు నా బ్లాగులో పబ్లిష్ చేసిన నా క్రియేటివిటీ పోస్ట్స్ అన్నీ వీలువెంబడి చేర్చుతాను. 



Thursday, February 9, 2017

లేఖినిలో సున్నాని టైప్ చెయ్యడం

[తెలుగుబ్లాగు:22437] వత్తు ప్రక్కన సున్నా టైపు చేయడం కుదరటం లేదు, సహాయం చేయగలరు.

ఉదహరణకు 'చేయడం' లో సున్నా సులువగా టైపు చేయవచ్చు కాని 'సెల్వం' లో మత్రం వత్తు ప్రక్కన ఉన్న యెడల ఎలా టైపు చేయాలో తెలియడం లేదు. దయచేసి సహాయం చేయ మనవి. 

ధన్యవాదములు 

పై సందేహానికి నా సమాధానం..

మీరు తెలిపిన సందేహంలో " చేయడం, తెలియడం, సహాయం.. " వాటిని చాలా తేలికగా టైప్ చేసిన మీకు - చాలా మామూలుగా టైప్ చేస్తే వచ్చే selvam సెల్వం పేరు టైపు చెయ్యడంలో ఇబ్బందిగా ఉంటున్నది అంటే ఆశ్చర్యముగా ఉంది. వీవెన్ గారు మీ సందేహానికి సమాధానం ఇచ్చినా, లేఖిని వాడుక మీకు క్రొత్తగా భావించి, కాస్త పెద్దగా, వివరంగా చెప్పాలనిపించి ఈ రిప్లై ఇస్తున్నాను.. అంతేగానీ మరోలా భావించకండి. ఈ క్రింది లేఖిని తెరపట్టులో ఎర్రని వృత్తం లో చూపినది ( M ) - పదం ప్రక్కన సున్నా రావటానికి వాడే కీ. కీ బోర్డ్ మీదున్న M కీ ని వాడి మీరు అలా పదాల చివర సున్నాని వచ్చేలా చెయ్యవచ్చును. 
టైప్ చేసిన పదాలు, వచ్చిన తెలుగు పదాలని వాటి ప్రక్కనే పెద్దగా జూమ్ చేసి, బాణాల గుర్తులతో చూపించాను.. గమనించగలరు. 


అలా వత్తు ప్రక్కన సున్నా రావటానికి M మీటని వాడితే సరి. అలాంటి మరికొన్ని పదాలు ఎలా వ్రాయాలో మీకు తెలియడానికి మరికొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇస్తున్నాను. వాటిని అభ్యాసం చెయ్యండి. 
diTTam = దిట్టం, 
prEmaikyam = ప్రేమైక్యం, 
gAndharvam = గాంధర్వం, 
Arghyam = ఆర్ఘ్యం, 
kAryam = కార్యం, 
divyam = దివ్యం, 
pAnchajanyam = పాంచజన్యం.    
chEyaDam = చేయడం, 
tinaDam = తినడం, 
sahAyam = సహాయం, 
aDagaTam = అడగటం, 
kOpam = కోపం, 
SAntam = శాంతం, 
teliyaDam = తెలియడం, 
cheppaTam = చెప్పటం, 
vinaDam = వినడం..... ఇలా చాలానే ఉన్నాయి. 




Wednesday, February 8, 2017

Good Morning - 626


1% ప్రేరణ, 99% కఠోర శ్రమతోనే సాధారణ వ్యక్తులు విజేతలుగా అవతరిస్తారు. 
అంతేగా మరి! పుట్టుకతోనే మనుష్యులందరూ  సాధారణ వ్యక్తులే. ఏ కొద్దిమంది కారణ జన్ములు తప్ప అందరూ మామూలు వ్యక్తిత్వాలు ఉన్నవారే.. అలాంటివారికి - చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చును, ఏదో ఒక విషయం చాలా ప్రేరణని కలిగిస్తుంది. అది ఎంతలా అంటే - వారి జీవితమే మారిపోయి, అందుకోసమే పుట్టాడా అనుకొనేంతగా.. క్రమక్రమముగా ఎదుగుతూ ఒక గొప్ప విజేతగా ప్రపంచానికి అగుపిస్తాడు. 

వీరిని అలా మార్చటానికి వచ్చిన ప్రేరణ చాలా చిన్నదో / పెద్దదో అవొచ్చును. బహుశా అది కేవలం ఒక శాతమే కావొచ్చును. కానీ అది ఇచ్చే మానసిక బలం చాలా గొప్పది. ఆ చిన్ని ప్రేరణని తీసుకొని - చుట్టూ ఉన్న అవరోధాలను , ఆర్ధిక , సామాజిక సమస్యలను దాటుతూ  అహోరాత్రులూ , అహర్నిశలూ కష్టపడి చివరికి ఆయా రంగాల్లో విజేతగా నిలబడతారు. ఒక శక్తిగా మారతారు. ఇలాంటి వ్యక్తులనే ప్రపంచం గొప్పగా గౌరవిస్తుంది. 


Monday, February 6, 2017

పేజీ వీక్షణలు Page views

నిన్న మామూలుగానే నా బ్లాగ్ ని తెరిచా.. అప్రూవ్ చేసే కామెంట్స్ ఏమున్నాయో చూద్దామని నొక్కబోయి, Stats (Statistics) టూల్ ని నొక్కాను. ఆశ్చర్యం... నిన్న ఒక్క రోజే పేజీ వ్యూస్ Page views 600+ ఉన్నాయి. ఇంతగా పేజీ వ్యూస్ (వీక్షణలు) ని నేనెప్పుడూ గమనించలేదు. అప్పుడెప్పుడో 400+ వస్తేనే అబ్బో.. అనుకున్నాను. మామూలుగా అయితే 100 - 150 వ్యూస్ కన్నా ఎక్కువ రావు. నిన్న ఏదో అద్భుతమైన పోస్ట్ వేశాననీ కూడా కాదు. మామూలు గుడ్ మార్నింగ్ పోస్ట్ యే. సరే.. టైం ముగిసే సరికి ఎన్ని వ్యూస్ వస్తాయో చూద్దామనుకొని, బ్లాగ్ ని అప్డేట్ చెయ్యకుండా వదిలేశా.

ఈరోజు ఉదయాన బ్లాగ్ ని తెరచి - Stats ని తెరిచా.. ఆ వివరాలను చూసి, నేనే నమ్మలేక పోయాను.. 688 వ్యూస్ వచ్చాయి. నాకు తెలిసినంతవరకూ నా బ్లాగ్ కి ఇదే అత్యధిక పేజీ వ్యూస్ అనుకుంటాను. నిన్న ఆ వీక్షణలు కూడా అమెరికా నుండే ఉన్నాయి.

అందరికీ కృతజ్ఞతలు.

Sunday, February 5, 2017

Good Morning - 625


మనం చిన్నప్పుడు వ్రాసుకోవటానికి పెన్సిల్ వాడేవాళ్ళం. ఇప్పుడు పెన్ ని వాడుతున్నాం. పెన్సిల్ ని వాడుతున్నప్పుడు - మన తప్పులను రబ్బర్ తో తుడిపేసే వాళ్ళం. ఇప్పుడు అలా చెయ్యలేం.. జీవితమూ అంతే.. !

Related Posts with Thumbnails