Tuesday, October 4, 2016

Quiz


మూడు ఇళ్ళు వరుసగా ఉన్నాయి. వాటికి ఒక్కో వాచ్ మన్ చొప్పున ఉన్నారు. రాజ్  ఆ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాచ్ మన్ లకు రూ. 4 ఇచ్చి లోపలికి వెళతాడు. ఆ ఇంట్లోకి వెళ్ళగానే తన దగ్గరున్న మిగతా డబ్బులు రెట్టింపు అయ్యాయి. మళ్ళీ ప్రక్కన ఉన్న రెండు ఇళ్ళలోకి ఇలాగే వెళ్లివచ్చాడు. మూడో ఇంటినుండి బయటకు రాగానే తన వద్ద డబ్బులన్నీ అయిపోయాయి. రాజ్ దగ్గర మొదట ఎంత మొత్తం ఉందొ చెప్పండి చూద్దాం..?? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

జవాబు :
ఎలా అంటే : రాజ్ మొదట 7 ( ఏడు ) రూపాయలు పట్టుకొని వస్తాడు. మొదటి ఇంటి వాచ్ మన్ కి  రూ. 4 ఇచ్చి మిగిలిన 3 రూపాయలతో లోపలికి పోగానే, రెట్టింపు అంటే 6 రూపాయలు అవుతాయి. 
రెండో ఇంటివద్ద ఉన్న వాచ్ మన్ కి 4 రూపాయలు ఇస్తే, మిగిలిన రెండు రూపాయలు ( 6 - 4 ) తో లోనికి వెళ్ళినప్పుడు, అవి రెట్టింపు అంటే 4 రూపాయలు అవుతాయి. 
ఇప్పుడు ఆ మూడో ఇంటివద్దనున్న వాచ్ మన్ కి ఆ నాలుగు రూపాయలు ఇచ్చితే, డబ్బులన్నీ అయిపోతాయి. ఆ మూడో ఇంటి లోనికి వెళ్ళితే - తన వద్ద మిగులు డబ్బులు ఏమీ లేవు గనుక శూన్య హస్తాలతో బయటకు వస్తాడు. 


No comments:

Related Posts with Thumbnails