Thursday, March 24, 2016

Deceptive Site Ahead

నిన్నరాత్రి బ్లాగ్ లో పోస్ట్ పెడదామని బ్లాగ్ ని గూగుల్ క్రోమ్ నందు ఓపెన్ చేశాను. అలా ఓపెన్ అయ్యి, వెంటనే ఈ క్రింద ఎరుపురంగులో ఉన్న తెరపట్టు Screen shot కనిపించడం మొదలెట్టింది. అది సెక్యూరిటీ ఎర్రర్ / కాషన్ నోటీస్. 


నా బ్లాగ్ అగ్రిగేటర్స్ అయిన మాలిక ఆర్గ్. మీద సైబర్ దాడి జరిగిందనీ, ఆ సైట్ నుండి మీ బ్లాగ్ విషయాలు, డేటా దొంగిలించవచ్చన్న ఊహతో గూగుల్ క్రోమ్ వారు అలా నా బ్లాగ్ తెరచుకోకుండా చేశారు. వేరే సైట్ నుండి చక్కగా ఓపెన్ అయ్యింది. సరే.. అంతా మన మంచికే అనుకొని, నా బ్లాగ్ వైపు రాలేదు. రాత్రి పన్నెండున్నరకు ఒకసారి మళ్ళీ బ్లాగ్ ని తెరచి చూశాను. చక్కగా తెరచుకుంది. కానీ అప్పటికి అప్డేట్ పోస్ట్ పెట్టాలన్న మూడ్ లేక ఊరుకున్నాను.

ఇలా జరగటం అన్నది - దాదాపు పది సంవత్సరాల బ్లాగర్ గా ఉన్న సమయములో ఇదే మొదటిసారి. ఎన్నడూ ఇలా ఇబ్బందిని ఎదురుకోలేదు. మిగతావాళ్ళకు కూడా తెలియాలని ఇలా బ్లాగ్ లో పోస్ట్ గా పెడుతున్నాను. 

2 comments:

Zilebi said...



మాలిక సైట్ మీద సైబర్ దాడి జరిగిందా !

జిలేబి

Raj said...

అవుననే అనుకుంటాను.. క్రోమ్ వారు అలా మెస్సేజ్ పెట్టారు కదా..

Related Posts with Thumbnails