Monday, January 4, 2016

Good Morning - 598


నిజమైన ప్రేమలోనే కోపాలెక్కువ. తాపాలెక్కువ. షరతులూ ఎక్కువే.. వాటిని అర్థం చేసుకున్న వారికన్నా తట్టుకోలేక విడిపోయి వెళ్ళిపోయే వారే ఎక్కువ.. 

అవును కదూ..! నిజమైన ప్రేమ అన్నాక - అందులో ఎదుటివారిది అంటే తనవారిది ప్రతీది నాకే చెందాలి. అవన్నీ నా స్వంతమన్న భావన బలీయముగా ఉంటుంది. ఫలితముగా ఎదుటివారి మీద కోపతాపాలు చూపిస్తారు. నీవు ఇలా ఉండాలి.. అలా ఉండాలి అంటూ ఎన్నెన్నో షరతులనూ విధిస్తుంటారు. కానీ అవన్నీ అవతలివారికి విసుగ్గా ఉన్నా, కేవలం వీరి ప్రేమ మీద వల్ల పాటిస్తుంటారు ( అలాని నటిస్తుంటారు ). ఇలాకాకుండా వారి ప్రేమని అర్థం చేసుకొని, వారి మీద గౌరవంతో వారు చెప్పిన షరతులను పాటించేవారు చాలా కొద్దిమంది ఉంటారు. కానీ మిగతా వారందరూ తాము ప్రేమించిన వారిని - ఈ షరతులూ, కోపాలూ, తాపాలు తట్టుకోలేక విడిపోయి, దూరముగా ఉంటారు. ఇలా ఉండటం కేవలం ప్రేమలోనే కాదు - స్నేహాలలోనూ జరుగుతుంది. 



No comments:

Related Posts with Thumbnails