Wednesday, October 14, 2015

కర్ర సుత్తె కొనుగోలు

నిన్న మార్కెట్ కి వెళ్లాను.. చాలాకాలంగా అనుకుంటున్న రిపేరింగ్ పరికరాలను కొనడానికి, వీలు చేసుకొని మరీ వెళ్ళాను. పేరెన్నిక గల హార్డ్ వేర్ షాపులో అడిగితే - ఎదురుగా, రోడ్డు అవతలి వైపున రెండో గల్లీలో దొరుకుతుందని చెప్పాడు. రోడ్డు క్రాస్ చేసి, ఆ గల్లీలోకి వెళ్ళాను. ఆ గల్లీలో మొదట ఉన్న సామానుల కొట్లలో అడిగాను.. లేవన్నారు. మూడో కొట్టతను - అలా వెళ్ళి కుడి వైపున్న గల్లీలోకి, వెళ్ళి అడగండి. అక్కడ చాలా దొరుకుతాయన్నాడు. అయినా నమ్మక ఇంకో దుకాణంలో అడిగితే - ఎదురుగా ఉన్న ఫుట్ పాత్ మీదున్న దుకాణాన్ని చూపి, అక్కడ అడగండి.. అన్నాడు. ఓ పాటి కొట్లలోనే దొరకలేదు ఇక ఈ ఫుట్ పాత్ మీదున్న షాప్ లో దొరుకుతుంది అని అనిపించలేదు. కానీ వాస్తవ జీవితాన - ఇక్కడ / వీరితో పని కాదు.. అని అనుకున్నానో అక్కడే నా పని జరిగింది.. వేరే వారి / నేను పని అవుతుంది అనుకున్న వారి వద్ద కన్నా. నమ్మకున్నా అది నిజం. అప్పటి నుండి చిన్నవని చులకన చెయ్యడం మానాను.

ఆ ఫుట్ పాత్ షాప్ వైపుగా అడుగులేశాను. అక్కడ ఎండలో ఉన్న అతన్ని అడిగా.. ఉన్నాయని చెప్పాడు.

" మరి ఇక్కడ లేవుగా.." అని అంటే - తనతో రమ్మంటూ కొద్ది దూరములో ఉన్న షాప్ కి తీసుకెళ్ళాడు. అది తన షాపే. కానీ అది కొద్ది లోపలిగా ఉండటం మూలాన ఎవరి దృష్టికీ రాకపోయేసరికి అలా రోడ్డు మీదకి ఫుట్ పాత్ షాప్ గా పెట్టుకోవాల్సి వచ్చింది.

అక్కడ నాలుగైదు కర్ర సుత్తెలు Wood hammers  చూపించాడు. అవి అంత బాగా లేవు.. వర్క్ నీటుగా లేదు. ఏదో మామూలు కర్రతో చేసినట్లున్నాడు.. చెక్కలో బాగా పగుళ్ళు ఉన్నాయి. ఆ సుత్తెని కొట్టడానికే వాడుతాం. అప్పుడు ఆ పగుళ్ళు పెద్దవయ్యి, ఎలాగూ పగిలిపోతుంది. యధాలాపముగా రేటు అడిగితే రెండు వందలు చెప్పాడు.. బేరం చేస్తే వందకి వచ్చాడు. ఒకే!.

" భయ్యా! ఈ సుత్తెలకి వాడిన కర్ర బాగోలేదు.. వేరే ఉంటే చెప్పు.. తీసుకుంటాను.." అన్నాను.

" మీరు ఇక్కడే ఉండండి.. ఇప్పుడే తెస్తానంటూ.." ఎదురు షాప్ వాడి సైకిల్ తీసుకొని వెళ్ళాడు.. నేను నా ఫోన్ లో ఒక కాల్ మాట్లాడా అంతలోగా.. అప్పటికీ రాలేదు.. ఇక లాభం లేదనుకుంటూ ఎదురు షాప్ వద్ద వెయిట్ చేశా.. ఊహు.. రాలేదు.. వేరే షాపుల వద్ద బయట ఉన్న సామానులని, అవి చేసే పనుల్నీ ఆలోచిస్తూ ఉన్నాను.. అప్పుడు వచ్చాడు చేతిలో మూడు చెక్క సుత్తెలతో. అలాగే వళ్ళంతా చెమటలతో..

తెచ్చిన మూడు సుత్తెలూ చాలా బాగున్నాయి. కర్ర బాగుండటంతో వర్క్ చాలా నీటుగా, స్మూత్ గా ఉండి, జిట్టి రేగు కర్ర లుక్ వచ్చింది. అందులో బాగున్నది చూసి, ఒకటి తీసుకొని డబ్బులు ఇచ్చాను. ఆల్రెడీ నాకున్న చాలా చాలా అభిరుచులకి తగినట్లుగా ఆరేడు సుత్తెలు నా వద్ద ఉన్నాయి, ఇంకో మూడు నాలుగు  ( రబ్బరు, Polypropylene (PP), పశువుల కొమ్ముతో చేసినవీ...) కొనాలి. వాటితో ఒక్కో అవసరానికీ ఒక్కోదానితో పని ఉంటుంది. అవి వాటితో చేస్తేనే మరింత బాగా పని అవుతుంది. 

కాసేపు అవీ ఇవీ మాట్లాడి వచ్చేశాను. ఈమాత్రం దానికి ఇంత పోస్ట్ వ్రాయాల్సిన అవసరం ఏముందా అని మీకు అనిపించవచ్చు. అక్కడ నేను చూసింది - తన దగ్గర ఉన్న సుత్తెలు బాగున్నా, నేను బాగోలేవని రిజెక్ట్ చెయ్యడం, వచ్చిన కస్టమర్ ని పోగొట్టుకోనేందుకు ఇష్టం లేక - సైకిల్ త్రోక్కుకుంటూ వెళ్ళి, వంటి నిండా చెమటలతో వచ్చినప్పుడే గమనించాను.. కష్టపడే మనస్థత్వం, ఎలాగైనా వస్తువు అమ్మి డబ్బులు సంపాదించాలీ అనే తాపత్రయం.. అతనికి నేనిచ్చే డబ్బులతో అవసరం చాలానే ఉంది అని కూడా.. అన్నింటికన్నా మించి వాటికన్నా ఇప్పుడు తెచ్చిన కర్ర సుత్తెలు మరింతగా బాగున్నా ముందు మాట్లాడిన రేటుకే ఇవ్వడం - నాకు బాగా నచ్చింది. వేరే వారు అయితే అది స్పెషల్ క్వాలిటీ అనో, హ్యాండ్ ఫినిషింగ్, మిషన్ స్మూతింగ్ అనో, బర్మా టేకు కర్ర అనో, నాకు ఇచ్చిన వారు ఇంత చెప్పారు అనో ఏమాత్రం అనలేదు.. పక్కా వ్యాపారస్తుడిలా అలా చెయ్యకపోవడం నాకు మరింతగా నచ్చి, ఈ పోస్ట్ వ్రాయడానికి కారణం అయ్యింది.







No comments:

Related Posts with Thumbnails