సంద్రం తీరాన్ని కోస్తున్నదని ఎవరికీ కనపడదు.
సాగర ఘోషలో నీ కాలి క్రింది తీరం ఆర్తి నీకు వినపడదు.
పువ్వుని చూస్తే చాలు.
ముల్లుకి అంటిన రక్తం అవసరం లేదు.
ఒక్కసారి మాటలాడు చాలు - ప్రేమించక్కరలేదు..
తనని విడిచి వెళ్ళిన ఎంతటి ప్రేయసి కోసం ఎంత హృదయ వికారముగా తన భావనని వెలిబుచ్చాడు ప్రియుడు.. చాలా లోతుగా, సరళంగా తన బాధని వెలగ్రక్కాడు.
సముద్రం తీరాన్ని తన అలలతో కోస్తుంది. అది ఎవరికీ కనపడదు.. అంత నెమ్మదిగా తీరాన్ని కోసేస్తూ ఉంటుంది. కడలి చేసే శబ్ద హోరులో - నీవు నిలబడ్డ ఆ సముద్ర తీరం యొక్క తపన ఏమిటో వినపడదు. అంటే ఇక్కడ నా బాధని వెలగ్రక్కుతున్నా - నీవు పొందే ఆనందాల ముందు నాది అలాగే ఉందంటూ ఎంతటి అందమైన పోలికని చెప్పాడు. అలాగే పువ్వుని చూస్తే చాలు - ముల్లుకి అంటిన రక్తం అవసరం లేదు. వావ్!.. కేవలం తనని ఒక్కసారి చూస్తే చాలును కానీ, నా రూపం, నా బాధలు, కష్టాలు... ఏమీ చూడాల్సిన అవసరం లేదు అని చెబుతున్నాడు. నను ప్రేమించకున్నా సరే! ఒక్కసారి మాట్లాడు - తనని ప్రేమించకున్నా సరే గానీ, ఒక్కసారి తనతో మాట్లాడితే చాలునట.. అలా చేస్తే తన బాధ పోతుందేమో.. ఎంత చక్కగా, సముద్రమంతటి లోతుగా అర్థవంతంగా చెప్పాడో కదూ..
No comments:
Post a Comment