Saturday, September 26, 2015

నీ మీద ఇలా అన్నారు తెలుసా..?

మా ప్రక్కన ఉండే ఒక అబ్బాయి నాదగ్గరికి వచ్చాడు. అప్పుడు నా పనులల్లో బీజీ ఉన్నాను. తను రావటంతో చేసే పనిని ఆపి, సాదరముగా ఆహ్వానించాను. అసలు తానెప్పుడూ అలా రాడు... ఎందుకు, ఏం పని మీద అలా నా వద్దకి వచ్చాడో తెలీకున్నా లోనికి ఆహ్వానించాను. 

కాసేపు అవీ ఇవీ మాట్లాడాడు.. నేను అనుకున్నా - ఏదో " బాగానే " జరిగేట్టుగా ఉందనీ. అయినా మామూలుగా మాట్లాడుతూ కూర్చున్నాను. 

మధ్యలో ఏదో విషయం మీద టాపిక్ మళ్ళింది. 
నా సమాధానం నేను చెప్పాను. 
కాదు.. నాకు తెలీదన్నాడు.. 
" నాకు తెలీదు కదా.. మరి ఏమిటో నీవో చెప్ప"మన్నాను. 
తను చెప్పాడు. 
ఆ చెప్పిన దాంట్లో ఎలా లోపాలు ఉన్నాయి, తన ఆలోచన విధం ఎలా తప్పో చెప్పసాగాను. 

కానీ, మధ్యలోనే నా మాటల ప్రవాహానికి అడ్డు వచ్చాడు.. వచ్చి - "... అందుకే నిన్ను అందరూ అదోలా అనుకుంటారు. నీ మీద ' మస్తుగా ' ఏవేవో చెబుతారు.. అవి గనుక నేను చెబితే వినలేవు..." అన్నాడు.. నాకేదో మేలు చెయ్యబోతున్నట్లు. 

" ఒకే! అనుకోనీ.. అది  వాళ్ళ ఖర్మ.. అయినా ఈ లోకంలో ఒకరి మీద ఒకరు అనుకోనిది ఎవరున్నారు? అందరూ అలా ప్రతి ఒక్కరి మీద ఏదో విమర్షిస్తూనే ఉంటారు. అలాంటి వాటిల్లో ఆధారాలు ఉండి, నిజ పరీక్షకి తట్టుకోనేవి చాలా తక్కువ.. ఈరోజు నన్ను అలా అంటారు.. అలా దూరముగా బండి మీద వెళుతున్న వారి మీద కూడా అంటారు. ఆ (రోడ్డు మీద ) వస్తున్న ఇద్దరి ఆడవారిని చూస్తూ కూడా అసహ్యముగా ( వాళ్ళు "అలాంటి"వారు అనీ ) కూడా అంటారు. నరం లేని నాలుకనాయే.. చాటుగా అనడం కాదు.. ముందుకొచ్చి - ధైర్యముగా అనే ధైర్యం ఉంటే అనాలి. అప్పుడు మెప్పులు వస్తాయో, లేక చెప్పులు తెగుతాయో తెలుస్తుంది. మళ్ళీ జన్మలో అలా మాట్లాడడానికి భయపడతారు.. 

అయినా నామీద అలా మాట్లాడిన వారే నీమీద మాట్లాడారాని నీకు తెలుసా?? బహుశా తెలీకపోవచ్చు.. గాలికి ఏదో మాట్లాడగానే అవే నిజాలు అని ఎన్నడూ అనుకోకు.. అలా చెప్పిన వాటినే నమ్మి - ఏదేదో ఊహించుకొని - వాటినే ప్రచారం చేస్తూ అందరిలో చులకన కాకు.. ఇలా నీవు చెప్పావ్.. అని వారికి తెలిస్తే? వారికి ఎందుకు తెలీదు. ?? ఇటు చెప్పిన వారే అటూ చెబుతారు.. వాడు మొన్న నీ మీద ఇలా అన్నాడు అనీ.. వాళ్ళు నీమీదకి వస్తే అప్పుడు నీకుంటుందీ - సూపర్ బజ్జింగ్.." 

మధ్యలో తను కల్పించుకుంటూ " నాకు తెలుసు అటూ ఇటూ చెబుతారనీ.." అన్నాడు. 

" మరి తెలిసాక ఎందుకు అన్నావ్..? నావిషయం పోనీ..! నేనెలాంటి వాడినో నా ఆత్మకి తెలుసు. వాళ్ళ మాటలూ ఏమనో కూడా తెలుసు. చాతకానివారు, లైఫ్ అంటే ఏమిటో తెలీనివారు వాళ్ళు. అదలా కాసేపు ప్రక్కన ఉంచుదాం. మరి - నీ మీద వాళ్ళు ఏమని చెప్పారో ఇప్పుడు చెప్పాలా? వింటే తట్టుకొనే శక్తి నీకుంటే - చెప్పు - అని ఒకేఒక్క మాట అను. చెబుతా.. విన్నాక జీవితాంతం ఈవిషయమై ఎందుకు వీడిని కెలికానురా.. అని కుములుకొని కుములుకొని చస్తావ్..! అవి విన్నాక జరిగే పరిణామాలకి నేను బాధ్యుడని కాను.. ఏవైనా గొడవలు వస్తే - నాకు సంబంధం లేదు.. ముందే చెబుతున్నా.. మరి చెప్పమంటావా?? " అన్నాను. 

( వాడొక శాడిస్ట్.. పెళ్ళాన్ని మానసికముగా చిత్రహింసల పాలు చేసిన వాడు.. గృహహింసా చట్టం క్రింద వాళ్ళావిడ అతనిమీద కేసు కూడా పెట్టింది.. అది కొనసాగుతూనే ఉంది కూడా.. ఇలా చాలానే ఉన్నాయి.. అయినా వద్దు. మనకనవసరం..

అలా అనగానే - అతనిలో సెల్ఫ్ డిఫెన్స్ మొదలయ్యింది.. " అలా కాదు కాకా! నాకూ తెలుసు.. నీమీద అలాని చెప్పిన వారే నామీద నీకు కూడా చెబుతారని తెలుసు.." 

" మరి అంతగా తెలిస్తే - ఆ టాపిక్ ఎందుకు తీశావ్? ఏమైనా దురదగా ఉందా? నాకూ దురదగా ఉంది. మాట్లాడేది ఒక టాపిక్. వీలైతే దాని మీదే మాట్లాడు. సబ్జెక్ట్ నాలేడ్జీ ఉంటేనే ఆ విషయమై మాట్లాడు.. లేకుంటే మూసుకో.. నా పర్సనల్ విషయాలు ఆ టాపిక్ లో చర్చించేది లేవుగా.. సడన్ గా నావిషయం ఎందుకు వచ్చింది.? టాపిక్ ని అలా డైవర్ట్ చేసేవారే మాట్లాడే గట్స్ లేనివాళ్ళు. చాతకాకపోతే ఊరుకో.. ఉన్న బంధాలని కూడా పాడు చేసుకోకు.. ఎవడో దిక్కుమాలిన వెధవ ఏదో అంటే - నీవు దాన్ని మోసుకొచ్చి, నాతో చెప్పాలని చూస్తావా? వాడూ, నీవూ పోయి గంగలో దుంకండి.." అని అన్నాను. 

అతనేమనుకున్నాడో తెలీదు.. వెంటనే లేచి, వెళ్ళిపోయాడు. 

ఇలాంటివారు మన మధ్య చాలానే మంది ఉన్నారు. వారికి వారి స్వవిషయాలు చూసుకొనే ఓపిక లేదు కానీ, వేరేవారి విషయాలు అమ్మలక్కలు చెప్పుకొనే ఊబుసుకుపోని కబుర్లు చెప్పుకొని ఆనందించడం అలవాటయ్యింది. కాస్తంత తగ్గామా!.. ఇక మన పని గోవిందా...  


No comments:

Related Posts with Thumbnails