ఈమధ్య నేనొక కథ చదివాను.. ఆ కథ నన్ను ఎంతో ఆకట్టుకుంది. అందులో కొన్ని మార్పులు చేసి, మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఈ కథ ఒరిజినల్ రచయిత (త్రి) ఎవరో తెలీదు. వారికి కృతజ్ఞతలు.
******************
ఓ కుర్రాడు కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు. ఎంత కోపంతో వచ్చాడంటే - తను చూసుకోలేదు తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకువచ్చేశాడనీ.. కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు - కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో..? అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటి నుండి బయటికి వచ్చేశాడు.
చాలా డబ్బు సంపాదించాక గానీ ఇక ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. ఇంటి నుండి వచ్చేప్పుడు కోపం కొద్దీ - ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు కొట్టుకోచ్చేశాడు. అమ్మకి కూడా తెలియకుండా రాసే "సంగతులూ", లెక్కలన్నీ దాంట్లోనే ఉంటాయని అతడి నమ్మకం.
నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది. క్రింది పాదాన్ని ఏదో కరుస్తూ ఉన్నట్టు ఉంది. బూటు లోపల సాఫ్ట్ గా లేదు. మడమ నొప్పెడుతోంది. అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యలేదు. లోపల తడితడిగా అనిపించింది కాలు ఎత్తి చూశాడు.. బూటు అడుగున చిన్న కన్నం. ఇందాక బురదలో చూసుకోకుండా అడుగేశాడు. అందులోంచి బూటు లోకి బురద నీళ్ళు వచ్చాయి. అలాగే కుంటుతూనే ఎటైనా వెళ్లిపోదామని బస్ స్టాండ్ వచ్చాడు.
విచారణలో వాకబు చేస్తే తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని.. సరే ఏంచేస్తాం!. అని అక్కడే సిమెంట్ దిమ్మ మీద కూర్చున్న అబ్బాయి - ఏమి చెయ్యాలో తోచక తను పట్టుకొచ్చేసిన - నాన్న పర్సులో ఏముందో చూద్దామని ఆ పర్సు తెరిచాడు ఈ కుర్రాడు. అందులో కొన్ని కాగితాలు, రసీదులూ ఉన్నాయి.
.
.
ఆఫీసులో రూ. 40,000 అప్పు తీసుకున్న లోన్ రశీదు,
కొడుకు కోసం కొన్న లాప్ టాప్ బిల్లు,
అఫీసుకు వచ్చేటప్పుడు శుభ్రమైన బూట్లుతో రమ్మని మేనేజర్ ఇచ్చిన మెమో..
మీ పాత స్కూటర్ తెండి – కొత్త మోటార్ సైకిల్ తో వెళ్ళండి. గొప్ప ఎక్చేంజ్ మేలా అని రాసి ఉన్న కరపత్రం.
ఇవీ కనబడ్డాయి కుర్రాడికి తండ్రి పర్సులో.. వాటిని చూసాక ఈ కుర్రాడి కళ్ళు చెమర్చాయ్. ఆ లాప్ టాప్ తనకే నాన్న కొనిచ్చాడు. వెంటనే ఇంటికి పరుగు పెట్టాడు. సోల్ (బూట్ల అడుగు భాగం) లేని ఆ బూట్లు ఈసారి నొప్పి కలిగించలేదు. వచ్చి, ఇళ్లంతా వెతికాడు.. కానీ ఇంట్లో నాన్న లేడు. స్కూటరూ లేదు. అమ్మని అడిగాడు. నాకేమీ చెప్పకుండా స్కూటర్ ని తీసుకొని వెళ్ళాడు.. అంది.
అతడికి తెలిసిపోయింది.. నాన్న తన స్కూటర్ తీసుకొని ఎక్స్చేంజ్ మేలాకు వెళ్లాడనీ..
రూపాయి రూపాయి కూడబెట్టుకొని, చాలీ చాలని తిండి తిని, జబ్బు పడినా వైద్యం చేయించుకోక - అలా మిగుల్చుకున్న డబ్బులతో కొని, ఇప్పటికీ క్రొత్త బండిలా ఉండి, అతి ప్రేమగా చూసుకుంటున్న తన స్కూటర్ ను అక్కడిచ్చి - తన కోసం బైక్ తేవడానికే ఖచ్చితంగా వెళ్లాడనీ…
ఆ కుర్రాడి కళ్ళు చెమరుస్తున్నాయి... కళ్ళల్లో నుండి ధారాళంగా కన్నీరు కారుతూనే ఉన్నాయి. అలాగే పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్ళాడు. వాళ్ల నాన్న అక్కడే ఉన్నాడు. ఎక్స్చేంజ్ షాపు కుర్రాడితో " ప్రస్తుతం యూత్ కి బాగా ఇష్టమైన మోడల్ బైక్ ఏదో చూపించు.. దాని మీద నా కొడుకు హీరోలా ఉండాలి.." అని నవ్వుతూ, గర్వముగా ఆడుగుతున్నాడు.
వెనకాలే నిల్చుని తండ్రి మాటలు వింటూ మౌనముగా ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడసాగింది.
అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూసాడు. ఆ అబ్బాయి తన నాన్నని కౌగిలించుకొని ”వద్దు నాన్నా! వద్దు నాన్నా! నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్నా.. మీకు చాలా ఇష్టమైన మీ స్కూటర్ ని అమ్మేసి, నాకు బైక్ ఇప్పిస్తే - దాని మీద నేను సంతోషముగా తిరగలేను నాన్నా!.. ఇప్పటివరకూ నాకు చేసిన త్యాగాలు చాలు. మీ తహతుకి మించి చేసిన అప్పు చేసింది చాలు. ఆఫీసులో ఎన్ని మాటలు పడ్డా - షూస్ కూడా కొనుక్కోకుండా ప్రతి మిగులు పైసా నామీద వెచ్చిచింది చాలు.. ఇక చాలు నాన్నా!! " అంటూ ఏడవసాగాడు.
ఆ నాన్న తనని గట్టిగా హత్తుకున్నాడు.. ఆ కౌగిలిలో ఇక నా కష్టాలు తీరబోతున్నాయనీ, నా కొడుకు ఒక ప్రయోజకుడు అవబోతున్నాడనీ, అర్థం చేసుకొనే మంచి మనసున్నవాడనీ, అంతకు మించి - జీవితాన గొప్పవాడు అయ్యేందుకు పునాది ఏర్పడింది అనీ.. ఎన్నో అర్థాలు.
ఇంటికి వెళుతూ వెళుతూ - తండ్రి కోసం కొత్త షూస్ కొనేలా మారాం చేసి, ఇప్పించాడు ఆ అబ్బాయి.
మీకోసం
తన జీతాన్నే కాదు -
జీవితాన్నీ దారపోసి..
సర్వస్వాన్నీ సమర్పించిన ఆయన త్యాగాన్ని గుర్తించండి.
బంధాన్ని గౌరవించండి !!
మనసారా ప్రేమించండి.
సుఖమయ వస్తువులే జీవితం కాదు - అవి ఈరోజు ఉంటాయ్.. రేపు పోతాయ్.
కానీ నాన్న - మన జీవితం.
మన జీవితానికి పునాది.
ఈరోజు కనీసం ఇలా ఉన్నామంటే కూడా తన చలవే..
నాన్నని అర్థం చేసుకోని ఏ పిల్లలైనా - క్షమార్హులు కానే కారు.
******************
ఫోటోని సందర్భముగా తీసుకోవడమైనది. స్వంతదారులకు కృతజ్ఞతలు.