http://achampetraj.blogspot.in/2015/07/1.html తరవాయి..
..అలా మా పుష్కర స్నానాలని ముగించుకొని, తిరుగు ప్రయాణం మొదలెట్టాం. అక్కడ చుట్టూ రౌండ్ వేశాం. ఎలా ఉంది? జనం ఎంత వచ్చారు? ఏమైనా విశేషాలు ఉన్నాయా? అనీ.. వాల్మీకి గుహ కనిపించింది. వెళదామని అనుకున్నాము.. కానీ అక్కడా రద్దీ. వెళితే తిరుగు ప్రయాణం ఇంకా ఆలస్యమవుతుంది. మళ్ళీ ఎపుడైనా చూడొచ్చు అని అనుకొని వచ్చేశాం. మేము వచ్చే దారి ఏదో తెలుసుకొని, ఇక 4:30 p.m కి తిరుగు ప్రయాణం మొదలెట్టాం. అప్పటికి అక్కడ ఏమైనా తిందామా అని అనుకుంటే - తినే సమయం దాటిపోవడం & సమయాభావం వల్ల ఆగిపోయాం..
గోదావరి వంతెన మధ్యకు రాగానే, ఓ ప్రక్కగా బండిని అపాను. జేబుల నుండి చిల్లర డబ్బులు తీశాను. నాకొకటి, పిల్లలకు చెరొక్కక్కటీ ఇచ్చాను. భక్తిగా మ్రొక్కుకొని, నదిలోకి వేశాను. నన్ను చూసి, నా పిల్లలూ అలాగే గోదావరి నదిలోకి చిల్లర డబ్బులు వేశారు. ఇలా ఎందుకు వేశారు? ఎందుకు వెయ్యాలి అలా?? అని అడిగారు. " నా చిన్నతనంలో - మిత్రులతో ఇదే బాసరకి రైల్లో వచ్చినప్పుడు - రైల్ బ్రిడ్జి మీదకి రాగానే - చాలా నెమ్మదిగా వెళ్ళేది. అప్పుడు రైలు బోగీల తలపుల వద్ద నిలబడితే - మనం ఆ నదిమీద అలా గాలిలో నిలబడి ఉన్నామా అన్నట్లు అగుపించి, ఒళ్ళు జలదరించేది. ఆ అనుభూతిలో మేముండగా మా వెనకాల నుండి ఎంతోమంది తోటి ప్రయాణీకులు చిల్లర డబ్బులని మ్రొక్కి, ఆ నదిలోకి విసిరేసేడివారు. అలాచేస్తే కోరుకున్నవి నెరవేరుతాయని ఒక నమ్మకం. అదే నాకు తొలి అనుభవం. వింతగా, క్రొత్తగా అనిపించింది అప్పుడు. అప్పట్లో మాకు అదో ఆచారం, ఒక నమ్మిక. ఆ అనుభవాన్ని మీరు కోల్పోకూడదు, మీకూ ఉండాలని అలా మీతో చేయించాను.. ఇక ఆ చిల్లర డబ్బుల కోసమని కొందరు రైలు వచ్చే సమయానికి పడవలలో ఆ వంతెన క్రిందకి వచ్చేసి, స్పీకర్స్ వెనకాల ఉండే అయస్కాంతాలు జమచేసి, వాటన్నింటికీ ఒక త్రాడు కట్టి, ఆ నదిలో వేసిన చిల్లర డబ్బులని తీసుకొనే వారు. ఇప్పుడు అలా కనిపించడం లేదు.. అదొక మరపురాని జ్ఞాపకం.." అని చెప్పాను. మళ్ళీ ప్రయాణం మొదలెట్టాం.
ఇలా మేముండగా - అదే వంతెన మీద అవతలి వైపున ప్రక్కనే అప్పుడే ఒక కారు టైర్ పంక్చర్ అయ్యింది. స్టెప్నీ టైర్ తీసి, మార్చబోతున్నారు. నడి వంతెన మీద అలా అయ్యేసరికి - వేరే దారిలేక - అలాగే ఆ దారిలో ఒకేవైపు క్యూ కట్టాయి. మేము ప్రయాణం చేస్తూ ఆ క్యూని గమనించాం. ఆ క్యూ ఇప్పట్లో కదలదు.. అని నాకర్థం అయ్యింది. ఆ క్యూ ఆపాటికే ఐదారు కిలోమీటర్లకు పైగానే ఉంది. కాసేపట్లో అయితే - మరీ ఎక్కువ అవుతుంది ఆనుకున్నాం.
పదిహేను కిలోమీటర్ల దూరం వచ్చాక, ఒక మామిడితోట కనిపించింది. అందులో కాస్త రెస్ట్ తీసుకోవాలనిపించింది. పనిలో పనిగా - తీసుకొన్న ప్రసాదాల్లో ఒక లడ్డూ, రెండు పులిహోరలూ తినేశాం. ఆ తర్వాత మా అమ్మాయి డ్రైవింగ్ చేసింది. ఇలా ఇద్దరు డ్రైవర్స్ ఉంటే - లాంగ్ డ్రైవ్ బోర్ కొట్టదు. అసలు స్కూటీని అలా లాంగ్ డ్రైవ్ కి ఎన్నుకోవడం గల కారణాల్లో ఇదీ ఒకటి. మధ్యలో ఆగుదామని అనుకున్నాం కానీ అన్ని హోటల్స్ బీజీయే. కారణం : విపరీత జనం. రెండురోజులు వరుసగా సెలవుదినాలుగా రావటంతో - పుష్కరాలకు వచ్చిన రద్దీ జనం.. ఇక ఎక్కడా ఆగకుండా ప్రయాణం మొదలెట్టాం.
టోల్ గేట్ల వద్దా విపరీతమైన వాహనాల క్యూలు. మా ప్రక్కగా సెకనుకొక వాహనం వెళుతున్నట్లు అనిపించింది. నా జీవితంలో ఒక హైవే మీద అంత ట్రాఫిక్ రద్దీ చూడటం అదే ప్రప్రథమం. మద్యలో సన్నగా వర్షం తుంపర్లు. అలాగే తడుస్తూ వెళ్ళాం. అదీ కాసేపే. అవన్నీ చూస్తుంటే - బస్, రైలు, కారు కాకుండా టూ వీలర్ మీద వెళ్ళి రావడం చాలా నయమైంది. టోల్ గేట్స్, రోడ్డు మీదా, పుష్కరాల వద్దా హాయిగా, చిన్నచిన్న సందుల్లో కూడా హాయిగా వెళ్ళాం. అన్నింటికన్నా మించి ఎక్కడా ట్రాఫిక్ రద్దీలో ఇరుక్కపోలేదు. ఎక్కడైనా అలా ఉన్నట్లు అనిపించినా ప్రక్కగా వేరే దారి చూసుకొని, అందులోంచి బయటపడ్డాం. టూర్ లకి వెళ్ళివచ్చిన వారి అనుభవాలు విన్నాక చాలావాటికి బైక్ మీద వెళ్ళడమే బెస్ట్ అనిపించింది. అందుకే లాంగ్ డ్రైవ్స్ కి బైక్స్ మంచి సాధనాలు అని చెప్పటం. ఎక్కువగా వాటి మీదే వెళ్లడం ఇష్టం. ఆరోజు మోటార్ బైక్ మీద వెళ్లాను కాబట్టి హాయిగా, సంతోషముగా, నేను అనుకున్నట్లుగా, ఎవరి వల్లో ట్రాఫిక్ ఇరుక్కపోక హాయిగా వెల్లోచ్చాను. అందులకు చాలా చాలా సంతోషముగా ఉంది.
ఇంకో యాబై కిలోమీటర్లు వెళితే ఇంటికి వెళతాను అన్నప్పుడు - ఒక పెద్ద పట్టణం కనిపిస్తే - అక్కడికి వెళ్ళాం. మావాడికి చెప్పులు కొన్నాం. అదొక 300 రూపాయల ఖర్చు. వెంట - ఒక రూపాయికి వచ్చే ఒక చిన్న సుతిలీ త్రాడుముక్క తీసుకెళ్ళి, చెప్పుల్ని ఒక దగ్గరగా కట్టకపోయేసరికి - పోయిన చెప్పుల తాలూకు అయిన అదనపు వ్యయం అది.
ఎలాగూ ఆగాం.. పనిలో పనిగా భోజనం చేద్దామని అక్కడ ఉన్న మంచి హోటల్ కి వెళ్ళాం. అక్కడ ఆరోజు స్పెషల్ - నాటుకోడి చికన్ బిర్యానీ. రేటు 110. ఆరోజు రంజాన్ కావటంతో ఉదయాన్నుండీ అదే నడిచిందంట. సో, ఇప్పుడు లేదు అని జవాబు.. ఏంచేస్తాం.. వేరేవి ఆర్డర్ చేశాం. ప్రొద్దున నుండీ ఏమీ తినని మేము ఆ కమ్మని, వేడివేడి ఆహారాన్ని ఆవురావురుమంటూ ఫుల్ గా లాగించాం. అప్పటికే రాత్రి తొమ్మిది కావొస్తున్నది. ఇంకో యాభై కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడ నుండి బయలుదేరాం.
నేషనల్ హైవే లో కలిసేటప్పుడు - అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. అది చూసుకోలేదు. క్రిందన ఫట్ మని చప్పుడు.. నా ప్రక్కన నుండి వచ్చిన ఇంకో బైక్ అతను - ఏదో పగిలింది.. సైలన్సర్ కి తాకినట్లు ఉంది చూసుకోమన్నాడు. ఆ శబ్ధమేదో నాకు తెలుసు.. సెంట్రల్ స్టాండ్ కి ఉన్న పట్టీ అలా స్పీడ్ బ్రేకర్ కి తాకింది.. ( ఇలా ఎన్నోసార్లు జరిగింది. అది మామూలే.. చాలా ఏళ్లుగా ఆ శభ్దాన్ని వింటున్నాను ) అలాగే నడిపాను. అలా ఇరవై కిలోమీటర్లు వచ్చేశాను.. ఇంకో ముఫై కిలోమీటర్లు అయితే ఇంటికి వచ్చేస్తాను అనుకోనేలోగా ఒక్కసారిగా బండిలో ఏదో చప్పుడు.. ముందుకు వెళ్లడం లేదు.. ఒక్కసారి నివ్వెరపోయాను. అదీ కాసేపే. ఇలాంటి క్లిష్ట పరిస్థితులని ఎన్నో చూశాను కాబట్టి బండిని ఆపి, సెంట్రల్ స్టాండ్ వేసి బండి స్టార్ట్ చేసి, చూశా.
ఇంజన్ ఓకే.. పని చేస్తున్నది. లైటు ఓకే. వెనక టైర్ వద్ద ఏదో చప్పుడు. ఇంజన్ ఆపి టైర్ ఊపి త్రిప్పి చూశా.. అదీ కాస్త ప్లే ఉంది. త్రిప్పితే తిరుగుతున్నది కూడా. అది మామూలు ప్లే నే. అంటే వెనక టైర్ సెక్షన్ అంతా ఓకే.. బేరింగ్స్ కూడా ఓకే అన్నమాట. మరెక్కడ సమస్య? చుట్టూ కటిక చీకటి. ఆ హైవే మీద సెకన్ కొక వాహనం వెళుతున్నది. ఎవరూ ఆగటం లేదు.. ఆ వెలుతురులోనే మా బండిని పరీక్షిస్తున్నాను.
మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి, చూశా.. ఇప్పుడు ఆ చప్పుడు లేదు. ఇంజన్ ని రైజ్ చేసినా వెనక టైర్ లో మూవ్మెంట్ లేదు. అంటే ఇంజిన్ లో ఏదో సమస్య. ఆయిలా? అనుకున్నాను.. ఇంజిన్ క్రింది బాడీ చాంబర్ వద్ద చేయి పెట్టి, తడిమి చూశాను. ఆయిల్ ఛాంబర్ వద్ద ఆయిల్ తడి. అంటే ఛాంబర్ పగిలి ఆయిల్ కారిపోయి, అలా ఆగిపోయిందా? బండిని వంచి చూద్దామన్నా వీలు కాలేదు.. క్రిందన ఏమీ కనపడటం లేదు. ఇక బండి దుకాణం పెట్టేసేంది.. అప్పుడు రాత్రి 9:20 అయ్యింది. ఇంత రాత్రిన పిల్లలతో ఆ రోడ్డు మీద ఎలా ఉండాలి, సురక్షితముగా ఉండాలంటే ఎలా? బండిని ఎలా తీసుకవెళ్ళాలి??? అన్న ఆలోచనలు.. పిల్లలేమో నావంకే చూస్తున్నారు.. నేను ఉన్నానన్న ధీమాతో, నేను తీసుకోబోపోయే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అబ్బాయి, నేనూ ఉంటే ఏమీ అయ్యేది కాదు.. మాతో అమ్మాయి ఉండటంతో - నిర్ణయం త్వరగా తీసుకోవాల్సి వచ్చింది. అలా రోడ్డు వారగా, చీకట్లో ఉండటం ఏమాత్రం మంచిది కాదు కూడా. ఎంత త్వరగా సేఫ్ జోన్ లోకి వెళితే అంత మంచిది.
నేషనల్ హైవే కాబట్టి కొంత ఆలస్యమైనా ఫరవాలేదు కానీ - స్టేట్ హైవే మీద మాత్రం ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే స్టేట్ హైవే (జిల్లాల మధ్య రోడ్లు) మీద రాత్రిళ్ళలో వాహనాల రాకపోకలు చాలా చాలా తక్కువ. నేషనల్ హైవే మీద అయితే - చాలా ఎక్కువ. ధీమాగా ఉండొచ్చు ఆవిషయంలో. అదే కాదు దానితో పోలిస్తే ఎన్నో విషయాల్లో నేషనల్ హైవే నే నయం.. ( అది నా అనుభవం ). అక్కడ అయితే చాలా నిబ్బరంగా ఉండొచ్చును. అందుకే టూర్ కి వెళ్ళేటప్పుడు స్టేట్ హైవే లో వెళ్ళి, రాత్రిన ఇలా ఈ దారిలో రావటం..
ఇలా బండిని చూస్తుండగానే అప్పుడే....
( ఇంకా ఉంది.. మిగతాది ఇక్కడ చదవండి - http://achampetraj.blogspot.in/2015/07/3_28.html )

2 comments:
చాలా బాగుంది మీ కథనం.బాహుబలి పార్ట్ వన్ లా ఉత్కంటంగా మమ్మల్ని మీ నెక్స్ట్ పోస్ట్ కోసం వెయిట్ చేయిస్తున్నారు !!!
హ హ్హా హ్హా.. కథనం నచ్చిందులకు దన్యవాదములు.
బాహుబలిలా మిమ్మల్ని వెయిట్ చేయించను లెండి. బీజీగా ఉండి, సమయం దొరక్క ఆలస్యం అవుతున్నది. అందులకు మన్నించాలి.
Post a Comment