ఈమధ్య నేను చేసిన నా క్రియేటివిటీ ని చూపదలచుకున్నాను. నా మిత్రుడు అడగగా - మిగిలి ఉన్న చెక్కలతో ఒక చిన్న టేబుల్ ని చెయ్యాలనుకున్నాను. 6mm ప్లైవుడ్ ముక్కలు ఉన్నాయి, కానీ పెద్దవీ, కాసింత లావువీ లేవు. వాటిని బయటే కొన్నాను. వాటితో చిన్న టేబుల్ చెయ్యాలని అనుకున్నాను.
మొదటగా - స్కెచ్ వేసి, కొలతలతో వ్రాసుకున్నాను. ఆ తరవాత ఇంకా కొన్ని మార్పులూ, చేర్పులూ చేశాను. ఆ తరవాత పని మొదలెట్టాను.
ఇదంతా నా క్రియేటివిటినీ, నిర్మాణ కౌశలాన్నీ, క్రొత్త పనులు చేస్తుంటే - జీవితం క్రొత్తగా, తెలీని ఆసక్తీ, ఉత్సాహాన్ని కలిగిస్తుందనే ఆలోచనతో ఇలా క్రొత్త క్రొత్త పనులు మొదలెట్టాను. ఆన్లైన్ లో ఉండటం తగ్గించాను.. అలా మిగిలిన సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నాను. వీలున్నప్పుడల్లా మెల్లిగా, మళ్ళీ మళ్ళీ చేస్తూ, ఇంకా బాగా రావాలని ప్రయత్నిస్తూ, చేసుకుంటూ వెళ్లాను. నిజానికి ఇలా కార్పెంటరీ పని చెయ్యటం నాకు క్రొత్త. అందులో ఏమీ అనుభవం లేదు. కనీస పనిముట్లూ కూడా లేవు. నా కులవృత్తీ కూడా కాదు. అసలు ఆ రంగంలో మా వంశస్థులే లేరు - అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ రంగం నాకు ఎంత క్రోత్తనైనదో.. అయినా ఇక్కడ ఆసక్తి ప్రధానం. చెయ్యాలన్న ఆసక్తీ.. నా పనితనం మీద నాకున్న నమ్మకం. చేస్తే ఒక టేబుల్ అవుతుంది. లేకుంటే చిన్న టూల్ బాక్స్ లా చేసెయ్యాలని అనుకున్నాను. అలా స్కెచ్ మొదలెట్టాను. ఇలా వేశాను. ఇదే నేను మొదట అనుకున్నది. రఫ్ గా అలా అంచనాలు చేశాను. అలాగే కొలతలు కూడా లెక్కపెట్టాను. ఏది ఎంత ఉంటే బాగుంటుందో అనీ..
Work table sketch |
ఆతరవాత దాన్ని మరింత అభివృద్ధి చేసి, ముందు కన్నా బాగా ఉండేట్లు, కొన్ని అంత సౌకర్యవంతముగా లేని అటాచ్మెంట్లూ తీసేసి, తేలికగా ఉండి, ఈజీగా వాడుకోవడానికీ, అవసరమైతే వేరే పనికీ వాడుకోనేలా ఉండాలని అన్నట్లు ఆలోచించి, దానికి తగిన విధముగా మళ్ళీ స్కెచెస్ వేశాను. మరికొన్ని అదనపు సౌకర్యాలు ఆలోచించాను. కానీ అవి నేను చెయ్యగలిగే స్థితిలో ఉన్నా, చేసే వడ్రంగి పరికరాలు గానీ, అనుభవం గానీ నాలో లేకపోయింది. అందుకే చేసినదానికే మళ్ళీ క్రొత్త సౌకర్యాలు చేసుకొనేలా వాటిని అట్టే పెట్టి ఉంచాను. ఊహల్లో ఉన్న ఆలోచనల్ని ఇతరుల ద్వారా చేయించుకోవచ్చు కానీ మొత్తం నేనే చేశాను అనే సంతృప్తి కోసం ఆగిపోయాను. అలా సాగిన నా ఆలోచనల పరంపర - ఇలా ఫైనల్ స్కెచ్ తో ఆగిపోయింది. అప్పుడు అనుకున్న ఆ టేబుల్ స్కెచ్ ని ఇలా నీటుగా ఒక పేపర్ మీద వేసుకున్నాను. అయిననూ ఆ స్కెచ్ ప్రకారం టేబుల్ చేస్తున్నప్పుడు మరిన్ని మార్పులు చేశాను.
( Jewellery ) Work table Final sketch |
అలా చిన్న టేబుల్ చెయ్యాలనుకున్నాను. చెయ్యటం మొదలెట్టాను. వీలు చేసుకొని నా సమయం అంతా ఆ టేబుల్ నిర్మాణం లోనే గడిపాను. అలా ఒక్కొక్కటీ చేస్తూ పోయాను. చివరికి ఇలా తయారు అయ్యింది. ఈ క్రింది వీడియో చూడండి. అందులో కొన్ని పొరబాటులు ఉన్నాయి. అవి తగిన పరికరాలు ( యాంగిల్ గ్రైండర్, స్పిరిట్ లేవలర్, 90 డిగ్రీల L పట్టీ, చెక్కలని కోసే మిషన్. బీడింగ్ చేసుకొనే మిషీన్, డ్రిల్.... ఇవన్నీ త్వరలోనే కొనాలనుకుంటున్నాను ) లేక, అనుభవం లేక వచ్చే తప్పులు. అవి చేశాక తెలిశాయి. అయినా నా తృప్తి కోసమని చేశాను. ఎలా ఉందో చూసి చెప్పండి.
నా దగ్గర ఉన్న 6mm ప్లైవుడ్ ముక్కలని మేకులతో, చెక్క జిగురు Fevicol తో జత చేశాను. అంత సన్నని చెక్కలని మేకులతో జత చెయ్యడం చాలా కష్టమే. అయిననూ అలాగే చేశాను. కొన్ని మేకులు ప్రక్కకి వెళ్ళిపోయేవి. వాటిని మధ్యలోనే కత్తిరించేసి, అలాగే దిగగోట్టేశాను. లెవలర్, యాంగిల్ లాంటి చిన్న పని ముట్లు లేకున్నా ( చూడటానికి చిన్నవైనా అవి ఉంటే సరియైన ఆకారములో సరిగ్గా వస్తాయి ) అలాగే చేశాను. ల్యామినేట్ షీట్ ని కట్టర్ తో కత్తిరించి, పేపర్ టేపు సహాయాన ( cost : Rs. 20 ) అతికాను. బయట ప్రక్కలు మాత్రం నోవాపాన్ బోర్డ్ ప్లైవుడ్ ని వాడాను. ఆ బోర్డ్ కి అందముగా పెయింట్ వేసి ఉంటుంది కాబట్టి - దానికి ల్యామినేట్ షీట్ అతకాల్సిన అవసరం ఉండదు కూడా. డ్రాలు తేలికగా కదలడానికి చానల్ పట్టీలు ( Sliding channels ) వాడాలని అనుకున్నాను. కానీ డబ్బులు బాగా అవుతాయనీ ( cost : per inch = Rs. 25 ) ఆగాను. పైన మాత్రం ప్లైవుడ్ కి బదులుగా సిమెంట్ బోర్డ్ వాడాను. అలాని ఎందుకూ అంటే - ఆ బోర్డ్ వేడినీ, ఇటు నీటినీ, చిన్న చిన్న దెబ్బలనీ, ఆసిడ్ నీ తట్టుకోవడమే కాకుండా - చాలా ధృడంగా ఉంటుంది.
ఎక్కడెక్కడ ఏమేమి వాడాను, వాటి వివరణలూ, వాటి కొలతలూ అన్నీ ఈ వీడియోలో - మీరు చూస్తున్నప్పుడే అప్పుడే కనిపించేలా పెట్టాను. అన్నట్లు ఈ వీడియోని నేనే తయారు చేశాను.. ప్రక్కన ఉన్న ఫ్యాన్ శబ్దం అంతగా రికార్డింగ్ అవుతుందని తెలీదు. ఆ శబ్దాన్ని ఎడిట్ చేసి, తీసేసే శక్తీ ఇంకా అబ్బలేదు. అదీ నేర్చుకోవాలి.
No comments:
Post a Comment