Sunday, March 22, 2015

Good Morning - 577


కొన్నిసార్లు నోటితో చెప్పే భావనల కన్నా కళ్ళే ఎక్కువగా చెబుతాయి.. 

అవును.. మనసులో మెదిలే భావాలని నోటితో తేలికగా చెప్పగలుతాం.. కానీ కొన్ని కొన్నిసార్లు అలా వీలు కాదు.. అప్పుడు నోటితో చెప్పలేని భావాలని మన ముఖమే - ఎక్కువగా కళ్ళే చెబుతాయి. ఇలా  చెప్పడమన్నది కేవలం దగ్గరి వ్యక్తులతో మాత్రమే అలా ఎక్కువసార్లు జరుగుతూ ఉంటుంది. దూరపు వ్యక్తులతో - తేలికగా నోటితో చెప్పేస్తూ ఉంటాము. 

మనం చెప్పే భావన  / విషయాన్ని కళ్ళతోటే అందముగా చెప్పొచ్చు. కానీ అలా చెప్పటం అన్నది అందరితో వీలు కాదు. చాలామంది మొహాల్లో - ఈమధ్యకాలములో ముఖకవళికలు దాదాపుగా కనిపించటం అరుదయ్యాయి. సంతోషకర విషయాల్నీ, బాధాకర సంగతుల్నీ ఒకేలా చెప్పేస్తున్నారు. ఎక్కడ హావభావాల్ని చూపిస్తే - నేనెక్కడ దొరికిపోతానో అని ఏమూలనో భయం కాబోలు.. మనసుని ఓపెన్ గా తెరచి ఉంచి మాట్లాడేవాళ్ళు చాలా అరుదయ్యారు. ఇలా ఉండటం మూలానే కావొచ్చు - ముఖాల్లో భావప్రకటన తాలూకు లక్షణాలు ఏవీ కనిపించటం లేదు.. 

మనం ఆత్మీయులతో కొన్ని భావనలని పంచుకుంటాం.. అందులో కొన్ని విషయాలని మనం మన నోటితో చెప్పలేకపోతాం.. కారణాలు ఏవైనా సరే - అది సున్నితమైన విషయమే కావొచ్చును, ఆ విషయాన్ని నోటితో ఎలా చెప్పగలం అన్న మీమాంస వల్లనే కావొచ్చును.. అప్పుడే ఆ భావాన్ని కళ్ళ ద్వారా చూపిస్తాం / చెబుతాం. ముందే చెప్పినట్లుగా - కేవలం దగ్గరి వాళ్ళ విషయంలో కాబట్టి మనసుతో కలిపి, దాన్ని కళ్ళతో ఆ భావాన్ని ప్రకటిస్తుంటాం.. మన మనసెరిగినవారూ, ఆత్మీయులు కాబట్టి మన కళ్ళల్లోని ఆ భావాన్ని ఇట్టే పసిగట్టేస్తారు.. అర్థం చేసుకుంటారు. అదే దూరపు వ్యక్తులు కళ్ళల్లోని భావనని పట్టించుకోరు. ముఖంలోని భావం కోసం తరచి తరచి చూస్తారు. 

ఇలా కళ్ళలోని భావాన్ని తెలుసుకోవడం అన్నది ఒక ఎత్తయితే, మనసులోని భావాన్ని నేరుగా తెలుసుకోవడం అన్నది ఇలాంటి విషయాల్లో పరాకాష్ట. ఇది ఆత్మీయ బంధాలల్లో ( స్నేహం, ప్రేమ, కుటుంబ.... ) జరుగుతూ ఉంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా నేనీలా తెలుసుకుంటున్నాను.. కొద్దిమందితో వారిలో ఒకడినై కలిసిపోతున్నందులకు అలా కావొచ్చును.. :P 

No comments:

Related Posts with Thumbnails