Friday, January 30, 2015

Quiz

ఇందులోని త్రిభుజాలు ఎన్ని ? 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 41 త్రిభుజాలు.  

త్రిభుజం ని మూడు భాగాలుగా చేస్తే - అందులోని ఒక భాగం లో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో మీకు పై పటం లో చూపించాను. ఒక్కో భాగములో 13 త్రిభుజాలు ఉన్నాయి. అలా మిగిలిన రెండింట్లో కూడా అలాగే ఉంటాయి. ( 13 x 2 = 26 ) అంటే మూడు త్రిభుజ భాగాలలోని మొత్తం త్రిభుజాలు ( 13 x 3 ) = 39 అవుతాయి. వాటికి ఈ క్రింద చూపినట్లుగా లోపల ఉన్న ఆరెంజ్ రంగులోని త్రిభుజాన్ని ( 40 ) అలాగే చుట్టూ ఉన్న త్రిభుజాన్నీ ( 41 ) కలిపితే అప్పుడు మొత్తం త్రిభుజాల మొత్తం 41 అవుతాయి. 


లేదా ఇలా ఇలా చెయ్యండి. ఒక భాగం తీసుకొని అందులో ఒక్కో బాహుమూలలలో అక్షరాలను పెట్టాను. వాటి సహాయాన ఎన్ని ఉన్నాయో లేక్కిద్దాం. 


1. ABCA 
2. DBED 
3. BCEB 
4. CEFC 
5. DGHD 
6. DEHD 
7. EHIE 
8. EIFE 
9. FIJF 
10. ADFA 
11. BGIB 
12. CHJC 
13. AGJA 
ఇలా మూడు భాగాలలోనివి ( 13 x 3 ) = 39 అవుతాయి. మిగిలిన రెండూ మీకు పైన చెప్పాను. అవీ కలిపితే మొత్తం 41 అవుతాయి. 

Monday, January 26, 2015

Quiz

ఒక అమ్మాయి ఒక షాప్ కి వచ్చి, 200 రూపాయల వస్తువు కొని, తన దగ్గరున్న 1000 రూపాయల నోటు ఇచ్చింది. అందుకు ఆ షాప్ ఓనర్ తన దగ్గర చిల్లర లేదని, ప్రక్క షాప్ వద్దకి వెళ్ళి, మార్పిడి చేసి, చిల్లర తెచ్చాడు. ఆ అమ్మాయి కొన్న వస్తువుకి సరిపడా మొత్తం తీసుకొని, మిగతా డబ్బులు ఇచ్చి, పంపేశాడు. 

ఆ తరవాత ప్రక్కషాపు అతడు వచ్చి " ఇందాక నీవు ఇచ్చింది దొంగనోటు.." అని చెప్పి, ఆ నోటు ఇచ్చేసి - తను ఇందాక ఇచ్చిన చిల్లర మొత్తాన్నీ తీసుకవెళ్ళాడు. అప్పుడు ఆ వస్తువు అమ్మిన షాప్ ఓనర్ కి జరిగిన నష్టం ఎంత?

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు..:  

Friday, January 23, 2015

Quiz

ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి..

H K O T  ?

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 


ఎలా అంటే  - H కీ K కీ మధ్య రెండు అక్షరాలు ( I J ) మిస్సయ్యాయి. K కీ O కీ మధ్యన మూడు అక్షరాలు ( L M N ) మిస్ అయ్యాయి. అలాగే O కీ మరియు T కి మధ్య నాలుగు అక్షరాలు ( P Q R S ) లేవు. ఇలాగే T కీ Z కీ మధ్యన ఐదు అక్షరాలు రావాలి. ( V W X Y ) ల తరవాత అక్షరం వస్తుంది. అంటే Z వస్తుంది. 

Wednesday, January 21, 2015

My table model.

ఆమధ్య ఒక టేబుల్ చేయించాలనుకున్నాను. ఎలా చేయించాలో అర్థం కాలేదు.. ఎన్నెన్నో ఆలోచించాను. చివరికి నాకు అనుకూలముగా ఉండే ఒక ప్యాట్రన్ ని ఎన్నుకున్నాను. మంచి కార్పెంటర్ ని పిలిచి, ఇలా ఈ కొలతల్లో ఒక టేబుల్ చేయించాలని ఉంది మీరు చెయ్యగలరా ? అన్నాను. తను చేస్తానని చెప్పాడు. తననీ కొన్ని మాడల్స్ ని అడిగా.. తనూ కొన్ని చెప్పాడు.. నాకు అవి నచ్చలేదు - కారణం : నాకు అనుకూలముగా ఉండాలనీ, రేపొద్దున అవసరం లేనప్పుడు అమ్ముకోవడానికీ తేలికగా ఉండాలని, అమ్ముడవకపోతే ఎక్కడైనా నేనే వాడుకోవడానికి వీలుగా ఉండాలని నా ఆలోచన. ఇన్ని లక్షణాలు ఒకేదాంట్లో ఉండాలంటే కష్టమే కదా..

నిజానికి కష్టమే. ఇంకో పది, ఇరవై సంవత్సరాల కాలములో వచ్చే మార్పులు చేర్పులు గమనించి, చేయించేది కాబట్టి ఇంతగా ఆలోచించటం. అయినా అలా టేబుల్ తయారీ ఖర్చు కూడా బాగానే ఉంది. దాదాపు ముప్ఫై వేల రూపాయలు. 8 అడుగుల పొడవూ, 30 అంగుళాల ఎత్తూ, 18 అంగుళాల లోతూ ఉన్న టేబుల్ అది. సో, అంతగా ఆలోచించటం. ఒకవేళ అది పనికి రాకపోతే, ఎక్కడా పెట్టుకోలేం.. ఎవరికీ అమ్మలేం.. అందుకే అంతగా ఆలోచన. " మీకు కొద్దిరోజుల్లో ఎలా ఉండాలో చెబుతాను.." అని వారం రోజుల గడువు అడిగాను. సరే అన్నాడు ఆ కార్పెంటర్.

వారం రోజుల్లో ఆ టేబుల్ ముందట కూర్చుంటే ఎలా నాకు ఉపయోగపడుతుందో, అచ్చు అలాగే ప్రవర్తిస్తూ - నా అవసరాలు ఏమిటో తెలుసుకోవటం మొదలెట్టాను. కొన్నింటిని కన్ఫర్మ్ చేశాను. అలా నాలుగైదు రోజుల్లో నాకు ఆ టేబుల్ ఎలా ఉపయోగపడేలా ఉండాలో తెలుసుకున్నాను. అప్పుడే వచ్చింది ఒక ఐడియా. ఇది మరీ బాగుందని ఆచరణలోకి పెట్టేశా.. 

ఒకరాత్రి తీరికగా కూర్చొని, అట్టముక్కలతో చెయ్యడం మొదలెట్టాను. అప్పుడు నాకు సరిగ్గా అలా తయారు చేసే అట్టలు దొరకలేదు. ఇంట్లో ఉన్న పేపర్ కార్టన్ డబ్బా తీసుకొని, చెయ్యడం మొదలెట్టా. ఇప్పుడు అలా చెయ్యాల్సి వస్తే ఇంకా బాగా చేస్తాను. మొదటిసారి చేసిన అనుభవం వల్ల ఎలా చెయ్యాలో, ఏమేమి ఉండాలో తెలుసుకున్నాను.. 

ముందుగా ఆ పేపర్ కార్టన్ డబ్బాని విప్పి, దాని మీద నాకు కావలసిన టేబుల్ కొలతలని 1 అడుగుని = 1 అంగుళం కొలతలో మార్కింగ్ వేశాను. అలా వేశాక ఆ అట్టని కత్తిరించాను. ఫెవికాల్ డబ్బాని తెరచి ఉంచా.. అలా చెయ్యడం ఎందుకంటే - ఆ ఫెవికాల్ కాస్త గట్టిగా, చిక్కగా తయారవుతుంది. అప్పుడు ఇలా అతకగానే వెంటనే ఆ అట్టముక్కలు అతుక్కొంటాయి. ఇదే అలా మాడల్స్ చెయ్యటానికి ఉన్న కిటుకు. కొన్ని సెకండ్స్ లలోనే అలా అతుక్కొని, మిగతా చెయ్యటానికి అనుకూలముగా మారుతుంది. చాలామంది ఈ విషయం తెలీక సమయాన్ని వృధా చేస్తూ, తమ క్రియేటివిటీ ని ఆపేసుకుంటారు. నిజానికి అన్నింటిలో చిన్న చిన్న కిటుకులే ( పనిలో ) విజయం సాధించటానికి దోహదం చేస్తాయి. ఆ కిటుకులనే సాధించడం నేర్చుకోవాలి. 

నాకు కావలసిన టేబుల్ ని అలా చేస్తూ పోయాను. ముందుగా చుట్టూ ఉన్న డబ్బాని తయారు చేశాను. అలా చేసిన దానికి హెయిర్ డ్రయర్ ని వాడి, ఆరబెట్టాను. ఆ తరవాత - లోపల పార్టీషన్స్ ( విభాగాలు ) చేశాను.  ఆతరవాత వాటిల్లో అరల సైజు తీసుకొని... కత్తిరించి, అందులో అతికాను. అలా అయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. ఇలాంటి క్రియేటివిటీ పనుల్లో నేనుంటే - నాకు సమయమే తెలీదు. స్వతహాగా నేను ఒక వర్క్ హాలిక్ ని. ఎప్పుడూ ఏదో పని ఉండాలని అనుకొని, చేస్తూ ఉండేవాడిని, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను కూడా.. 

అలా నాకు కావలసిన టేబుల్ మాడల్ ని తయారుచేసి, హమ్మయ్య అన్న సంతృప్తితో ఆరాత్రి హాయిగా పడుకున్నా. మరుసటి రోజున ఆ కార్పెంటర్ ని పిలిచి చూపించా.. తనకి తేలికగా అర్థమయ్యింది. 


ఆ తరవాత తానొక మార్పు చెప్పాడు. డ్రాయర్స్ అలా  ఐదు ర్యాకులుగా కాకుండా నాలుగు పెట్టుకుంటే ఎక్కువ సామాను పడుతుంది, మరియు చాలా ఈజీగా ఉంటుందనీ.. అలా ఓకే అన్నాను. ఇక అతను వెంటనే పని మొదలెట్టాడు. కొద్దిరోజుల్లో నేను అనుకున్నట్లుగా టేబుల్ సిద్దం చేశాడు.  ( పైన చూపిస్తున్న టేబుల్ - ఆ పెద్ద టేబుల్ లోని సగ భాగం.. అంటే నాలుగు అడుగుల భాగం మాడల్ )

మొత్తానికి నేను అనుకున్న విధముగా టేబుల్ అయ్యింది. 

Sunday, January 18, 2015

Quiz

50 = 99
49 = 97
48 = 95
47 = 93 
46 = 91 
41 = ?   


.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 


Wednesday, January 14, 2015

సంక్రాంతి శుభాకాంక్షలు.


మీకూ, మీ మిత్రులకూ 
కుటుంబ సభ్యులకూ 
శ్రేయోభిలాషులకూ.. 
సంక్రాంతి శుభాకాంక్షలు. 
Sankranthi Greetings to all. 

Tuesday, January 13, 2015

Bhogi Sankranthi - greetings


మీకూ, 
మీ మిత్రులకూ, 
మీ కుటుంబ సభ్యులకూ, 
శ్రేయోభిలాషులకూ..
భోగి పండగ శుభాకాంక్షలు.. 

ఈ సంక్రాంతి పండగ మీ ఇంట సిరులని ప్రసాదించాలి. 

Sunday, January 11, 2015

Quiz

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.


Saturday, January 10, 2015

Good Morning - 574


" నీతో ఒకసారి మాట్లాడాలిరా.. " అని నాన్న పిలవగానే గతవారం రోజుల్లో చేసిన తప్పులన్నీ ఒకదాని తరవాత ఒకటి గుర్తుకొచ్చేస్తాయి. నిజమే కదూ.. 

నిజమే కదూ.. అలా నాన్నగారు పిలవగానే మనసులో ఏదో తెలీని గుబులు.. నేనేం తప్పు పని చేశానూ అని ఆలోచనల్లో ఈ కొద్దిరోజుల్లో ఏమేమి చేశామో అన్నీ గుర్తు తెచ్చేసుకుంటాం.. మది అంతా గజిబిజిగా తయారవుతుంది. అప్పటిదాకా మామూలుగా ఉన్న వాళ్ళం అర్థం కాని గందరగోళానికి గురి అవుతాం. ఎంతో ధైర్యం తెచ్చేసుకుని - నాన్నగారి వద్దకి వెళతాం. ఆ సమయాన అక్కడ ఏమి జరుగుతుందో చూసేందుకు వచ్చే మన ఈడువారు, మరెవరూ లేని సమయాన - నాన్నగారు ఒక్కరే ఉన్నప్పుడు కలవటానికి వెళతాం. 

పిలిచిన కారణం ఏదైనా మామూలు విషయమే అయితే - గుండెల మీద నుండి ఎవరెస్ట్ పర్వతం చప్పున దిగిపోయినట్లు అగుపిస్తుంది. మళ్ళీ ఎప్పటిలా మనసు మామూలుగా ఉరుకులు పరుగులు మొదలెడుతుంది. ఈ సందర్భాన్ని కొంతకాలం తరవాత  గుర్తు తెచ్చేసుకుంటే - ఆ పరిస్థితిలో మనం పడ్డ ఆందోళన మన పెదాలపై సన్నని చిరునవ్వుతో, కొంత సిగ్గుతో కూడినదై ఉంటుంది.. 


Wednesday, January 7, 2015

Quiz

పదడుగుల త్రాడుతో కట్టేసిన ఆవు ఇరవై అడుగుల వరకూ ఉన్న గడ్డిని ఎలా మేసింది..?

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :  

Sunday, January 4, 2015

Quiz

ఈ క్రింది చిత్రంలో ఎన్ని త్రికోణాలు / త్రిభుజాలు Triangles ఉన్నాయో చెప్పండి చూద్దాం. 

How many triangles are there in a diamond? 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 

ఎలా అంటే : 








Related Posts with Thumbnails