Sunday, November 9, 2014

Good Morning - 570


మీకు ఇష్టం లేని పనులు చెయ్యడం నేర్చుకోండి. 
మీకు నచ్చని వారితో సమయం గడపడం నేర్చుకోండి. 
అలా చేస్తూ కూడా మీ మీ జీవితాన్ని 
ఆనందముగా, ప్రేమగా, అర్థవంతముగా జీవించడం నేర్చుకోండి. 

నిజమే ! ఎప్పుడూ మనకిష్టమైన పనులే కాకుండా ఒక్కోసారి ఏమాత్రం ఇష్టం లేని పనులు చెయ్యాల్సి వస్తుంది. అలా ఆయా పరిస్థితుల్లో చెయ్యక తప్పదు. ఉదాహరణకు - అత్తగారు చెప్పిన పనులు కోడలు చెయాల్సిరావడం, ఆఫీసులో బాస్ చెప్పిన పనులు ఉద్యోగి చెయ్యాల్సి రావడం వంటివి. నిజానికి తమకి ఏమాత్రం ఆసక్తిలేనివి అని అవతలి వారికి తెలిసినా కావాలనో, తప్పకనో ఆ పనులు చెయ్యమని పురమాయిస్తారు. 

అలాంటి సమయాల్లో మనం గొడవ పడితే - ఇంకా సమస్యలు పెరుగుతాయి. ఆ పని మీతో కాకున్నా వేరేవారితో అప్పటికి చేయించుకోవచ్చు. కానీ దానివలన నష్టపోయేదీ మనమే.. అలాగే నచ్చని వారితో కూడా ఉండాల్సి రావడం జరుగుతుంది. అలాంటి సమయాల్లో చక్కని కిటుకు ఒకటుంది. అదేమిటంటే - మీవైపు నుండి కాకుండా వారివైపు నుండి వారిని అర్థం చేసుకోండి. అప్పుడు నచ్చటం లేదు అన్న స్తాయి నుండి కనీసం - ఫరవాలేదు అనిపిస్తుంది. జీవితం అన్నాక ఇలాంటి ఇబ్బందులు తప్పవు. అయినా అందరినీ కలుపుకుంటూ వెళ్ళితేనే మనం సంతోషముగా ఉండగలం. ఇలా ఉండనివారికి - అన్నీ దగ్గరికి వస్తూ దూరం జరిగిపోయి - చివరికి వారు ఒంటరిగా మిగిలిపోతుంటారు. 

నిజానికి బ్రతకడంలోని ఆనందం కూడా ఇలా కూడా లభిస్తుంది. ఇష్టం లేని, అర్థంగాని అవతలివారిని, వారి చర్యలనీ  - మనవైపు నుండి కాకుండా వారివైపు నుండి అలోచించి అర్థం చేసుకుంటే - వారి వల్ల ఏర్పడిన విసుగూ, అయిష్టత స్థానాల్లో ఆనందం వస్తుంది. అలా చేసుకున్న నాడు జీవితముగా చాలా చికాకులు తొలగించుకున్న వారిమి అవుతాము. 


2 comments:

V.Venkata Pratap said...

సర్.... మీరు చక్కటి... సందేశాత్మక విషయాలను పోస్ట్ చేస్తారు. అభినందనలు... మీ అనుమతి లేకుండా face book ఫ్రండ్స్ కి మీ బ్లాగును పరిచయము చేశాను. క్షంతవ్యుడను. నమస్తే. ప్రతాప్

Raj said...

మీ అభినందనలకు కృతజ్ఞుడిని. నా బ్లాగ్ ని మీరు ఇతరులకు పరిచయం చెయ్యటానికి నా అనుమతి అవసరంలేదు. మీ స్నేహితులకి పరిచయం చేసినందులకు ధన్యవాదములు.

Related Posts with Thumbnails