జిగ్ జాగ్ కత్తెర అనేది పేపర్ ని గానీ, బట్టని గానీ కత్తిరిస్తే - పళ్ళు, పళ్ళు ఆకారముగా వచ్చేలా చేస్తుంది. ఈ కత్తెర సాధారణముగా కటింగ్ స్టీల్ తో చేయబడి, ముందున రెండు కత్తెర భాగాలకీ త్రికోణాకారంలో పళ్ళు చేయబడి ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో పేపర్ ని గానీ, బట్టని గానీ ఉంచి కత్తిరిస్తే, ఒక డిజైను ఆకారముగా కటింగ్ వస్తుంది. తద్వారా ఇక్కడ చేస్తున్న కార్డ్ కి చక్కని రూపం వస్తుంది. అలా చెయ్యటం వలన - ఇది మనం చేశాం అంటే నమ్మరు. "అలా ఎలా చేశారు..? రెడీమేడ్ గిఫ్ట్ కార్డ్ కొన్నారా?.." అనే ప్రశ్న ఎదురవుతుంది. అప్పుడు మీరు ఒక చిరునవ్వు ఇచ్చేసి, లోలోన గర్వముగా ఫీల్ అవుతారు.
ఇప్పుడు ఆ కత్తెర ని ఒకసారి చూద్దాం.
చూశారు కదూ.. పెద్దగా చేసి చూడండి. (ఎలా పెద్దగా చేసి చూడాలో బ్లాగుల్లో ఫోటో ఆల్బం పెద్దగా చూడాలంటే! చూడండి. అలా చేసి చూస్తే ఫోటో ఉన్న ఒరిజినల్ సైజు లో మీకు కనిపిస్తుంది) ఈ కత్తెర స్టీల్ తో చేయబడి ఉంటుంది. నేను తక్కువ ధరలో ఉన్నప్పుడు 30 రూపాయలకి కొన్నాను. ఇప్పుడు ఎంత ధర ఎంతుందో తెలీదు. ఇది కొని పన్నెండు సంవత్సరాలకి పైగా అవుతున్నది కూడా. టైలరింగ్ మెటీరియల్ అమ్మే దుకాణాల్లో, కుట్టు మెషీన్ సామానులు అమ్మే దుకాణాల్లో ఇది దొరుకుతుంది. జిగ్ జాగ్ కటింగ్ వచ్చే కత్తెర అని అడిగితే చాలు.
ఇందులో ఒక పెళ్లి పత్రిక కార్డ్ పెట్టి కత్తిరిస్తే - ఇలా వస్తుంది.
No comments:
Post a Comment