మనసున్నాక మానసిక సంఘర్షణలు తప్పవేమో అన్నారు ఎవరో!.. ఒక్కోసారి ఎంత గింజుకొని ఆలోచించినా సమాధానం దొరకదు. పరిష్కారం దొరికేవరకూ మానసిక చిత్రవధ తప్పదేమో!.. ఆలాంటన్నప్పుడే ఊహించని సరిక్రొత్త మలుపులూ, ఎవరేమిటో, మనమేమిటో అన్నీ తెలుస్తుంటాయి.
ఒక సమస్య ఎదురుకున్నాను. చాలా సున్నిత విషయం అది. సరిగ్గా ఆ సమస్యని పరిష్కరించలేకపోతే, నేను పడే మానసిక వ్యధ చాలానే ఉంటుంది. అక్కడితో తెగతెంపులు చేద్దాం అంటే చెయ్యలేని పరిస్థితి. నిజానికి చాలా చిన్న సమస్య. కొంత అపోహలూ, ఏవేవో ఊహించుకోవటాలూ, చెడు ప్రచారం, ఈగోలూ.. మొదలైనవాటి వల్ల చాలా పెద్దగా అయ్యింది. కానీ ఎవరినీ ఏమీ అనలేకపోయేసరికి, చినికి చినికి గాలివాన అయినట్లు పెద్దగా అయ్యింది. నిజానికి నలుగురు మాత్రమే అరగంట కూర్చొని, మాట్లాడుకుంటే ఆటో, ఇటో తేలిపోయేది. కానీ అలా కాక.. .. .. .. .. డజను మందికి పైగా కలగచేసుకునేలా మారింది. అందరూ కొద్దో, గొప్పో ఇబ్బంది పడ్డారు. ఒకరి పొడ అంటే మరొకరికి గిట్టకుండా మారింది. విషయాన్ని ఎలా మాట్లాడినా కస్సు, బస్సుల వద్ద ఆగుతుంది. తలా పాపం పిడికెడు అన్నట్లుగా అయ్యింది. పీట ముడి పడ్డట్లూ అయ్యింది కూడా.. అందరూ బాగానే ఇబ్బంది పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. అందుకే సమస్య అలా సాగింది.
సమయం కూడా లేదు.. ఎన్నో రకాలుగా విశ్లేషించాను. అందరివైపునా ఆలోచించాను. ఒక్కో పొర విప్పి మరీ ఆలోచించాను. అన్ని ఆలోచనా దారులకి కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఎటూ తేల్చుకోలేకపోయాను. ఒకరికి బాగుండేలా చెయ్యాలంటే మరొకరు ఇబ్బంది పడతారు. ఇంకొకరిని సంతోషపెట్టాలంటే మరొకరు బాధపడతారు. ఎడతెగని ఆలోచనలు. ఎలా చేసినా, అందరికీ బాధ తప్పదు.. అది మాత్రం నిజం. అన్ని దారుల్లో కొంతదూరం వెళ్ళాక, ఎత్తైన అవరోధాలు.. అక్కడితో ఆ దారి ముగిసేలా కనిపించసాగింది. ఎన్ని డైవర్షన్ దారులలో వెళ్ళినా ఫలితం అంతే!. ఆ సమస్యని అలా సాగదీయడం యే ప్రస్తుత సమాధానం.
నేను ఇలా దిగాలుగా ఉంటున్నానని నా మిత్రురాలు ఆన్లైన్ లోనే పసిగట్టింది. "ఏమిటీ? అలా ఉంటున్నావు?.. అంతా ఓకే నే కదా..?.." అని అడిగారు. "అంతా ఒకే.." అన్నాను. కానీ నా చాట్, స్క్రాప్స్, పోస్ట్స్.. అది అబద్ధం అని తెలుస్తూనే ఉంది. "ఏమయింది.. ఇబ్బంది లేకుంటేనే చెప్పండి!" అని చనువుగా అడిగారు. చెప్పాలా? వద్దా?అని ఊగిసలాడాను. చెబితే పోయేదేమీ ఉంది.. చూద్దాం ఒకసారి అనుకున్నాను. క్రొత్తగా ఏమైనా పరిష్కారం దొరుతుందేమో అని ఎక్కడో మూలన చిన్న ఆశ.
తనతో నాకు అప్పటివరకూ - అంతగా గొప్ప స్నేహం అంటూ లేకున్నా, బాగానే పరిచయం మాత్రం ఉంది. ఏదో విష్ చేసుకోవటం తప్ప అంతగా స్నేహం ఏమీలేదు. అసలు తన పరిచయమే ఒక ట్విస్ట్. చాలా నెలల క్రిందట సోషల్ సైట్ సర్ఫింగ్ లో తన ప్రొఫైల్ చూసినప్పుడు కనిపిస్తే, తనలో ఏదో గొప్ప ప్రతిభ ఉన్నట్లు కనిపించింది. స్నేహితురాలిగా చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఆడ్ రిక్వెస్ట్ పెడితే, అదీ నెలరోజులు వెయిట్ చేయించి, రిజెక్ట్ చేశారు.. ఆ తరవాత నా గురించి తెలుసుకొని, తాను ఆడ్ రిక్వెస్ట్ పెడితే - టిట్ ఫర్ టాట్ లా నేనూ పెండింగ్ లో పెట్టాను. తరవాత నా స్నేహితురాలు + వారి బంధువు చెబితే, వెంటనే ఆడ్ చేసుకున్నాను. అప్పటివరకూ స్నేహితురాలి బంధువు అని నాకూ తెలీదు. అలా పరిచయం అయిన తనతో నాకు స్నేహం పెరగసాగింది.
సమస్యని కాసింత క్లుప్తముగా తనకి చెప్పాను. సరిగా అర్థం కాలేదు. కానీ సమస్య చిన్నదే అయినా, ఇప్పుడు పెరిగిన సమస్యని అర్థం చేసుకోవటానికి అంతా చాట్లో టైప్ చెయ్యటం కాసింత కష్టమే.. అందుకే ఫోన్ చెయ్యొచ్చా అని అడిగా. సరే! అన్నారు. ఎన్నింటికి చెయ్యాలో అడిగి, ఆ సమయములో తనకి కాల్ చేసి మాట్లాడాను. దాదాపు మూడున్నర గంటలసేపు మాట్లాడా.. మధ్య మధ్య అనుకోని నా స్వంత పనుల వల్ల కాసింత విరామం. అయినా మొత్తానికి అంతా వివరముగా చెప్పాను.
తను నేను చెప్పినదంతా ఆసాంతం విన్నారు. ఎక్కడా డిస్టర్బ్ చెయ్యలేదు. అలా ఫ్లో గా నేను చెప్పేది సాగనిచ్చారు. మధ్య మధ్య - అర్థం కాని చోట, మరిన్ని వివరాల కోసం, కొన్ని ప్రశ్నలు వేశారు. (ఈ పద్ధతి బాగా నచ్చింది. ఇక నుండీ నేనూ అలాగే వినడానికి అలవాటు చేసుకుంటాను) సమాధానాలు చెబుతూ ముగించాను. ఆ తరవాత తను, చక్కగా విశ్లేషణ చేస్తూ, బాగా పరిష్కారం పద్ధతులు చూపారు. అవి బాగా నచ్చాయి నాకు.
నేను చెప్పిన విషయాలన్నీ - నా వైపు నుండి చూసినట్లు చెప్పక, జరిగినది జరిగినట్లు అంతా చెప్పాను. అలా చెప్పేసరికి, తను బాగా విశ్లేషించుకోగలిగారు. ఆ తరవాత తను బాగా సమాధానం చెప్పారు. నా పొరబాట్లు ఏమిటో, ఎదుటివారి పొరబాట్లు ఏమిటో క్లుప్తముగా చెప్పారు. ఎక్కడ ఎవరి తప్పులో, అదీ ఎందుకో చాలా బాగా విశ్లేషించారు. చాలా బాగా చెప్పారు.
నాలోని పొరబాట్లని చెప్పేందుకు కావలసినంత స్వేఛ్చని ఇచ్చాను. తను ఏది చెప్పినా అడ్డు చెప్పొద్దూ అనుకున్నా. ఆఖరుకి నాదే తప్పని తిట్టినా సరే అనీ!.. ఎందుకంటే - తన అభిప్రాయం తనది. అందరూ ఒకేలా - ఒకే దాన్ని చూడలేరు కదా.. ఎవరి కోణాలు వారివి. నా పొరబాట్లు ఏమిటో, అవి ఎలా తప్పో, ఎందుకు తప్పో, ఎలా చేస్తే ఒప్పో, అన్నీ వివరముగా చెప్పారు. నన్నూ కాసింత మందలించారు. మళ్ళీ ఇలాంటి పొరబాట్లు చేస్తే కొడతా అని కూడా అన్నారు (మా మధ్య ఆమాత్రం చనువుంది.) తను చెప్పాక నేను చేసిన పొరబాట్లు ఏమిటో బాగా అర్థమయ్యాయి. నా వీపు నాకు కనిపించదు కదా..! అవి మార్చుకోవాలి. మార్చుకుంటే ఇంకా నా జీవనం బాగుంటుంది.
నిజానికి ఇలా మన ఫెయిల్యూర్స్ చెప్పుకుంటే - అస్సలు బాగోదు. పైగా మన వ్యక్తిత్వం డామేజీ అన్నట్లుగా అనిపిస్తుంది. అలాని అనుకుంటాం కానీ చివరికి వచ్చేసరికి ఏమీ మిగలదు.. చింత తప్ప. అయినా ఎప్పుడూ మన గొప్పలు చెప్పుకుంటుంటే ఏం బాగుంటుంది?. అందుకే ఈ పోస్ట్ లో - మీకు చెప్పాల్సిన తన గొప్పదనాలు ఏమిటో చెప్పాలని అనుకుంటున్నాను.

- తను ఆరోజు చెప్పిన విశ్లేషణలన్నీ ఈరోజు (ఆరు నెలల తరవాత) దాదాపు అన్నీ నిజమే. సరిగ్గా అన్నీ తను చెప్పినట్లే జరిగాయి కూడా.
- తను వేసిన అంచనాలు అన్నీ నిజమే అయ్యాయి.
- నేను అప్పుడు చేసిన పొరబాట్లు ఏమిటో, ఈరోజు ఆలోచిస్తుంటే - నిజమే, అలా నేను చేసి ఉండేది కాకుండెను.. అనిపిస్తున్నది.
- అసలు స్నేహమంటే ఏమిటో, అందులో స్నేహం చేసేవారు ఎలా ఉండాలో, ఆస్థి, అంతస్థులు, పురుషుడా, స్త్రీయా, సామాజిక హోదా.. ఇవన్నీ పట్టించుకోకుంటేనే స్నేహం నిలుస్తుందని చెప్పారు. నిజమే కదా.. అందుకే చిన్నప్పటి స్నేహాల్లోనే, సంతోషం, ఆత్మీయత, అనురాగం, స్వచ్చమైన స్నేహం ఉంటుంది.
- ఎవరినీ, ఎక్కడా ఒక్కమాట కూడా తూలకుండా, ఏమీ అనకుండా స్పష్టముగా చెప్పారు. ఎవరెవరిది ఎంత తప్పులు ఉన్నాయో, వాళ్లకి అక్కడ కల్పించుకోవాల్సిన అవసరం ఉందో, లేదో కూడా చెప్పారు.
- నామీద ఆమాత్రం చనువు ఉందని - నన్ను లాలించారు, బుజ్జగించారు, కోప్పడ్డారు, ప్రేమగా అనునయించారు.. ఇంకోసారి ఇలా మళ్ళీ చేస్తే మాత్రం ఊరుకోను, ఇంటికి వచ్చి మరీ తంతా అని (సరదాగా) వార్నింగ్ ఇచ్చారు. నిజమైన స్నేహం అంటేనే అదే కదా.. తన స్నేహితుడు బాగుండాలని, ఎక్కడా పొరబాట్లు చేసి, ఎవరి ముందూ తల దించుకోనేలా ఉండకూడదు ఆవిడ భావన. స్నేహితుడి కష్టం నాది కూడా అనుకునే మనస్తత్వం తనది.
- తనతో నేను ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడకున్నా, మిగతావారికన్నా తక్కువగా కబుర్లు చెప్పినా, అవన్నీ మనసులో పెట్టుకోకుండా నా సమస్యని ఒపికగా, సమయం తీసుకొని, విశ్లేషించి, నా బాగు కోసం చెప్పారు.
- అసలు నేనేమిటో, నా జీవితం అంటే ఏమిటో, నా జీవిత గమ్యం ఏమిటో, నేను చేరుకోవాల్సిన లక్ష్యాలు ఏమిటో అన్నీ సున్నితముగా గుర్తుచేశారు. అసలు నేను వెళ్ళిన ఆ సమస్య దారిలో అంత దూరం ప్రయాణించటం ఎలా, ఎందుకు తప్పో సోదాహరణముగా చెప్పారు.
- ఇదంతా గంటల కొద్దీ క్లాస్ తీసుకోవటం కాదు. చాలా తక్కువ సమయములో చెప్పారు.
- మొదట్లో తన స్నేహమే వద్దనుకున్నా, తను ఇప్పుడు నా సమస్యని తీర్చటం నేనే నమ్మలేకున్నాను. మనం వద్దనుకున్నవారే మనకి కష్టాల్లో ఆదుకుంటారు అంటే - ఈరోజే ప్రత్యక్షముగా చూశాను. కష్టాల్లో ఉన్నప్పుడే ఆదుకోనేవారే నిజమైన స్నేహితులు అన్నమాటకి నిర్వచనం తనే అని చెప్పోచ్చును.
- ఒకప్పుడు మామూలు స్నేహితురాలు అనుకున్న నాకు, ఇప్పుడు తను నాకు ఎంత విలువైన స్నేహితురాలో తెలిసొచ్చింది. నా అజ్ఞానపు పొరలను తొలగించారు. ఒకప్పుడు సునామీ వచ్చినట్లు ఉన్న నా మది, ఇప్పుడు నేను చాలా ప్రశాంతముగా, సంతోషముగా ఉంది.
- తన గురించి మరింత చెప్పి తన వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టలేను. కనుక ఇక్కడితో ఆపేస్తాను. ఈ పోస్ట్ వ్రాయోద్దని అనుకున్నా. మంచి స్నేహితుడు (రాలు) ఉంటే మన జీవితం అంటే ఏమిటో, ఎలా ఉండాలో తెలుస్తుంది అని చెప్పటానికి ఈ పోస్ట్ పెడుతున్నాను.
- ఆన్లైన్ స్నేహములో పరిచయం అయిన తను, ఇప్పుడు నా జీవితములో ముఖ్యమైన స్నేహితురాలిగా మారారు. చ.. అలా కాదు.. కాదు. తను నా స్నేహితురాలు అని చెప్పుకోవటం కన్నా, తనకి నేను స్నేహితుడిని అని చెప్పుకోవటమే చాలా గర్వముగా అనిపిస్తున్నది. నిజమైన స్నేహితుడుగా చెప్పే మాటలకి ఎంత విలువ ఉంటుందో, వింటే జీవితం ఎలా ఉంటుందో ఈరోజు ప్రత్యక్షముగా చూస్తున్నాను. తనకి చాలా చాలా కృతజ్ఞతలు.. ఒకప్పుడు స్వార్థపరమైన స్నేహాల్ని చూసి, స్నేహమంటేనే నమ్మని నేను, ఈరోజు నిస్వార్థ, అద్భుతమైన స్నేహాల్ని చవి చూస్తున్నాను.
- మీకూ ఇలాంటి స్నేహితులు మీ మీ జీవన యాత్రలో అవసరం రావచ్చును. ఇప్పటినుండే అలాంటి స్నేహితులని వెదుక్కోవటం ఆరంభించండి.
4 comments:
nice post. :)
no words..
ధన్యవాదములు.. :)
మీకు దొరికినట్లుగా - నాకూ అలాంటి స్నేహితురాలు దొరికితే బావున్ను.
ఇష్టకామ్య ఫల సిద్ధిరస్తు.
Post a Comment