Sunday, April 8, 2012

పుట్టు వెంట్రుకలు - ఒక జ్ఞాపకం

పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయించటం మనవద్ద ఆచారం. ఆమాటకి వస్తే ఈ ఆచారం ప్రపంచం అంతా ఉందని ఇందాకే తెలిసింది కూడా. ఇంకా లోతుగా వెళితే ఇంకా చాలా బాగా, ఇంకొన్ని ఆసక్తికర విషయాలూ తెలిశాయి.. అయినా చాలా చిన్నగా ఈ పోస్ట్ ని ముగిస్తాను. 

నా పుట్టెంట్రుకల ఎక్కడ, ఎలా జరిగిందో నాకూ తెలీదు. అప్పట్లో జరిగిన ప్రతి అందమైన మధురానుభూతుల్ని అందరూ గుండెల్లో దాచుకునేవారు కానీ, మళ్ళీ చూసుకోనేలా ఇప్పట్లో ఉన్నంతగా సాంకేతిక అభివృద్ధి అప్పట్లో లేదు. కానీ కాసింత లీలగా గుర్తుంది. ఆ విశేషాలని నా జ్ఞాపకాలుగా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 

నాకు తెలిసిన వివరాల ప్రకారం నా మొదటి పుట్టువెంట్రుకల కార్యక్రమం మాకు దగ్గరలోని ఒక దుర్గ గుడిలో జరిగింది అని మాత్రం తెలుసు. అప్పట్లోనే కెమరాలు పెద్దగా, డబ్బాలాగా ఉండేటివి. అవీ కలర్ కూడా కాదు. బ్లాక్ అండ్ వైట్ లోనివి. వాటితో తీస్తే అంత క్లారిటీ కూడా ఉండేది కాదు. అయినా మరో ప్రత్యామ్నాయం లేక, తప్పేది కాదు. ఆ ఫొటోస్ తీశాక ప్రింటింగ్ & డెవెలప్ కి ఇస్తే నాలుగైదు రోజులకి ఫొటోస్ ఇచ్చేవారు. 

నా పుట్టువెంట్రుకల కార్యక్రమం రోజున నా బంధువులు బాగా వచ్చారు. రవాణా సౌకర్యాలు అంతగా లేకున్నా, వసతులు అంతగా లేకున్నా అయినా కూడా బాగా జరిగింది. అక్కడే ఉన్న నది పాయల్లో బాగా జలకాలాడారు. అవన్నీ ఫొటోస్ తీశారు కూడా. వాటిని ఒకసారి చూశాను కూడా. ఇప్పుడు అవి ఎక్కడ ఉన్నాయో, ఎలా ఉన్నాయో కూడా ఎవరికీ తెలీదు. అలా నా పుట్టువెంట్రుకల కార్యక్రమం మదిలోనే మధురానుభూతులుగా మిగిలిపోయింది. 

మొదటిసారి తలమీద వెంట్రుకల్ని కత్తిరిస్తుంటే, వారు ఏడుస్తుంటే ఇటు జాలీ, వారు కదులుతుంటే ఉండే ఇబ్బంది చూస్తుంటే రకరకాల భావాలు మనలో కలుగుతుంటాయి. అయినా సరే, ఆ మంగలివారు ఎంతో శ్రద్ధగా ఆ పనిని ముగిస్తారు. పిల్లలు ఏడుస్తుంటే అలా చెయ్యాల్సిరావటం వారికి ఇది చాలా ఇబ్బంది పని అనుకుంటాను. 

మీకు చిన్నపిల్లలు ఉంటే మొదటిసారి అలా జుట్టు కత్తిరిస్తుంటే మీరు వాటిని శాశ్వత జ్ఞాపకాలుగా మలచండి. చాలా బాగా అనిపిస్తుంది. అది మీ మీ పిల్లలకి ఇచ్చే అందమైన, అపురూపమైన బహుమతి. ఈ క్రింది ఫోటో చూడండి. ఇలా పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఫోటో తీస్తే - వచ్చే కోడలిపిల్లకి చాలా అపురూపమైన బహుమతి అనే అనుకోవాలి. తన శ్రీవారు చిన్నప్పుడు ఎలా ఏడిచేవారో తెలుసుకొని, ఆటపట్టిస్తూ ఉంటుంది. 


మనదగ్గర అలా ఏమీ లేదు కానీ విదేశాలల్లో మాత్రం ఇలా అందముగా, అలంకరించిన గదుల్లో, ఇలా పిల్లల రంగురంగుల బొమ్మల పుస్తకాలు ఇచ్చి, తల వెంట్రుకలు కత్తిరిస్తారు. ఈ ఐడియా చాలా బాగుంది కదూ.. ఇలా అయితే పిల్లలు బుద్దిగా జుట్టు కత్తిరింపుకి సహకరిస్తారు. 


మంచి జ్ఞాపకముగా మిగలాలీ అంటే - పిల్లల మొదటి పుట్టు వెంట్రుకల్ని ఇలా విదేశాలలో అయితే - తేదీ, వెంట వచ్చిన వారు ఎవరో, అప్పుడు ఆ పిల్లవారికి ఎంత వయస్సు ఉందో ఆ వివరాలు కూడిన ఒక అందమైన సర్టిఫికేట్ తో బాటు కొన్ని వెంట్రుకల్ని ఇలా ప్యాక్ చేసి ఇస్తారు. ఇలా ఒక అందమైన మధురానుభూతిగా మిగిలిపోతుంది. 


నేను అంతగా కాకున్నా, పిల్లల ఫొటోస్ తీసి, అలాగే ఆ ప్రదేశ పేరూ, తేదీ.. లాంటి వివరాలు నమోదు చేసి ఉంచాను. అలాగే కాసిన్ని వెంట్రుకలనీ దాచి ఉంచాను. వారు పెద్దయ్యాక వారికి బహుమతిగా ఇవ్వబోతున్నాను.  

1 comment:

sevalive said...

అభ్యర్ధన :

నమస్తే!
' సేవ' సంస్థ ఆధ్వర్యంలో 'సకల' అంతర్జాల సకుటుంబం (వెబ్సైటు)ను ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సాహిత్య రంగం, మహిళా రంగం, రాజకీయ రంగం, క్రీడా రంగం, ఆధ్యాత్మిక రంగం, సినిమారంగం, విద్య-ఉపాధి, ఆర్ధిక రంగం, కళారంగం, వైద్యం, హాస్యం, బాల్యం, వంటలు ఇత్యాది రంగాలకు సంబంధించి బ్లాగులు , వెబ్ పత్రికలు, వార్తాపత్రికలు ఉన్నాయా?..
అయితే.. ఇంకేం ఆలస్యం.. మీ మీ బ్లాగులు, వెబ్ పత్రికలు, వార్తాపత్రికల పేర్లు, URL లు, నిర్వాహకుల పేర్లు, ఇ -మెయిల్ అడ్రెస్, ఫోన్ నెంబర్లతో వెంటనే... sevalive.com@gmail.com మెయిల్ చేయండి. ఇట్టే అంతర్జాల సకుటుంబం లో అనుబంధం (లింక్) చేస్తాం.
మా ఈ ప్రయత్నానికి సహకరించాలని కోరుతున్నాం.

వ్యాఖ్యానంలో మా అభ్యర్ధనను విన్నపిస్తున్నందులకు అన్యదా భావించ వద్దని కోరుకొంటూ.. మా విజ్ఞప్తిని పదిమందికి తెలిసేలా సహకరించమని అభ్యర్ధిస్తూ...

సదా సేవలో,
-కంచర్ల సుబ్బానాయుడు,
సంపాదకులు, సేవ
http://sevalive.com/

Related Posts with Thumbnails