Friday, April 13, 2012

మా కెమరా రిపేరింగ్.

నిన్న మా డిజిటల్ కెమరా అస్సలు పని చెయ్యలేదు. బ్యాటరీ చార్జింగ్ లేదేమో అని క్రొత్త బ్యాటరీ మార్చాను. అయినా కూడా కెమరా షట్టర్ ఓపెన్ కాలేదు. సాధ్యమైనన్ని పద్ధతులన్నీ చేసి చూశాను. ఊహు!.. అస్సలు కెమరా షట్టర్ కూడా తెరుచుకోవటం కూడా లేదు.

ఇలా కాదనుకొని, దగ్గరలోని తెలిసిన ఫోటో స్టూడియో కి తీసుకెళ్ళాను. ప్రాబ్లెం చెప్పాను. ఆ షాపతను కూడా ప్రయత్నించాడు. ఊహు!. ఫలితమేమీ లేదు.. "అన్నయ్యా!.. ఇది క్రింద పడేసి ఉంటారు. అందుకే అలా అవుతున్నట్లు ఉంది. మీరు సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లటం బెస్ట్. లెన్స్ పోయినట్లయితే, లెన్స్ వేయించటం వేస్ట్.. ఎందుకంటే క్రొత్త లెన్స్ ఎక్కువరోజులు రావు అదేమిటో గానీ. మీకు పదిహేను వందలవరకూ ఖర్చు రావొచ్చును.. " అన్నాడు. అవునా.. అని వచ్చేశాను.

అప్పటికీ ఆ కెమరాతో అక్షరాలా పదహారు వేల ఫోటోలు తీశాను. నేను పెట్టిన డబ్బుల కన్నా ఎక్కువే పొందాను. రూపాయి కన్నా తక్కువకే ఒక్కో ఫోటో పొందాను. అయినా అలా వదిలేయబుద్ధి కాలేదు. ఒక ప్రయత్నం చేశాక, ఇంకో కెమరా కోనేదీ, లేనిదీ ఆలోచించుకోవాలని అనుకున్నాను.

ఇంటికి వచ్చాక అతను అన్నమాట బాగా గుర్తుకువచ్చింది - క్రింద పడేశారూ అనీ. నిజమా అని కెమరా అంతా చూశాను. ఊహు!. అలా ఏమీ లేదు. ఎక్కడో బలమైన షేక్ కి ఉరి అయ్యినట్లు ఉంది. అందుకే అలా కెమరా పనిచెయ్యటం లేదు కాబోలు. అప్పుడే బుర్రలో బల్బ్ వెలిగింది. వర్క్ అవుతుందా? అని కూసింత సందేహం. ప్రయత్నమే పురుష లక్షణం అనుకున్నాను. వస్తే కొండ - లేకుంటే పోయేది దారం అని అనుకున్నాను.

బెడ్ రూం లోని పరుపుల వద్దకి వెళ్లాను. కాసిన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఆ పరుపుల మీద నిలబడి, కాసింత పైనుండి కేమరాని ఆ పరుపుల మీద పడేశాను. మళ్ళీ పైకి ఎగిరి ప్రక్కన పడింది కెమరా. నేల మీద పడకుండా జాగ్రత్త పడ్డాను.

ఇప్పుడు ఆ కేమరాని తీసుకొని, ఒకసారి ఆన్ చేశాను.

((((((((((((((( వావ్ ))))))))))))))))) 

నా కేమరా యధావిధిగా మళ్ళీ పనిచెయ్యటం మొదలెట్టింది. నా కళ్ళనీ, నా చేతలనీ నమ్మలేక పోయాను. అక్కడ జరిగింది నిజమే కదా.. మొత్తానికి నా కెమరా పనిచెయ్యటం జరిగింది. ఒక్కోసారి ఇలాంటి సిల్లీ పనుల వలన కొన్ని లాభాలు ఉంటాయి. 

3 comments:

Rahul said...

wah..nice experiment..

వనజ తాతినేని/VanajaTatineni said...

Inko saari padeyandi:))))

Raj said...

అలా ఇంకోసారి పడేస్తే గానీ, ఇక ఎన్నడూ బాగుకాలేని పరిస్థితి వస్తుంది వనజ గారూ. అప్పటికి గానీ ఆ కేమరాతో రుణానుబంధం తీరిపోదు. హ అహహా హహ..

Related Posts with Thumbnails