నిన్న బ్యాంక్ వద్ద పని ఉండి వెళ్లాను. లోపలి వెళ్ళి వస్తుండగా నా బైక్ వద్ద - అడ్డుగా నల్లని గీతల పసుపు టీ షర్టు , జీన్ ప్యాంట్ లో ఉన్న ఒకడు తచ్చాడుతున్నాడు. నేను రావటం చూసి, కాస్త దూరముగా జరిగి, నన్నే చూస్తున్నాడు. "ఏంట్రా! వీడిని చూస్తుంటే కాస్త తేడాగా ఉంది.." అనుకున్నాను.
నా బైక్ తీస్తున్నాను. ఒకసారి కనుకొలకుల నుండి అతడిని చూస్తూనే ఉన్నాను. నన్ను గమనిస్తూనే ఉన్నాడు. ఇక బైక్ కిక్ కొడుతాను అన్నప్పుడు - అతడిని - ఏమిటీ - అన్నట్లు చూశాను. ఏమైనా మాట్లాడాలా? అన్నట్లు. అతను దగ్గరికి వచ్చాడు. "నా సైకిల్ కనిపించటం లేదు.." అన్నాడు.
"ఆ ఎదురుగా కొన్ని ఉన్నాయి కదా!.. అందులో లేదా..?" అన్నాను. అక్కడ మరికొన్ని మామూలు సైకిళ్ళు, హీరో హోండా మోటార్ సైకిళ్ళు ఉన్నాయి.
"లేదు.. ఇందాక ఇక్కడే పార్క్ చేసి, లోపలి వెళ్లాను. వచ్చేసరికి నా సైకిల్ లేదు.." అన్నాడు.
"ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంది కదా.. అక్కడికి వెళ్ళి ఇక కంప్లైంట్ ఇవ్వు.. అయినా నీ సైకిల్ దొరికేది నమ్మకం తక్కువ. సైకిల్ కొన్న బిల్ ఉందా?.." అన్నాను.
"ఉంది. ఇంటివద్ద ఉంది.." అన్నాడు.
"ఓకే! ఇంకేం అది తీసుకొని కంప్లైంట్ వ్రాసివ్వు.." అనగానే అటు ప్రక్కకి వెళ్ళిపోసాగాడు.
"ఎందుకైనా మంచిది.. కాస్త ఖర్చు బాగానే వస్తుంది.." అనగానే ఆగిపోయాడు. "అసలు సైకిల్ తెచ్చావా? రంగూ, రూపూ ఎలా ఉందో ఐడియా ఉందా?.." అని అన్నాను.
"ఉందన్నా!.. తెచ్చాను.. ఇదిగో సైకిల్ తాళం.. "అని అప్పటిదాకా మూసి ఉంచిన కుడిచేతి గుప్పిట విప్పాడు.
షాక్.. షాక్.. షాక్..!!
ఒకే ఒక సెకనులో పరిస్థితి అర్థం అయ్యింది. కాసింత భయం వేస్తున్న నాకు, అతడితో ఓకే.. అనేసి, బండి కిక్ కొట్టేసి, స్టార్ట్ చేసుకొని అక్కడినుండి, వచ్చేశాను. ఒకసారి అద్దములో వెనక్కి చూశాను. అతను అక్కడి నుండి ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాడు.
ఇంతకీ వాడు గుప్పిట విప్పి చూపినది సైకిల్ తాళం కాదు. దాదాపు మూడు అంగుళాల పొడవున్న హీరో హోండా మోటార్ సైకిల్ తాళం. ఏదో ఒక తాళం తీసుకవచ్చేసి, ఆ తాళం యే బండికి వస్తుందో పెట్టి చూసి, ఒకవేళ అది సరిపోయినట్లయితే - ఆ బండిని దర్జాగా - స్వంత వాహనదారుడిలా స్టార్ట్ చేసుకొని, తీసుకెళ్ళుతాడు అన్నమాట. నా టైం బాగుంది కాబట్టి కాసింతలో మిస్ అయ్యాను. హీరో హోండా బళ్ళు ఎక్కువగా చోరీకి గురి కావటం అనేది కూడా తొందరగా అమ్ముకోవచ్చును, మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ, కాసింత ఈజీగా తాళం తీయోచ్చును.. ట.
6 comments:
దారుణం.
Being a responsible citizen, you should complained in the nearby station. Shame on you.
Manu
అలాటి వారిని ఉపేక్షించకూడదండీ!! నిశబ్ధంగా గమనించి.. పొలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. take care!!
కంప్లైంట్ ఇవ్వొచ్చు. కానీ నా బండి తీయలేదు. దగ్గరగా ఉన్నప్పుడు చూశా. తాళం పెట్టి తీసేటప్పుడు గట్టిగా అడగవచ్చును. లేదా స్టాండ్ తీయగానే పట్టించొచ్చు. తొందరపడి పట్టిస్తే - ఆ కీ ఉన్న బండి వాడి సహచరుడు తీసుకొచ్చి, కాసింత దూరములో పెట్టేసి, ఇక్కడ ఉంది తీసుకపో అన్నాను అని నా ముందు వాడి మీదా, ఆ తరవాత నా మీద వస్తాడు.. నేను ఫూల్ ని అవుతాను. ఇది నా స్నేహితునికి అనుభవమే!.. పైగా మధ్యవర్తిత్వం ఖర్చు పని. అందుకే వచ్చేశాను.
నా బండికి పెట్రోల లాక్ పెట్టించాను
ఫ్రంట్ వీల్ కి కూడా లాక్ పెట్టించాలి
హెచ్చరిక చేసినందుకు ధన్యవాదములు
u r lucky
?!
Post a Comment