Friday, December 16, 2011

కొత్తిమీర - హోల్ సేల్.

మొన్న వేరే పని మీద అలా వెళ్ళేసి, అటునుండి అటే కూరగాయల మార్కెట్ కి ఉదయాన్నే వెళ్లాను. అలా కూరగాయలు కొంటున్న ప్రక్కనే కొద్దిమంది గుంపుగా బేరాలు సాగిస్తుంటే యధాలాపముగా విన్నాను. " ఇంకో కట్ట కూడా వేసేయ్.. మూడు ఇచ్చేసేయ్.. " అని అంటున్నారు. ఏమిటా అని చూశాను.

అక్కడ ఒకతను లుంగీలో కొత్తిమీర కట్టలు పట్టుకోచ్చేసి, దాన్ని నేల మీద పెట్టి, మార్కెట్లో అమ్ముతున్నాడు. పంట పండించినట్లున్నాడు. ఒక్కో కట్ట లావుగా ఉంది. అక్కడికి వచ్చి బేరం చేస్తున్నవారు ఆ మార్కెట్ లో రెగ్యులర్ గా కూరగాయలు అమ్మేవారు. " రెండు కట్టలు కాదు మూడు ఇచ్చేసేయ్.. కిలోకి అంతే వస్తాయి.. రోజూ మేము అమ్ముతాము కదా.. మాకు తెలీదా.. కావాలంటే తూచుదాం.." అని వాళ్ళల్లో ఎవరో అంటే అందరూ సై అన్నారు. అలా వాటిని తూచే సరికి కిలోకి మూడు కట్టలు వచ్చాయి. అది ఇక ఫిక్స్ అయ్యింది. 

నాకూ ఇంట్రెస్ట్ అనిపించి ఎలా కిలో అడిగితే - నన్ను చూసి, ఒక్కళ్ళూ మాట్లాడలేదు. వినియోగదారుడిని అనుకొన్నారులా ఉంది. ఆ అమ్మేవాడినీ అడిగా. ఊహు! చెప్పనే లేదు. అంతా మౌనం. బయట ఆ కట్ట 12 - 16 రూపాయలకి అమ్ముతారు. ఇతడి వద్ద పది రూపాయలకి కి వచ్చినా - రెండు రూపాయల మిగులు లాభం. అలానుకొని ఆగాను. నేను వెళ్ళిపోతానేమో అని చూశారు. ఊహు! దీని అంతు చూద్దామని పట్టుదలగా ఆగాను. 

ఇక లాభం లేదని వారిలో ఒకరు మూడు కిలోలు కొన్నారు. డబ్బులు ఇచ్చేదాకా మౌనం వహించాను. కట్టలు వేసి, తూచి, సంచిలో పెట్టుకోవటం అంతా కావాలనే నెమ్మదిగా చేస్తున్నారు. అయినా ఓపికగా ఎదురుచూశాను. మెల్లగా చేతి సంచి తీసి, అటు తిరిగి డబ్బులు లెక్కపెట్టి, మడిచి మరీ అతడికి ఇచ్చింది. అతను ఇదంతా గమనించక యధాలాపముగా లెక్కపెట్టుకున్నాడు. అప్పుడు అతనితో లెక్కపెట్టాను. 

అవి ముప్ఫై రూపాయలు. 
అంటే మూడు కిలోలు = ముప్పై రూపాయలు.. కిలో పది రూపాయలు

బాప్రే!.. ఇంత చవక బేరం ఎక్కడ దొరుకుతుంది. నాలుగైదు పోచలు ఇచ్చి, అది ఐదు రూపాయలు అంటూ ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. అలా వారి దృష్టిలో - ఒక్కో కట్ట ఎంత లేదన్నా 30 - 35 రూపాయలు విలువ అన్నమాట. కిలోకి ఎంతలేదన్నా వంద రూపాయలు. అంటే - పిచ్చ లాభాలు అన్నమాట. 

ఇంకా ఆగలేదు.. నేనూ రెండు కిలోలు కొన్నాను. ఇరవై రూపాయలు ఇచ్చేసి బయటపడ్డాను. ఇంటికి వచ్చేశాక శ్రీమతి - " ఏమిటండీ!.. ఇంతగా కొత్తిమీర తెచ్చారు.." అంటే జరిగినదంతా చెప్పాను. తరవాత ఏమి చెయ్యాలో కూడా చెప్పాను. ఆ ప్రకారముగా తనూ చేసింది. 

ఇంతకీ అదేమిటీ అంటే - రెండు కట్టలు మేము ఉంచేసుకొని, మా చుట్టూ ప్రక్కల వారికి సమముగా పంచేశాం.. ఎందుకూ ఇది అని అడిగినవారికి కొత్తిమీర పచ్చడి చేసుకోండి.. అని మా సమాధానం. 

2 comments:

reachrala rudhurudu said...

You are like mini Valmart. You created 1 man day unemployemnet for a Dalari.

రసజ్ఞ said...

హహహ బాగుంది!

Related Posts with Thumbnails