Tuesday, December 6, 2011

ఫంక్షన్ లలో ప్లాస్టిక్ గ్లాసులు.

మొన్న ఒక పెళ్ళికి అటెండ్ అయ్యాను.. భోజనాల వద్ద - దాహం వేసి మంచినీటి గ్లాస్ ఇచ్చే సెక్షన్ వద్దకి వచ్చాను. అప్పటికే గ్లాసులు అయిపోయాయి. అక్కడ పనిచేసే ఇద్దరు అబ్బాయిలలో ఒకతను - అప్పుడే ప్లాస్టిక్ గ్లాసులు ప్యాకెట్ విప్పి, ఒక నీటి డ్రమ్ములో ఆ గ్లాసులని వేస్తుంటే - ఇంకో అబ్బాయి, ఆ నీటిని నింపి పెడుతున్నాడు.

ఎంతగా అప్పుడే విప్పి పెట్టినా, తయారీ అప్పుడే - ఎంతో కొంత " ప్లాస్టిక్ డస్ట్" ఉండి తీరుతుంది.. అది ఏమీ కడగక, అలాగే నీరు నింపటం, వాటినే ఆబగా త్రాగటం జరుగుతున్నది. కొందరైతే - ఒక గ్లాసు నీటిని త్రాగాక, దాన్ని పారేసి, ఇంకో ప్లాస్టిక్ గ్లాసు తీసుకొని త్రాగటం.. ఇలా నాలుగైదు గ్లాసులు త్రాగటం జరుగుతున్నాయి. అక్కడే అలా జరిగింది అని కాదు.. ఎక్కడైనా యే శుభకార్యాలలో అయినా - ఇంతే కదా..

వెనకటికి స్టీల్ గ్లాసుల్లో నీరు పెట్టేవారు. ప్రజల్లో సివిక్ సెన్స్ లేకపోవటముతో, నోట్లో పెట్టుకొని త్రాగేవారు కాబట్టి, హై జీన్ పర్పస్ కోసం ఈ ప్లాస్టిక్ గ్లాసులు వాడటం మొదలెట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ప్లాస్టిక్ గ్లాసెస్ వాడటమే! పెద్ద సిటీ అనే కాదు.. చిన్న చిన్న పల్లెటూర్లలోనూ అంతే!.

ప్లాస్టిక్ ని తగ్గిద్దాం తగ్గిద్దాం అనడం ఏమిటో గానీ, ఇంకా ఎక్కువ మొత్తములో వాడటం జరిగిపోతూనే ఉంది..

నామటుకు నేను మాత్రం ఇలాంటి కార్యక్రమాలలో మాత్రం, శుభ్రముగా ఒక గ్లాస్ తీసుకొని, అందులోని ప్లాస్టిక్ డస్ట్ పోయేలా కడుక్కొని, ఎన్నిసార్లు అయినా ఆ గ్లాస్ ని మాత్రమే త్రాగునీరుకి వాడుకుంటాను.. అలా వాడి ప్లాస్టిక్ డస్ట్ నా వంట్లోకి చేరకుండా కాసింత జాగ్రత్తగా ఉంటాను. ఈ పద్ధతి - మీకు నచ్చితే మీరూ పాటించండి. 

3 comments:

జ్యోతిర్మయి said...

మంచి అలవాటు. మా ఇంటిలో ఈ డిస్పోజబుల్ వాడకాన్ని సాధ్యమైనంతగా తగ్గించి వేశాము.

శశి కళ said...

meeru cheppindi nijame kaani recycled metirial to cheste baagundu....okaru taagina danilo taagaalante ibbandi kadaa

Raj said...

అవునండీ..

Related Posts with Thumbnails