Friday, December 31, 2010

Youtube నుండి వీడియోల డౌన్లోడ్.

మీకందరికీ నూత సంవత్సశుభాకాంక్షలు.

మీకు నాకు చెప్పే విషేష్ కి ధన్యవాదములు బదులుగా - యూ ట్యూబ్ నుండి వీడియోలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెబుతాను.. అనుకోకుండా తెలుసుకున్న ఈ విషయాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా చేసి నేను నేను ఎన్నో వీడియోలు యూ ట్యూబ్ లో నుండి డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ క్రింది పద్దతులని ఆచరించి మీరూ అలా చేసుకుంటారని ఆశిస్తున్నాను.

ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది కూడా. ఒక్క యూ ట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ యే కాకుండా, వాటిని ప్లే కూడా చేసుకోవచ్చు, వాటిని కత్తిరించి చిన్నగా చేసుకోవచ్చును. వేరే ఫార్మాట్స్ కి సులభముగా మార్చుకోవచ్చును. అన్నీ ప్లే చేసుకోవచ్చును. అన్నింటికన్నా మించి ఇది ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..

మీకు ఎక్కడైనా బొమ్మలు అర్థం కాకుంటే ఆ ఫోటోల మీద డబల్ క్లిక్ చెయ్యండి..

ముందుగా మీరు ఈ రియల్ ప్లేయర్ లింక్ మీద క్లిక్ చెయ్యండి. అప్పుడు మీరు ఆ సైటు లోకి వెళతారు. అప్పడు ఆ సైటు ఇలా మీకు కనపడుతుంది.


ఇప్పుడు ఓపెన్ చేశారు కదా.. ఓకే. ఇప్పుడు ఆ క్రింది బొమ్మలో చూపించినట్లుగా, ఎర్రరంగు వృత్తాకారము (1) వద్దకి రండి. అక్కడ ఉన్న Real Player - Basic Player ని నొక్కండి.  


ఇప్పుడు వచ్చే దాంట్లో ఎర్రరంగులో ఉన్న Download Now (2) వద్ద నొక్కండీ. నొక్కారా..!! 


అలా నొక్కగానే మీకు Save (3) ఆప్షన్ గల ఒక మెనూ వెంటనే ప్రత్యక్షం అవుతుంది.  అక్కడ ఆ SAVE ఆప్షన్ ని నొక్కండి. మీరు మీ సిస్టం లో ఎక్కడ SAVE చెయ్యాలో నిర్ణయించుకొని సేవ్ చెయ్యండి. అప్పుడు 585 KB సైజులోని ఒక ఫైల్ మీ సిస్టం లో SAVE అవుతుంది.


ఇప్పుడు ఆ ఫైల్ ని వెదికి, దాన్ని ఓపెన్ చెయ్యండి. ఇప్పుడు దాన్ని RUN (4) చెయ్యండి. చేశారా?.. 


ఇప్పుడు ఇలా మీ సిస్టం లో REAL PLAYER ఇన్స్టాల్ అవటానికి ప్రిపేర్ (5) అవుతుంది.  


ఇప్పుడు కాసేపట్లో ఇలా ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ (6) దగ్గర ఉన్న ACCEPT ని నొక్కండి. 


అలా నొక్కగానే - ఇలా ఇంటర్నెట్ లో నుండి ఆ సాఫ్ట్వేర్ మీ సిస్టం లోకి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. బ్రాడ్ బ్యాండ్ ఆయితే (ఇండియాలో ఆయితే 256 kbps) అదంతా జరగటానికి 16 నుండి 18 నిముషాలు పడుతుంది. స్పీడ్ బాగా ఉంటే ఇంకా త్వరగానే అవుతుంది. అదంతా అయ్యేవరకు వేచి చూడండి.  


అలా 100 % శాతం పూర్తయ్యాక ఇలా ఇంకో మెనూ ఓపెన్ అవుతుంది. అందులో (7) వద్ద నున్న REAL PLAYER PLUS వద్ద సెలెక్ట్ చెయ్యండి. మళ్ళీ (8 వద్ద) Continue అవండి.. 


అలా కంటిన్యూ అయ్యారుగా.. ఇప్పుడు ఇంకొకటి పాపప్ విండో వస్తుంది. అందులో (9 వద్ద) మీ ఈ మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ టైపు చేసి, మళ్ళీ పాస్ వర్డ్ మళ్ళీ టైపు చేసి, (10 వద్ద) Next step వద్ద నొక్కండి.  


ఇప్పుడు మీ డెస్క్టాప్ మీద ఇలా రియల్ ప్లేయర్ (11) లా కనిపిస్తుంది.. వచ్చింది కదూ.. OK 


ఇప్పుడు మీరు యూ ట్యూబ్ సైటు http://www.youtube.com/ ఓపెన్ చెయ్యండి. అందులో మీకు నచ్చిన ఒక పాటని, లేదా వీడియో ని ఓపెన్ చెయ్యండి. చేశారా. ఆ వీడియో బఫరింగ్ అయ్యి బొమ్మ వచ్చేదాకా ఆగండి. అలా వీడియో స్టార్ట్ అయ్యాక ఆ వీడియో మీద మీ మౌస్ కర్సర్ ని తీసుకరండి. తీసుకొచ్చారా.. OK . అలా మీరు కర్సర్ ని తీసుకరాగానే మీకు ఆ వీడియో పైన కుడి మూలన Download this video అని (12 న వద్ద ) కనిపిస్తుంది. కనిపించిందా? దాన్ని నొక్కండి. 


ఇప్పుడు ఆ వీడియో మీద ఇలా డౌన్లోడ్ బాక్స్ కనిపిస్తుంది. కనిపించిందా.? అలాగే టాస్క్ బార్ లో కూడా, సిస్టం ట్రే లో కూడా కనిపిస్తుంది. ఇక దాన్ని అలాగే వదిలెయ్యండి. మొత్తం డౌన్లోడ్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ అయిన ఆ వీడియో (డిఫాల్ట్ గా ఆయితే) My డాకుమెంట్స్ > My Videos > Realplayer Downloads లో కనిపిస్తాయి. ఇక ఆ వీడియోలను మీరు ప్లే చేస్తూ, చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు. 


మీకు ఈ నూతన సంవత్సర కానుకగా మీకు ఇది ఇస్తున్నాను.. నేను చూసిన వాటిల్లో, మరియు వాడుతున్న దానిలో - దీనికన్నా మించి యూ టూబ్ వీడియోలని డౌన్లోడ్ చెయ్యటానికి యే సాఫ్ట్వేర్ కనిపించలేదు. అంత బాగా నచ్చేసింది. మీకూ తెగ నచ్చేస్తుందని అనుకుంటాను. ఒక్క యూ ట్యూబ్ లోనివే కాకుండా ఇంటర్నెట్ లోని అన్ని వీడియోలూ దీని ద్వారా కాపీ చేసుకోవచ్చును..


మరొకసారి ఆ  లింక్ : రియల్ ప్లేయర్

మీకు మరొక్కసారి
నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2011

మీ స్పందనని ఆశిస్తున్నాను..

6 comments:

SRRao said...

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

SRRao
శిరాకదంబం

.......... said...

sir, there is something called..
internet download manager. adi install cheskunte.. mana browser lo ye streaming video play avtunnaa adi mana net support cheyyagala maximum speed tho download aipotundi. infact, buffer ayye lopu video download kooda aipotundi :)
meeku telisthe ok.. teliyakapothe try cheyyandi :)

Raj said...

మీ సూచనకి ధన్యవాదములు. నేను ఈ రియల్ ప్లేయర్ వాడక ముందు అదే వాడేవాడిని. సిస్టం అప్డేట్స్ వల్లనో, మరే ఇతర కారణాల వల్ల అది పని చెయ్యలేదు. అప్పుడు రిమూవ్ చేసి క్రొత్తగా ఇన్స్టాల్ చేసినా అంతే.. పని చెయ్యలేదండీ!.. అప్పుడే ఇది రియల్ ప్లేయర్ అనుకోకుండా తెలుసుకున్నాను. నాకు ఇది బాగా ఉపయోగపడింది. బఫర్ అంతా అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఓపెన్ అయినా సరే.. వేరే వీడియో చూసుకున్నాసరే!.. ఇక్కడ డౌన్ లోడ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇంకొన్ని క్రొత్త క్రొత్త పనులూ చేసుకుంటున్నాను.

ఇలా చెప్పి మిమ్మల్ని చిన్న బుచ్చటం లేదు.. అలాని అనుకోవద్దు.. సారీ!

Sudha Rani Pantula said...

హెహెహె.. నాకు తెలియనివి మీరు చెప్పిన బోల్డు విషయాలలో నాకు ముందే తెలిసిన విషయం ఇదొక్కటి ఉందన్నమాట. ఈ రియల్ ప్లేయర్ లో అన్ని వర్షన్లలోను ఈసదుపాయం రాదనుకుంటా...ఒకదాంట్లోనే వస్తుంది.
మిగిలిన వాటికన్నా చాలా అద్ఛుతంగా పనిచేస్తుంది కూడా. డౌన్ లోడ్ పెట్టేసి వేరే పని చేసుకోవచ్చు. నేను ఈ రియల్ ప్లేయర్ని ఇలా వాడుతూ ఓ సంవత్సరం పైనే అయింది.ఎలా చేస్తున్నావ్ అని మావాళ్ళు అడుగుతుంటారు. ఇక మీ టపా లింక్ పంపితే చాలు. అందరికీ అర్థమయేలాగ షేర్ చేసినందుకు థాంక్స్.

Anonymous said...

Thank you.

Raj said...

సుధగారూ.. మన్నించాలి. నాకు రియల్ ప్లేయర్ తో మూడున్నర సంవత్సరాల అనుభవం. దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాల క్రిందటే ఆ విషయం నాకు తెలుసు. కాని డౌన్లోడ్ మేనేజర్ బాగుంటుంది అంటే - అది తీసేసి ఇది వాడా. కాని రియల్ ప్లేయర్ అంత ఈజీగా అనిపించలేదు. ఈ రియల్ ప్లేయర్ లోని ఇతర అంశాలు కూడా బాగా నచ్చాయి. అందుకే రియల్ ప్లేయర్ కి ఫిక్స్ అయ్యాను. కాకపోతే - ఒకరికి చెప్పాను. వారి నుండి తెలుసుకొని, అందరూ నన్ను అడగటం మొదలెట్టేసరికి - ఒక్కొక్కరికీ చెప్పటం భారం గా అనిపించి, ఇక్కడ టపా రూపములో పోస్ట్ చేశాను. ;)

Related Posts with Thumbnails