ఇకనుండీ విషయ పరిచయం నుండి సుత్తి కొట్టక అసలు విషయం కి వద్దామని అనుకుంటున్నాను!
ఎందుకంటే కొంత ఇంట్రో అవ్వాలి - క్రొత్త చెప్పులు, మన్నిక, నిర్వహణ, మెళకువలూ.. ఇవన్నీ చెప్పి బోరు కొట్టకుండా నేరుగా నేను చెప్పాలనుకున్న విషయానికి వస్తాను. (మన్నించాలి.. ఇలా దీర్ఘముగా చెపితే బోరూ, టైపు చెయ్యటానికి శ్రమా, కాల ప్రయాస.. నిరీక్షణలు తప్పుతాయని అనిపించి, దీనివలన క్రొత్త టపాలు తొందరగా పెట్టవచ్చనీ నా ఆశ.)
సాధారణముగా మన పాదరక్షణ కోసమనీ వందల్లో ఖర్చు చేసి, మన పాదాలకి రక్షణనే కాకుండా అందానిచ్చే, సరియైన సైజులో పాదరక్షలని మనము కొంటూ ఉంటాముగా.. అంత ఇష్టపడి కొన్న చెప్పులు సహజముగానే ఎక్కువ కాలము మన్నికని ఇవ్వాలని అనుకుంటాముగా.. ఆ చెప్పుల వెల కన్నా ఇంకో పది రూపాయలు కేటాయించుకోండి. కొన్న చెప్పులతో బాటుగా దారిలో "సూపర్ గ్లూ" పాకేట్లు రెండు కొనండి. [pidilite కంపనీ వారి Feviquick Rs. 5/- లవి రెండు కొంటె సరిపోతుంది.. ఎకనామీ కావాలంటే కాస్త పెద్ద ప్యాక్ ఒకటి కొనండి. సాంకేతిక నామం: Cyanoacrylate adhesive ]
ఇంటికి వచ్చేసారా.. ఇక ఈ పద్ధతులని అనుసరించండి:
1. మీ క్రొత్త చెప్పులను వాటి బాక్స్ నుండి బయటకి తీయండి.
2. Feviquick ప్యాకెట్ ని విప్పి, వాడుటకై రంధ్రమును చేసి సిద్ధముగా ఉంచుకోండి.
3. దీన్ని మీ క్రొత్త చెప్పుల జాయింట్ల వద్ద ఒక్కో చుక్కగా పోయండి. (బేస్ మరియు కప్పుల జాయింట్ల వద్ద)
4. ఇలా రెండు చెప్పులకీ / జతకీ పోయండి..
5. ఒకటి, రెండు నిముషాలు ఆరనివ్వండి ( చలికాలము అయితే ఇంకా ఆలస్యము అవుతుందని గుర్తుపెట్టుకోండి)
6. బాగాఆరిపోయాక ఇంకేం మీ క్రొత్త చెప్పులను శుభ్రముగా వాడుకోండి.
ఇలా అయితే మీ చెప్పులు రెట్టింపు కాలము మన్నికని ఇస్తాయి. మగువల చెప్పులకైతే ఇది చాలా ఉత్తమమైన ఆలోచన. వారి నూడుల్ స్త్రాపుల్లాంటి పట్టీలకి మరింత ధృడత్వాన్ని ఇది ఇస్తుంది. మగవారి షూ లకైననూ ఇది సరియైన ఎంపిక. దారిలో తెగిన చెప్పులకి, తగిన రిపేర్ చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది..

1 comment:
ఎన్ని గ్లులు అంటించినా నా చెప్పులు మరల తెగేవి. రెండు రూపాయిలు ఇచి సరిగ్గా కుట్టిస్తే చాల రోజులు వస్తాయి.
ఇంతకీ ఫెవి క్విక్ కుట్టించే వాడి దగ్గర వరకు తీసుకేల్లటానికి ముందు మనం అతికిఇంచుకోవటానికి మాత్రం పనికి వస్తుంది.
Post a Comment