Wednesday, January 21, 2009

రాజా - ఏదో ఒక రాగం పిలిచిందీ..


చిత్రం: రాజా (1999)
రచన: సిరివెన్నెల
సంగీతం: S.A. రాజ్ కుమార్
గానం: S.P.బాలు
***************
పల్లవి:

ఏదో ఒక రాగం పిలిచిందీవేళ!
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా!! (2)
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా..
జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మేల్కొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు // ఏదో ఒక //

చరణం 1:

వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే
పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే
తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే
తులసిమొక్కలో నీ సిరుల జ్ఞాపకం
చిలకముక్కులా నీ అలక జ్ఞాపకం // ఏదో ఒక //

చరణం 2:

మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే
ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే
కోవెలలోని దీపంలా నీ రూపం జ్ఞాపకమే
పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం
మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం // ఏదో ఒక //

No comments:

Related Posts with Thumbnails